(Source: ECI/ABP News/ABP Majha)
Tips for better sleep : నిద్ర రావట్లేదా? అయితే పడుకునేముందు ఈ ఫ్రూట్ తినండి మంచి నిద్ర మీ సొంతమవుతుంది
Sleeping Issues : కొన్నిసార్లు ఎంత ట్రై చేసినా నిద్ర రాదు. ఆ సమయంలో ఓ ఫ్రూట్ తింటే మెరుగైన నిద్ర మీ సొంతం అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ ఫ్రూట్ ఏంటి?
Healthy Fruit for Better Sleep : ఇంట్లో, ఆఫీస్లో ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రి నిద్ర పట్టడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ సరైన నిద్ర లేకపోతే శారీరకంగా, మానసికంగా హెల్త్ కరాబ్ అవుతుంది. మనకున్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గేవి సరైన నిద్ర ఉన్నప్పుడే. లేదంటే పరిస్థితి విషమిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా సరైన నిద్ర లేకుంటే ఆ భారం తర్వాత రోజు చేయాల్సిన పనిపై ఒత్తిడి పడుతుంది. కాబట్టి నిద్ర విషయంలో అస్సలు రాజీపడకూడదంటున్నారు నిపుణులు.
మెరుగైన నిద్రను అందించే టిప్స్ ఇవే..
పడుకునే ముందు కాస్త గోరువెచ్చగా ఏదైనా తాగి పడుకుంటే మంచి నిద్ర మీ సొంతమవుతుంది. లేదంటే ప్రశాంతతను అందించే పాటలు కొంత సేపు వినొచ్చు. పడుకునే ముందు మీ రూమ్లో ఒత్తిడి లేని వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. అయితే నిద్ర అనేది మేజర్గా మనం తీసుకునే ఫుడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అందుకే పడుకునే ముందు ఎక్కువ ఫుడ్ తీసుకోకూడదు. ఇది త్వరగా జీర్ణం కాకపోవడంతో పాటు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి లైట్ ఫుడ్ తీసుకోవాలి. కానీ కొన్ని ఆహారాలు మీ మెదడును ప్రశాంత పరిచి మెరుగైన నిద్రను అందిస్తాయి. వాటిలో అరటి పండు ఒకటి అంటున్నారు నిపుణులు.
మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది..
పడుకునే ముందు అరటి పండు తింటే మెరుగైన నిద్ర మీ సొంతం అంటున్నారు నిపుణులు. వీటిలో నిద్రను ప్రోత్సాహించే పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఇవి నిద్రను ప్రేరిపిస్తాయని చెప్తున్నారు. నిద్రను ప్రోత్సాహించే అమైనో ఆమ్లం ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగపరిచి విశ్రాంతిని అందిస్తుందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా సెరోటోనిన్ మెలటోనిన్గా మారి నిద్రను మెరుగుపరుస్తుంది అంటున్నారు. తద్వారా ప్రశాంతమైన నిద్ర మీ సొంతమవుతుంది.
నొప్పులు తగ్గుతాయి..
చాలామంది పని చేసి వివిధ నొప్పులతో పడుకుంటారు. మీ కండరాలకు విశ్రాంతి కావాలనుకుంటే మీరు అరటిపండు తీసుకోవచ్చు. దీనిలోని మెగ్నీషియం, పొటాషియం మీకు మెరుగైన నిద్రను అందిస్తాయి. ఇవి కండరాల ఒత్తిడిని తగ్గిస్తాయి. తద్వార మీ శరీరం రిలాక్స్ అయి నిద్రను ప్రేరేపిస్తుంది.
ప్రశాంతమైన నిద్ర మీ సొంతం
అరటిపండులో అవసరమైన కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. నిద్రపోయే ముందు అధిక కార్బోహైడ్రేట్లు కలిగిన ఫుడ్ తీసుకోవద్దని నిపుణులు చెప్తారు. కానీ.. అరటిపండ్లలోని సహజమైన చక్కెరలు రాత్రి సమయంలో తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయంటున్నారు నిపుణులు. అర్థరాత్రి మీకు ఎలాంటి ఆకలి లేకుండా.. ఆకలి వల్ల నిద్రకు దూరమవకూడదంటే మీరు దీనిని కచ్చితంగా తీసుకోవచ్చు. అంతేకాకుండా కడుపు నిండుగా ఉన్నప్పుడు మంచి నిద్ర కూడా మీకు అందుతుంది. మరి ఇంకేం ఆలస్యం రాత్రులు అన్ హెల్తీ స్నాక్స్ తినే బదులు హాయిగా ఓ అరటిపండు తిని నిద్రపోండి.
Also Read : మెరిసే చర్మం కోసం యోగర్ట్ను ఇలా వాడండి.. టాన్ వదిలించుకోవడానికి బెస్ట్ ఆప్షన్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.