అన్వేషించండి

Mental Health : డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? ఆందోళనను తగ్గించే ఈ సింపుల్ Yoga Techniques ట్రై చేయండి

Anxiety and Depression : కొత్త సంత్సరంలో డిప్రెషన్, ఒత్తిడి ఆందోళనను దూరం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు మానసిక ఆరోగ్యం కోసం ఈ సింపుల్ యోగా టెక్నిక్స్ ఫాలో అయిపోండి.

Yoga Techniques to Reduce Anxiety and Depression : వేగంగా మారుతున్న ప్రపంచంలో మానసిక ఆరోగ్యం కూడా వేగంగా దెబ్బతింటుంది. దీనివల్లే చాలామందిలో డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన వంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. మీరు కూడా అలాంటి వారిలో ఒకరు అయితే ఆగండి. కాస్త బ్రేక్ తీసుకుని.. బ్రీత్ తీసుకోండి. ఇది మీరు ఒత్తిడిని తగ్గించుకుని.. మీతో మీరు తిరిగి కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ధ్యానం, సింపుల్ యోగా టెక్నిక్స్​తో డిప్రెషన్‌ను దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు యోగా నిపుణులు. కొత్త సంవత్సరంలో మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే.. ఫాలో అవ్వాల్సిన సింపుల్ యోగా టెక్నిక్స్ (Yoga Practices to Reduce Depression) ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

ధ్యానంతో డిప్రెషన్‌ ఎలా దూరమవుతుందంటే..

డిప్రెషన్ అనేది మనస్సును ఒకే విషయంపై మళ్లీ మళ్లీ ఆలోచించేలా చేస్తుంది. వ్యక్తిగత విమర్శకు దారి తీస్తుంది. ఎమోషనల్​గా వీక్ చేసి.. అదే లూప్​లో ఉండేలా చేస్తుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ధ్యానం చేయడం మంచిదని చెప్తున్నారు యోగా నిపుణులు. ఇది గతం, లేదా ఫ్యూచర్ గురించి కాకుండా ప్రెజంట్​లో ఉండేలా హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. శ్వాస తీసుకోవడం, శరీర అనుభూతులు.. కదలిక లేదా ధ్వనిపై దృష్టి సారించడం ద్వారా.. మనస్సులోని ప్రతికూల ఆలోచనలు దూరం అవుతూ ఉంటాయి. రెగ్యులర్​గా చేస్తే మానసిక స్థితి మెరుగవ్వడం, ఒత్తిడి తగ్గడం జరుగుతుంది. మెరుగైన నిద్రకు హెల్ప్ చేస్తుంది. ఎమోషనల్​గా బ్యాలెన్స్​గా ఉండగలుగుతారు. 

డిప్రెషన్‌ను దూరం చేసే టెక్నిక్స్ 

యోగా అనేది శారీరక కదలిక, శ్వాస నియంత్రణ, ధ్యానాన్ని మిళితం చేస్తుంది. కొన్ని టెక్నిక్స్ భావోద్వేగ విడుదల అంతర్గత సమతుల్యత, నాడీ వ్యవస్థను రిలాక్స్ చేస్తాయి. సరైన పద్ధతిలో అవలంభిస్తే యోగా ద్వారా మానసిక, శారీరక శ్రేయస్సు మెరుగవుతుంది.

  • శ్వాసపై అవగాహన : శ్వాసపై అవగాహన ముఖ్యం. ధ్యానం చేసేప్పుడు శ్వాస, ఉచ్ఛ్వాసపై దృష్టి సారించాలి. మీరు ఓ చోట కూర్చోని బ్రీత్ తీసుకోలేకపోతున్నప్పుడు.. మీరు రోజువారి పనులు చేసేప్పుడు మీ బ్రీతింగ్​పై ఫోకస్ చేయండి. కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు మీరు ఎలా బ్రీత్ తీసుకుంటున్నారనే దానిపై ఫోకస్ చేయండి. దానికి మీ శరీరం ఎలా రెస్పాండ్ అవుతుందో తెలుసుకోండి. దీనివల్ల మీకు తెలియకుండానే నెగిటివ్ థాట్స్ దూరమవుతాయి. ప్రశాంతంత పెరుగుతుందని చెప్తున్నారు. 
  • ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ : ఈ టెక్నిక్​లో శ్వాసపై దృష్టి పెట్టడానికి బదులుగా.. మనస్సును శాంతపరచడానికి పునరావృతమయ్యే ధ్వని లేదా మంత్రాన్ని ఉపయోగిస్తారు. లయబద్ధమైన మ్యూజిక్ లేదా మంత్రం మానసిక గందరగోళాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. లోతైన విశ్రాంతిని అందిస్తుంది. కాలక్రమేణా ఒత్తిడి తగ్గడానికి, మానసిక స్థితి మెరుగుపడటానికి హెల్ప్ చేస్తుంది.
  • నడిచేప్పుడు ధ్యానం : నడకతో చేసే ధ్యానం సున్నితమైన కదలికతో మైండ్‌ఫుల్ అవగాహనను పెంచుతుంది. ప్రతి అడుగు వేసేప్పుడు.. శ్వాస, శారీరక అనుభూతిపై శ్రద్ధ చూపించాలి. ఇది మనస్సును శాంతపరిచే ధ్యాన లయను సృష్టిస్తుంది. ఇది మిమ్మల్ని ప్రెజెంట్​లో ఉండేలా చేస్తుంది.
  • మైండ్‌ఫుల్ వర్క్స్ : ఇంటిని శుభ్రం చేయడం, గిన్నెలు కడగడం లేదా తోటపని వంటి పనులు శరీరాన్ని పూర్తిగా కదలికలో ఉండేలా హెల్ప్ చేస్తాయి. ఇవి మనస్సును శాంతపరచగలవు. ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి.
  • జపం : జపం దృష్టిని కేంద్రీకరించడానికి, మనస్సును శాంతపరచడానికి హెల్ప్ చేస్తుంది. పదాలు లేదా శబ్దాలను పునరావృతం చేయడం వల్ల భావోద్వేగాలను నియంత్రించుకోవచ్చు. లేదా నెంబర్స్ లెక్కపెట్టవచ్చు. 

ఈ టెక్నిక్స్ అన్ని మిమ్మల్ని ఆందోళనకు దూరం చేయడంలో, ప్రెజెంట్​లో మైండ్ ఉండడంలో హెల్ప్ చేస్తాయి. అయితే పరిస్థితి తీవ్రతను బట్టి మెడికల్ హెల్ప్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ రెగ్యులర్​గా యోగా చేయడం వల్ల సమస్యను చాలావరకు దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు నిపుణులు.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 7 : అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 7వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ మహాలక్ష్మీ దేవికి పూర్ణాలు, పాలన్నం ఇలా చేసేయండి
Dussehra Navratri Day6 : అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
అమ్మవారికి 6వ రోజు పెట్టాల్సిన నైవేద్యాలు ఇవే.. శ్రీ సరస్వతి దేవికి పరవాన్నం ఇలా చేసేయండి
White Chicken : నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
నోరూరింటే వైట్ చికెన్ కర్రీ.. 10/10 రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఇదే.. పక్కా ట్రై చేయండి
Beer vs Breezer : బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే
బీర్‌కు, బ్రీజర్‌కు తేడా ఏంటి? ఆల్కహాల్‌ శాతం, ఆరోగ్యంపై ప్రభావాలు, అసలు తేడాలు ఇవే

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget