Preserving Amla for a Long Time : ఉసిరికాయలు ఏడాదిపాటు నిల్వ ఉండాలంటే ఫాలో అవ్వాల్సి ప్రాసెస్ ఇదే.. రోజు తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలివే
Salted Gooseberries : ఉసిరికాయలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తాయి. అయితే ఇవి తక్కువ కాలం అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ప్రాసెస్ ద్వారా ఏడాది అంతా వీటిని తినవచ్చు.

Amla Preservation Tips and Techniques to Follow : అమృతఫలం. ఉసిరికాయకు ఆయుర్వేదంలో ఉన్నపేరు ఇది. అంటే ఉసిరి చేసే ప్రయోజనాలు అమృతం లాంటివని చెప్తోంది ఆయుర్వేదం. అందుకే దీనిని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. పోషకాలతో నిండి ఈ ఫలం ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసి.. జుట్టుకు, చర్మానికి కూడా బెనిఫిట్స్ అందిస్తుంది. కానీ మైనస్ ఏంటి అంటే.. ఇవి ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఏడాదంతా వీటిని తినాలంటే ఓ ప్రాసెస్‌తో వీటిని ఏడాదిపాటు స్టోర్ చేసుకోవచ్చు.
ఉసిరిని ఏడాదిపాటు ప్రాసెస్ చేయడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఇలా స్టోర్ చేసిన ఉసిరిని ఏడాదంతా తినొచ్చు. అస్సలు పాడుకావు. మరి ఉసిరిని ఎలా నిల్వ చేయవచ్చు. ఉసిరి వల్ల కలిగే లాభాలు ఏంటి? మధుమేహం ఉన్నవారితో పాటు మిగిలిన ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవడానికి వీటిని రోజూ తినొచ్చా? అందానికి, జుట్టుకి దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరిని నిల్వ చేసే ప్రాసెస్
ముందుగా మీరు ఎన్ని ఉసిరి కాయలను నిల్వ చేసుకోవాలనుకుంటున్నారో తీసుకోండి. వాటికి ఆకులు, కొమ్మలు లేకుండా చూసుకోండి. అలాగే వాటికి మచ్చలు, ఎక్కడైనా పాడైనట్లు ఉంటే వాటిని తీసేయండి. ఇప్పుడు వాటిని కడిగి నీరు లేకుండా ఆరబెట్టుకోవాలి. నీళ్లు ఆరిన తర్వాత ఉసిరిని మరోసారి కాటన్ క్లాత్‌తో తుడిచి పెట్టుకోవాలి. వాటికి అస్సలు తడి లేకుండా ఉంటేనే.. పాడవకుండా ఉంటాయి.
ఇలా ఉసిరిని సిద్ధం చేసుకున్న తర్వాత స్టౌవ్ వెలిగించి దానిపై పెద్ద గిన్నె పెట్టి నీళ్లు పోయండి. లేదా మీరు ఎన్ని ఉసిరికాయలు తీసుకుంటే అవి సరిపడేంత కంటే కాస్త పెద్దదిగా ఉండే గిన్నెను తీసుకోవాలి. ఇలా తీసుకున్న గిన్నెలో సగానికి పైగా నీరు పోసి రెండు నిమిషాలు మరిగించాలి. నీరు మరిగిన తర్వాత స్టౌవ్ ఆపేసి దానిలో ఉప్పు, పసుపు వేయాలి. వీటికి కొలత ఉండదు. కానీ పసుపు కాస్త తక్కువగా.. ఉప్పు ఉసిరికాయలను బట్టి ఉజ్జాయింపుగా వేసుకోవాలి.
రోజంతా అలా ఉంచాల్సిందే
నీళ్లలో ఉప్పు, పసుపు బాగా కలిపిన తర్వాత.. ఉసిరికాయలను ఆ వేడి నీటిలో వేయాలి. ఉసిరికి గాట్లు పెట్టి వేసుకున్నా.. లేదా అలాగే వేసుకున్నా పర్లేదు. ఉసిరికాయలన్నీ నీటిలో ఉండేలాగా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఇలా చేసుకున్న తర్వాత మూతపెట్టి ఓ 24 గంటలు పక్క పెట్టేయాలి. రోజంతా వాటిని అలా ఉంచితే ఉసిరి ఊరుతుంది.
Also Read : నోరూరించే ఉసిరి పచ్చడి రెసిపీ.. వేడి వేడి అన్నంలో వేసుకుని నెయ్యితో తింటే ఉంటాది..
ఇలా సిద్ధం చేసుకున్న ఉసిరికాయలను గ్లాస్ జార్స్, లేదా జాడీల్లోకి వేసుకోవాలి. ఉసిరికాయలను కచ్చితంగా ఈ నీటిలో మునిగి ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చేసుకున్న ఉసిరికాయలను నేరుగా తినేయొచ్చు. ఈ వాటర్ కూడా తాగితే మంచిది. అలాగే ఇవి పాడవకుండా ఏడాదిపాటు నిల్వ ఉంటాయి. ఈ జార్స్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంకా మంచిది. వీటిని రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి.
ఉసిరితో కలిగే లాభాలివే..
ఉసిరిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి ఉంటుంది. ఇవి కణాలు డ్యామేజ్ కాకుండా హెల్ప్ చేస్తాయి. ఇమ్యూనిటీని పెంచి.. జలుబు, దగ్గు వంటి సమస్యలను దూరం చేస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. స్కిన్‌కి చాలా మంచిది. వృద్ధాప్యఛాయలను దూరం చేస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. మలబద్ధకం తగ్గిస్తుంది. దీనిలోని ఫైబర్, విటమిన్ సి.. కొలెస్ట్రాల్‌ని తగ్గించి.. మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
కొందరిలో ఉసిరి డయోరియా, కళ్లు తిరగడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. మరికొందరిలో అలెర్జీలను, దురదను, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ప్రెగ్నెన్సీ ఉన్నవారు, పిల్లలకు పాలు ఇచ్చేవారు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకుని అప్పుడు వీటిని తీసుకుంటే మంచిది.
Also Read : పరగడుపునే జీలకర్రను ఇలా తీసుకుంటే పొట్ట తగ్గుతుందట.. 15 రోజుల్లోనే రిజల్ట్స్!






















