Brain Boosters : బ్రెయిన్‌ని యాక్టివ్‌గా ఉంచే ఫుడ్స్ ఇవే.. ఏకాగ్రతను కూడా పెంచుతాయట
Brain Health : బ్రెయిన్ హెల్త్‌ని బూస్ట్ చేసే కొన్ని ఫుడ్స్ ఉంటాయి. ఇవి మీకు జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుతాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇంతకీ అవి ఏంటో.. ఎలా పనిచేస్తాయో చూసేద్దాం.
Foods For Brain : ప్రపంచం పరుగెడుతుంది. వివిధ ఏఐ టూల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ సమయంలో కూడా మనం బ్రెయిన్ యాక్టివ్‌గా లేకుంటే జాబ్స్ ఉంటాయో.. పోతాయో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. మీరు ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయిని చేరుకోవాలంటే మీకు కచ్చితంగా షార్ప్ మైండ్ ఉండాలి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత లేకుంటే అనుకున్న స్థాయిని చేరడం చాలా కష్టమవుతుంది. శారీరకంగా, మానసికంగా కూడా చురుకుగా ఉండాల్సిన సమయం ఇది.
కొన్ని ఫుడ్స్‌తో చెక్ పెట్టొచ్చు..
శారీరకంగా, మానసికంగా యాక్టివ్‌గా ఉండాలంటే మీ మెదడు హెల్తీగా ఉండాలి. ఇది శరీరంలోని అన్ని భాగాలను యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. వివిధ అవయవాలకు భావేద్వగ, ప్రతి స్పందన, భౌతిక చర్యల నియంత్రణ అన్నింటిపై మెదడు బాధ్యత వహిస్తుంది. నాడీ సంబంధిత ప్రతిస్పందనలు, హార్మోన్ల కంట్రోల్, జీర్ణక్రియ మెరుగుపరచడం, రక్తపోటు ఇలా ఒకటా రెండా అనేక సంకేతాలకు బ్రెయిన్ మూలకారణం. ఇది ఇతర సంకేతాలను సమన్వయం చేసి.. యాక్టివ్‌గా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. వయసు పెరిగే కొద్ది కొందరిలో దీని సామర్థ్యం తగ్గుతూ ఉంటుంది. మరికొందరు చిన్న నాటి నుంచి మెదడుకు సంబంధించిన రుగ్మతలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల వారి మెదడు పని తీరు మెరుగవుతుంది. అంతేకాకుండా యాక్టివ్‌గా ఉంటారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
ఆయుర్వేదంలో కొన్ని మూలికలు న్యూరోట్రాన్స్మిటర్ పనితీరును మెరుగుపరుస్తాయి అంటున్నారు నిపుణులు. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగడంతో పాటు.. మొత్తం అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది అంటున్నారు. ఒత్తిడి, మానసిక అలసట, వయసు సంబంధిత అభిజ్ఞా క్షీణత సమస్యలను దూరం చేస్తాయట. అంతేకాకుండా విద్యార్థులకు కూడా ఇవి మంచి ఫలితాలు ఇస్తాయట. సహజంగా మెదడుకు బూస్ట్‌ను అందించి.. సమర్థవంతమైన పరిష్కారాలు అందిస్తాయి అంటున్నారు నిపుణులు.
బ్రహ్మి
బ్రహ్మిని ఎప్పటినుంచే ఆయుర్వేదంలో వివిధ ఆరోగ్య సమస్యలకు ఉపయోగిస్తున్నారు. ఇది జ్ఞాపకశక్తిని, అభిజ్ఞా పని తీరును మెరుగుపరస్తుంది అంటున్నారు. దీనిలో బాకోసైడ్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మెదడులోని నాడీ కణాల పెరుగుదలకు, న్యూరోట్రాన్స్మీటర్ పనితీరును మెరుగుపరచడానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. పిల్లలకు దీనిని సప్లిమెంట్‌గా ఇస్తే వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అభ్యాస సామర్థ్యం, ఏకాగ్రత మెరుగవుతుందని పలు అధ్యయనాలు నిరూపించాయి.
జింగో బిలోబా
ఇది జ్ఞాపకశక్తిని పెంపొందించే లక్షణాలను కలిగి ఉంటుంది. జింగో బిలోబాను చైనీస్ వైద్యంలో ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నారు. ఈ పురాతనమైన జింగో బిలోబా ఆయుర్వేదంలో ఎన్నోఅద్భుతాలు చేస్తుంది. ముఖ్యంగా మెదడుకు రక్తప్రవాహాన్నిమెరుగుపరుస్తుంది. ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. పెద్దవారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతుంది. అల్జీమర్స్ చికిత్స్లో కూడా ఇది మెరుగైన ఫలితాలు చూపిస్తుంది.
మరిన్ని..
పానాక్స్ జిన్సెంగ్ అనే హెర్బ్ కూడా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అందుకే దీనిని చాలామంది సప్లిమెంట్‌గా తీసుకుంటారు. ఇది దృష్టి, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. గోల్డెన్ రూట్ కూడా మీ మానసిక తీరు మెరుగుపరుస్తుంది. ఇది అలసటను తగ్గించి.. ఒత్తడిని దూరం చేస్తుంది. మెదడులో సెరోటోనిన్, డోపమైన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. ఏకాగ్రతను పెంచడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. లయన్స్ మేన్ మష్రూమ్ కూడా న్యూరోప్రొటెక్టివ్ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన ఔషధం. ఇది మెదడు కణాలను యాక్టివ్ చేస్తుంది. సహజంగా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకునేవారికి ఇవి మంచి ఎంపిక అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
Also Read : వేసవిలో మూత్రం రంగు పసుపుగా ఉంటుందా? ఇది ఆ సమస్యకు సంకేతమట
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.