Cancer Risk with Eggs : గుడ్లు తింటే క్యాన్సర్ వస్తుందా? FSSAI చేసిన సంచలన ప్రకటన ఇదే
Eggs and Cancer Risk : గుడ్లు ప్రోటీన్ విటమిన్లు ఖనిజాల నిధి. కండరాలను బలపరుస్తాయి. అయితే ఇవి క్యాన్సర్‌కు కారణమవుతాయా? FSSAI చేసే సంచలన ప్రకటన ఏంటి?

Eggs Increase Cancer Risk : ఈ మధ్యకాలంలో ఫుడ్స్ గురించి సోషల్ మీడియాలో కొన్ని రకాల వార్తలు వస్తున్నాయి. వ్యూస్ కోసం ఏవో అంశాలు చెప్పి.. ఆ కంటెంట్ వైరల్ అయ్యేలా చూసుకుంటున్నారు. అలా కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో గుడ్ల గురించి కూడా కొన్ని రకాల వార్తలు వస్తున్నాయి. కొన్ని బ్రాండ్లు గుడ్లలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్న నైట్రోఫ్యూరాన్ అనే నిషేధిత యాంటీబయాటిక్ ఆనవాళ్లు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఈ విషయంలో FSSAI కూడా ఒక పెద్ద విషయాన్ని వెల్లడించింది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం.
FSSAI వెల్లడించిన విషమిదే..
దేశంలో అమ్ముడయ్యే గుడ్లు పూర్తిగా సురక్షితమని FSSAI క్లారిటీగా తెలిపింది. గుడ్లు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేదని వెల్లడించింది. సోషల్ మీడియాలోని వాదనలు పూర్తిగా తప్పుదారి పట్టించేవని, వాటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెప్పింది. FSSAI ప్రకారం.. పౌల్ట్రీ, గుడ్ల ఉత్పత్తిలో నైట్రోఫ్యూరాన్ వాడకం పూర్తిగా నిషేధించారు. ఒకవేళ ఆనవాళ్లు కనిపించినా అది అరుదైన సందర్భం. అన్ని గుడ్లకు ఇది వర్తించదు. శాస్త్రీయ ఆధారాల ప్రకారం.. ఇంత తక్కువ మోతాదు వల్ల క్యాన్సర్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు రావు.
గుడ్లు ఎందుకు పోషకమైనవి? తినొచ్చా?
గుడ్లలో ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్‌కు ఉంటాయి. వీటిలో విటమిన్ A, B12, D, E, ఐరన్, జింక్, కోలిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కండరాలను బలపరుస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఎముకలను బలపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోజుకు 1-2 గుడ్లు తినడం చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది.
డాక్టర్లు ఏమంటున్నారంటే..
ఢిల్లీలోని అపోలో హాస్పిటల్‌లో సీనియర్ డైటీషియన్ డాక్టర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ.. గుడ్డు సంపూర్ణ ప్రోటీన్‌కు అద్భుతమైన మూలం అని తెలిపారు. ఇది కండరాల నిర్మాణానికి, మెదడు ఆరోగ్యానికి, కళ్ళకు మంచిదని చెప్పారు. FSSAI నివేదిక ప్రకారం.. పుకార్లు తప్పు అని స్పష్టమైంది. రోజూ గుడ్లు తినడం వల్ల ఎలాంటి క్యాన్సర్ రాదు. గుడ్లలో కోలిన్ ఉంటుందని.. ఇది మెదడు, కాలేయానికి అవసరమని ఆయన అన్నారు. ఇది మహిళలకు, పిల్లలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. క్యాన్సర్ పుకార్లతో భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.
గుడ్లను ఎలా తినాలంటే..
- గుడ్డు పచ్చిగా కాకుండా ఉడకబెట్టి లేదా పగలకొట్టి ఉడికించుకోవడం ఉత్తమం.
- వేయించినవి తక్కువగా తినండి.
- కూరగాయలతో కలిపి తింటే మరీ మంచిది.
- మంచి బ్రాండ్ లేదా ఫార్మ్ ఫ్రెష్ గుడ్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.






















