హెయిర్ మాస్క్

ఉసిరి, కరివేపాకు కలిపి జుట్టుకు ఇలా అప్లై చేస్తే చాలా మంచిదట

Published by: Geddam Vijaya Madhuri

పోషకాలివే..

ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. ఇది హెయిర్ ఫాలికల్స్​ని బలంగా చేస్తుంది. కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని జుట్టు పెరుగుదలకు ఉపయోగిస్తారు.

కావాల్సిన పదార్థాలు

కప్పు కరివేపాకు, ఉసిరి పొడి రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. అరకప్పు కొబ్బరి నూనెను సిద్ధం చేసుకోవాలి.

వేడి చేస్తే..

ఇప్పుడు పాన్​ను తీసుకుని దానిలో కొబ్బరి నూనెను వేసుకోవాలి. దానిని కొంత సేపు వేడి చేయాలి.

కరివేపాకును పేస్ట్ చేస్తే

కరివేపాకును కడిగి వాటిని మిక్స్ చేయాలి. ఈ పేస్ట్​ను వేడి నూనెలో వేసి కలపాలి. అలాగే ఉసిరి పొడిని కూడా వేసి కలపాలి.

మాస్క్

ఈ మాస్క్​ని తలకు అప్లై చేయాలి. దీనిని స్కాల్ప్​పై అప్లైచేయాలి. దీనిని అరగంట ఉంచాలి.

వాష్

అనంతరం దీనిని మైల్డ్ షాంపూతో వాష్ చేసుకోవాలి. గోరువెచ్చని నీటిని తలకు ఉపయోగిస్తే చాలా మంచిది.

వారానికోసారి

ఈ హెయిర్ మాస్క్​ను వారానికోసారి అప్లై చేస్తే జుట్టు స్ట్రాంగ్​గా ఉండాలి. ఇది జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తుంది.

లాభాలు

జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేసి.. పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి. అంతేకాకుండా జుట్టును దృఢంగా చేస్తాయి.

అవగాహన

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుని ఫాలో అయితే మంచిది.