Frequent Memory Loss : మతిమరుపు ఎక్కువైందా? తరచూ మరచిపోవడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Memory Loss : ఈ మధ్యకాలంలో మతిమరుపు చాలామందిలో కనిపిస్తుంది. అసలు ఇలా మరచిపోవడానికి కారణాలు ఏంటి? నిపుణులు ఇస్తోన్న సూచనలు ఏంటి వంటి విషయాలు చూసేద్దాం.

Forgetfulness Reasons : ఒకప్పుడు భలే భలే మగాడివోయ్ సినిమాను చూసి అందరూ నవ్వుకున్నారు కానీ.. ఇప్పుడు దాదాపు అందరి పరిస్థితి అలాగే మారిపోయింది. అందులో హీరోకి చిన్నప్పటి నుంచి మతిమరుపు సమస్య ఉంటే.. ఇప్పుడు వివిధ కారణాలతో మతిమరుపు వస్తుంది. నీకో విషయం చెప్పాలి అంటూనే.. అయ్యో మరచిపోయానే అనేస్తున్నారు. ఒకరికో ఇద్దరికో కాదు.. చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.
మతిమరుపు ఇలా కలగడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే ఇది చిన్న విషయాల్లో జరిగితే పర్లేదు కానీ.. పెద్ద విషయాలు మరిచిపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ఈ సమస్య ఎందుకు వస్తుందో గుర్తించాలి. అలాగే దానినుంచి ఎలా భయటపడాలో కూడా తెలుసుకోవాలి. మరి నిపుణులు ఏమి సూచనలిస్తున్నారో.. దేనివల్ల మతిమరుపు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మతిమరుపునకు కారణాలివే..
వయసు : వయసు పెరిగే కొద్ది సహజంగా బ్రెయిన్ సహజంగానే జ్ఞాపకశక్తిని కోల్పోతూ ఉంటుంది. మతిమరుపు రావడం, దానిని గుర్తు తెచ్చుకోవడం కష్టమవుతుంది.
ఒత్తిడి : ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు బ్రెయిన్‌పై నెగిటివ్‌గా ఎఫెక్ట్ చూపిస్తాయి. దీనివల్ల బ్రెయిన్ ఫంక్షన్ దెబ్బ తిని
మతిమరుపు ఎక్కువ అవుతుంది. విషయాలు గుర్తు చేసుకుంటే గుర్తురావు.
నిద్ర : సరైన నిద్ర లేకపోవడం, నిద్ర సమస్యలతో ఇబ్బందులు పడడం, నాణ్యమైన నిద్ర లేకపోవడం వల్ల కూడా మతిమరుపు వస్తుందని చెప్తున్నారు.
మందులు : వివిధ ఆరోగ్య అవసరాల కోసం ఉపయోగించే మందులు కూడా మతిమరుపునకు దారి తీస్తాయట.
పోషకలోపం : కొన్ని పోషకాలు శరీరానికి అందకపోడం వల్ల కూడా బ్రెయిన్ ఫంక్షన్ దెబ్బతింటుంది. బి1, బి 12 వంటి పోషకాల లోపం ఉంటే ఈ సమస్య ఎక్కువ అవుతుందట.
ఆరోగ్య సమస్యలు : అల్జీమర్స్, స్ట్రోక్, బ్రెయిన్ ట్యూమర్స్, ఇతర ఇన్ఫెక్షన్లు కూడా మతిమరుపునకు దారి తీస్తాయట. తలకు ఏవైనా గాయాలైనా కాడూ షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ మెమోరీ సమస్యలు వస్తాయట. థైరాయిడ్, లివర్, కిడ్నీ సమస్యలు, డీహైడ్రేషన్ వల్ల కూడా మతిమరుపు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆల్కహాల్ వినియోగం కూడా మతిమరుపనుక దారి తీస్తుందట.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..
మతిమరుపు అప్పుడప్పుడు వస్తే కామనే కానీ.. ఎక్కువసార్లు రావడం, జ్ఞాపకశక్తిని కోల్పోవడం, మాటాలు మరచిపోవడం, ప్లాన్స్ గుర్తుకురాకపోవడం ఎక్కువసార్లు జరిగితే వైద్యసహాయం తీసుకోవాలి అంటున్నారు. దీనివల్ల కారణాన్ని గుర్తించి దానిని సరి చేసుకునే అవకాశముందని చెప్తున్నారు.
జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోండిలా..
రోజూ 7 నుంచి 9 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. నాణ్యమైన నిద్ర ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు మతిమరుపును దూరం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించే టెక్నిక్స్ ఫాలో అవుతూ ఉండాలి. యోగా, మెడిటేషన్ వంటివి ట్రై చేయవచ్చు. లేదంటే థెరపీ సెషన్స్‌కి వెళ్లొచ్చు. హెల్తీ ఫుడ్ కూడా బ్రెయిన్ హెల్త్‌కి సపోర్ట్ చేస్తుంది. మీ డైట్లో పండ్లు, కూరగాయలు, హెల్తీ ఫ్యాట్స్ ఉండేలా చూసుకోవాలి.
కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, చదవడం, బ్రెయిన్‌కి సంబంధించిన గేమ్స్ ఆడడం వల్ల కూడా బ్రెయిన్ షార్ప్ అవుతుంది. కచ్చితంగా చేయాల్సిన పనులు ముందుగా నోట్ చేసుకోవడం, రిమైండర్స్ పెట్టుకోవడం వంటి చేస్తూ ఉంటే ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండేలా చూసుకోండి. మెదడుకు రక్తప్రసరణ పెంచి యాక్టివ్‌గా ఉండడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది.






















