అన్వేషించండి

Shocking: ఏంది మచ్చా ఇది... లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేయడమేంటి? అది కూడా చేరిన రెండు గంటల్లోనే....

ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. ఉద్యోగం ఇచ్చినట్టే ఇచ్చి లావుగా ఉన్నాడని తొలగించారు.

ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి హమీష్ గ్రిఫిన్. ఇతనికి భార్య, కొడుకు ఉన్నారు. ఉన్న ఊరిలో ఉద్యోగం దొరక్క 3,200 కిలోమీటర్లు కుటుంబంతో ప్రయాణం చేసి టాస్మానియాకు చేరుకున్నాడు. ఒక హాలిడే రిసార్ట్ సంస్థలో కొత్త ఉద్యోగం వచ్చింది. ఇంటర్య్వూ ప్రాసెస్ అంతా ఆన్ లైన్లో జరిగింది. ఆఫర్ లెటర్ మెయిల్ వచ్చాక టాస్మానియాకు వచ్చేశాడు హమీష్. మొదటి రోజు జాబ్‌లో చేరాక ఓ రెండు గంటలు పనిచేశాడు. ఈ లోపే అతడిని ఉద్యోగంలోంచి తీసేస్తున్నట్టు చెప్పారు కంపెనీవారు. షాక్ తిన్న హమీష్ ఎందుకో చెప్పమని ప్రశ్నించాడు. దానికి సంస్థ యజమానులు ఇచ్చిన సమాధానం విని దిమ్మదిరిగింది. ‘నువ్వు మరీ లావుగా ఉన్నావు. పనులు చేయలేవేమో అనిపిస్తోంది. ఆ సోఫాను జరుపమన్నా కూడా నువ్వు చేయలేవేమో’అని చెప్పారు వాళ్లు.  వారు చెప్పిన సమాధానం విని చాలా బాధ పడ్డాడు. తన ఆవేదనను ఫేస్‌బుక్ లో పంచుకున్నాడు. ఆ పోస్టు వైరల్ గా మారిపోయింది. 

ఆ పోస్టులో ‘నేను పనిచేయగలనని నిరూపించుకోవడానికి నాకు అవకాశం ఇవ్వలేదు. కానీ నేను పనులు చేయలేనని, నిచ్చెన ఎక్కలేనని, లాన్ మూవర్‌ను నెట్టలేనని, లావుగా ఉన్నానని మాత్రం వారే నిర్ణయించేశారు. పని చేసేటప్పుడు నాకు గాయాలు కావచ్చేమో అని నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నామని చెప్పారు. నేను వారితో ఏకీభవించలేను. ఎందుకంటే నేను క్వీన్స్ ల్యాండ్లోని పార్క్‌కు మేనేజర్‌గా ఎనిమిదేళ్లు పనిచేశాను ’ అని రాసుకొచ్చాడు. అలాగే తన కుటుంబ పరిస్థితిని వివరించాడు. ‘నాకన్నా చాలా అధ్వానమైన ఆర్ధికస్థితిలో చాలా మంది ఉన్నారని నాకు తెలుసు, కానీ మేము ఇప్పుడు నిరాశ్రయులం అయ్యాము. నాకు స్కూలుకెళ్లి చదువుకునే చిన్న పిల్లాడు ఉన్నాడు. వాడిని నేను ఈ ఏడాది స్కూలుకి పంపలేను.  ఈ ఉద్యోగాన్ని నేను ఒక చెడ్డ కలగా భావిస్తున్నాను. నిజానికి ఇది చాలా బాధపెట్టిన సంఘటన’ అని వివరించారు.  ఊబకాయాన్ని ఒక అనారోగ్య మెడికల్ కండిషన్‌గా చూపించడాన్ని అతడు ఖండించాడు. 

అయితే ఈ అంశంపై కోర్టుకెళ్లాడు హమీష్. అతని తరుపు లాయర్లు మాట్లాడుతూ అనారోగ్యానికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేకుండా... ఆరోగ్యకారణాలతో తొలగిస్తున్నామని చెప్పడం వివక్ష కిందకే వస్తుందని అన్నారు.  హమీష్ పోరాటం విజయం సాధిస్తుందో లేదో చూడాలి. కొత్త ఉద్యోగం కోసం టాస్మానియ వచ్చే ముందు క్వీన్స్ ల్యాండ్ లోని తన ఇంటిని కూడా అమ్మేశాడు. ఇది ఇంకా బాధిస్తున్న విషయమని అంటున్నారు హమీష్. 

Also read: ఆ తెగలో పుట్టిన ఆడపిల్లలు అదృష్టవంతులు... పెళ్లయ్యాక కూడా పుట్టిల్లే, అల్లుడే ఇల్లరికం వస్తాడు

Also read: మీ ఇంటి ఆడపిల్ల ఏదైనా సాధించగలదు... అవకాశం ఇచ్చి చూడండి, పెళ్లి చేసి పంపేయకండి

 

టాప్ హెడ్ లైన్స్

Homemade Amla Hair Oil : ఇంట్లోనే ఉసిరి నూనె ఇలా చేసుకోండి.. జుట్టుకు ఎలా అప్లై చేస్తే లాభామో తెలుసా?
ఇంట్లోనే ఉసిరి నూనె ఇలా చేసుకోండి.. జుట్టుకు ఎలా అప్లై చేస్తే లాభామో తెలుసా?
Munagaku Pappu Recipe : మునగాకు పప్పు రెసిపీ.. ఆంధ్రా స్టైల్లో ఇలా చేసుకోండి, రుచితో పాటు ఆరోగ్యం కూడా!
మునగాకు పప్పు రెసిపీ.. ఆంధ్రా స్టైల్లో ఇలా చేసుకోండి, రుచితో పాటు ఆరోగ్యం కూడా!
Waking Up at 3 AM : రోజూ తెల్లవారుజామున 3-4 గంటలకే మెలకువ వస్తోందా? కారణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
రోజూ తెల్లవారుజామున 3-4 గంటలకే మెలకువ వస్తోందా? కారణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
Infused Water : తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి
తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Murala Jyothi: చర్చిపేట నుంచి ఛైర్ పర్సన్ స్థాయికి.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
చర్చిపేట నుంచి ఛైర్ పర్సన్ స్థాయికి.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Andhra Pradesh Rains Update: తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
తీరం దాటినా వణికిస్తున్న మురసు తుపాను.. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయవాడకు బుడమేరు ముప్పు
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
Royal Enfield Himalayan 440: తక్కువ ధరలో అడ్వెంచర్ టూరర్.. కొనేముందు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 440 కొనాలా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు.. ఈ 2 మైనస్‌లు!
YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
The Grand Master OTT : చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
చెస్ బోర్డుపై పేదింటి కుర్రాడి జర్నీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా 'ది గ్రాండ్ మాస్టర్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Malla Reddy Farmhouse: మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
Embed widget