Urine Color : వేసవిలో మూత్రం రంగు పసుపుగా ఉంటుందా? ఇది ఆ సమస్యకు సంకేతమట
Summer Care : సమ్మర్లో హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా అవసరం. లేదంటే శారీరకంగా, బ్యూటీపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మూత్రం రంగులో మార్పు కూడా ఓ సమస్యకు సంకేతంగా చెప్తున్నారు.
Dehydration In Summer : శరీరం ఎక్కువ శాతం నీటితో నిండి ఉంటుంది. ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని, శ్రేయస్సుని నిర్వహించడంలో సహాయం చేస్తుంది. శారీరక, మానసిక, బ్యూటీని రక్షించుకోవడంలో నీరు ముఖ్యపాత్ర పోషిస్తుంది. వివిధ ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో కూడా నీరు ఉపయోగపడుతుంది. అయితే కొందరు నీటిని ఎక్కువగా తీసుకోరు. కనీసం రోజులో ఒక లీటర్ తాగారంటే ఎక్కువ అనే చెప్పవచ్చు. అయితే ఇది చాలా ప్రమాదకరమైనది అంటున్నారు నిపుణులు. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు. ముఖ్యంగా వస్తున్న సమ్మర్లో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఎలా ఉంచుకోవాలో సూచనలు ఇస్తున్నారు.
అవయవాలన్నీ.. నీటితోనే
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు నీరు, ఎలక్ట్రోలైట్లు, లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలి. వివిధ ఆహారాల రూపంలో కూడా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు. ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా సమ్మర్లో మీరు కచ్చితంగా నీటిని ఎక్కువగా తీసుకోవాలి అంటున్నారు. అయినప్పటికీ చాలామంది దీనిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, చర్మం మొదలైనవన్నీ అవయవాలు నీటితోనే ముడిపడి ఉంటాయి. ఎముకల్లో కూడా 31 శాతం నీరు ఉంటుంది. కాబట్టి మీరు హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా అవసరం.
నీటితో పాటు.. ఆ ఫుడ్స్ కూడా..
అయితే మీరు సమ్మర్లో మీరు హైడ్రేట్‌గా ఉండేందుకు కొన్ని చిట్కాలు ఫాలో అవ్వొచ్చు. నీరు రెగ్యూలర్‌గా తీసుకోవడంతో పాటు.. తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవచ్చు. ఇవి మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా.. మిమ్మల్ని హెల్తీగా ఉంచడంలో సహాయం చేస్తాయి. సమ్మర్లో నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే ఎంత మంచిదో. లంచ్ చేస్తున్నప్పుడు సగం భోజనంతో పాటు.. సగం ఫ్రూట్స్ లేదా కూరగాయలతో నింపితే మంచిది అంటున్నారు.
మూత్రంలో రంగు మార్పు ఉంటే..
హెడ్రేటెడ్‌గా, హెల్తీగా ఉండేందుకు మీరు గ్రీన్ టీని రెగ్యూలర్‌గా తీసుకోవచ్చు. రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండేందుకు మీరు రెగ్యూలర్‌గా తీసుకోవాలి. మూడు నాలుగు గంటలకు ఓ సారైనా ఓ గ్లాస్ నీటిని తాగేలా ప్లాన్ చేసుకోవాలి. రాత్రుళ్లు పడుకుంటారు కాబట్టి.. ఆ నీటిని కూడా డే టైమ్‌లో తాగితే మంచిది. అయితే రాత్రి సమయంలో నిద్ర లేవకూడదు గాఢంగా నిద్ర పోవాలంటే మీరు నీటిని తాగడం 8 గంటలతో ముగించాలి. మీరు హైడ్రేటెడ్‌గా ఉన్నారో లేదో మీ మూత్రం రంగు సూచిస్తుంది. పసుపు రంగులో ఉంటే మీరు తగినంత హైడ్రేటెడ్‌గా లేరని అర్థం. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం కోసం మీరు ఎలక్ట్రోలైట్లను కూడా తీసుకోవచ్చు. ఈ లవణాలు నీటిలో కరిగి మీ ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. అంతేకాకుండా మీకు ఎనర్జీని అందిస్తాయి.
రోజూ ఎంత నీరు తాగాలి?
మెరుగైన శరీర పనితీరు కోసం నీటిని తాగాలి కరెక్టే. అయితే ఎంత నీరు తాగాలి అనేది అందరిలో ఉండే ప్రశ్నే. మీరు రోజు ఎంత నీరు తాగాలి అనేది.. మీ శరీర పనితీరు.. మెటబాలిజం నిర్వాహణ, మీరు ఉండే వాతావరణం, శరీర కొవ్వు శాతం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. అయితే సగట భారతీయుడు రోజుకు 2.5 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు కొబ్బరి నీళ్లు, సూప్, పండ్ల రసాలు తాగవచ్చు. కెఫిన్ వంటి డ్రింక్స్ తాగితే మీరు త్వరగా డీహైడ్రేట్ అయిపోతారు.
Also Read : నిద్ర రావట్లేదా? అయితే పడుకునేముందు ఈ ఫ్రూట్ తినండి మంచి నిద్ర మీ సొంతమవుతుంది