అన్వేషించండి

Food and Health: డేంజర్.. డేంజర్.. ఈ ఫుడ్ ఐటమ్స్‌ని ఫ్రిజ్‌లో అసలు పెట్టొద్దు

కొన్ని కూరగాయలు, పండ్లను ఫ్రిజ్‌లో పెడితే వాటి సహజ గుణాలను కోల్పోతాయి. ఒక్కోసారి అవే మన అనారోగ్యానికి కారణమవుతాయి. 

కూరగాయలు, పండ్లు... ఇలా ఏవైనా బయటి నుంచి కొనుక్కురాగానే శుభ్రం చేసి రెండు మూడు రోజుల తర్వాత కూడా ఫ్రెష్‌గా ఉండాలని ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. కానీ, కొన్ని కూరగాయలు, పండ్లను ఫ్రిజ్‌లో పెడితే వాటి సహజ గుణాలను కోల్పోతాయి. ఒక్కోసారి అవే మన అనారోగ్యానికి కారణమవుతాయి. 


Food and Health: డేంజర్.. డేంజర్.. ఈ ఫుడ్ ఐటమ్స్‌ని ఫ్రిజ్‌లో అసలు పెట్టొద్దు

ఈ పదార్థాలను మాత్రం ఎప్పుడూ ఫ్రిజ్‌లో పెట్టకండి. వీటికి గది ఉష్ణోగ్రతే సరిపోతుంది. ఇంతకీ ఆ పదార్థాలు ఏంటి? ఫ్రిజ్‌లో పెడితే ఏమౌతుందో ఇప్పుడు చూద్దాం.

టమాటాలు

ఒకవేళ మీరు టమాటాలు ఫ్రిజ్‌లో పెడితే వాటి యొక్క రిచ్, ఫ్లేవర్ పోతుంది. దీంతో మనం ఏదైనా వంటకం చేస్తే రుచి ఉండదు. కాబట్టి ఈ సారి మీరు ఇంటికి టమాటాలు తీసుకువస్తే శుభ్రం చేసిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టకుండా బయట గది ఉష్ణోగ్రత వద్దే ఉంచండి.   

అరటికాయలు

అరటికాయలను ఫ్రిజ్‌లో పెడితే తొందరగా నల్లబడిపోతాయి. ఇలా నల్లబడిన అరటికాయలను తినడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపరు. ఫ్రిజ్‌‌లో పెట్టకుండా ఎక్కువ రోజులు అరటికాయలు తాజాగా ఉండాలంటే వాటిని తడి లేని ప్రదేశంలో ఉంచి ప్లాస్టిక్ కవర్ సగం వరకు తొడగండి. 

ఆవకాడో

ఎంతో ఖరీదు పెట్టి ఆవకాడో కొన్నాం కదా అని ఫ్రిజ్‌లో పెట్టొద్దు. ఫ్రిజ్‌లో పెడితే ఆవకాడో టేస్టు మారుతోంది. తడి లేని చోట, గాలి మారే చోట భద్రపరిస్తే మంచిది. 

పుచ్చకాయ

ఇంటికి పుచ్చకాయ తెస్తే సగం కోసి మిగిలింది ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. అందరి ఇళ్లల్లో జరిగేదే ఇది. కానీ, పుచ్చకాయని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ని కోల్పోతాం. 

వంకాయలు

వంకాయలను 10 ° C వద్ద ఫ్రిజ్‌లో  పెడితే అవి కుళ్లిపోతాయి. ఫ్రిజ్‌లో కంటే బయట ఉంటేనే తాజాగా ఉంటాయి. అంతేకాదు వంకాయలను భద్రపరిచేటప్పుడు వాటిని ఏ ఇతర కూరగాయలు, పండ్లతో కలపొద్దు. 

వెల్లుల్లి

వెల్లుల్లిపాయలు ఫ్రిజ్‌లో కంటే గాలి, వెలుతురు ఉండే చోట పెడితే నెలరోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి. వీటిని ఫ్రిజ్‌లో పెడితే జిగురు వస్తుంది. 

చాక్లెట్లు

ఫ్రిజ్‌లో చాక్లెట్లు పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి లాగించేస్తుంటాం. కానీ, అలా ఫ్రిజ్‌లో పెట్టిన చాక్లెట్లు ఆరోగ్యానికి హానికరం. ఫ్రిజ్ లో పెడితే చాక్లెట్ రియల్ ఫ్లేవర్ పోతుంది. కాంతి కిరణాలకు దూరంగా వీటిని ఉంచాలి. 


Food and Health: డేంజర్.. డేంజర్.. ఈ ఫుడ్ ఐటమ్స్‌ని ఫ్రిజ్‌లో అసలు పెట్టొద్దు

గుడ్లు

సూపర్ మార్కెట్లలో కూడా గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచరు. అలాంటిది మనం ఇంటికి తెస్తే మాత్రం వెంటనే ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. వాటిని బయట ఉంచితేనే మంచిది.  

బ్రెడ్

మీరు గమనించారో లేదో గానీ బ్రెడ్ ని ఫ్రిజ్‌లో ఉంచితే తొందరగా పాడవుతుంది. అది త్వరగా ఎండిపోతుంది. బ్రెడ్ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా బయట ఉంచితే అది ఫ్రెష్‌గా ఉంటుంది. 

బత్తాయి పండ్లు

సిట్రస్ యాసిడ్ ఉన్న బత్తాయిలు ఫ్రిజ్‌లో ఉంచితే త్వరగా పాడైపోతాయి. తొక్క వాడిపోయి చూడ్డానికి కూడా బాగోవు. దీంతో అవి పాడైపోయాయి అనుకుని చెత్త బుట్టలో పారేస్తాం.  

తేనె, కాఫీ గింజలు, కెచప్, పీనట్ బటర్, దోసకాయలు, స్ట్రాబెర్రీస్, ఉల్లిపాయలు కూడా ఫ్రిజ్‌లో పెట్టి తర్వాత తీసి వాడొద్దు. కాబట్టి, మీరు ఎప్పుడైనా సరే వారానికి సరిపడా కూరగాయలు, పండ్లు తెచ్చుకుని ఆ తర్వాత మళ్లీ తాజాగా తెచ్చుకోండి. దీంతో ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అనారోగ్యాలు మీ దరి చేరవు. 

టాప్ హెడ్ లైన్స్

Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
Embed widget