టేస్టీ టేస్టీ గార్లిక్ రైస్ రెసిపీ.. పిల్లలకి చాలా మంచిది తెలుసా?
గార్లిక్ రైస్ మంచి అరోమాను అందించడంతో పాటు రుచిని అందిస్తుంది. ఇది లంచ్‌కి పర్ఫెక్ట్ రెసిపీ అవుతుంది. పైగా త్వరగా చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా చేయాలంటే..
వెలుల్లి వందగ్రాములు, కారం 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ ఒకటిన్నర టేబుల్ స్పూన్, పసుపు 1 టీస్పూన్, ఉప్పు రుచికి తగినంత తీసుకోవాలి.
ఈ పదార్థాలన్నీ ముందుగా రెడీ చేసుకోవాలి. నిమ్మరసం, కొత్తిమీర తురుము, అన్నాన్ని కూడా సిద్ధంగా చేసుకుని పెట్టుకోవాలి.
గార్లిక్‌ను చిన్నగా తురుముకోవాలి. ఇది ఫ్రైడ్ రైస్‌కి మంచి రుచిని అందిస్తుంది. పిల్లలనుంచి పెద్దగా ఇష్టంగా తినరు.
ఇప్పుడు మిక్సీ జార్లో వెల్లుల్లి ముక్కలు, మిగిలిన మసాలాలు కలిపి చిక్కటి పేస్ట్‌గా చేసుకోవాలి. వీటిని ఓ 5 నిమిషాలు పక్కనపెట్టేయండి.
ముందుగా స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టాలి. దానిలో నూనె వేసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేయాలి. దీనిని మంచి అరోమా వచ్చేవరకు వేయించుకోవాలి.
ఇప్పుడు దానిలో వండేసిన అన్నం వేసి బాగా కలపాలి. ఓ రెండు నిమిషాలు కలిపి.. రైస్‌ని ఫ్రై చేయాలి.
చివర్లో నిమ్మరసం, కొత్తిమీర వేసి కలిపాలి. స్టౌవ్ ఆపేస్తే టేస్టీ టేస్టీ గార్లిక్ రైస్ రెడీ.
దీనిని లంచ్ బాక్స్ కోసం చేసుకోవచ్చు. లేదంటే అన్నం మిగిలినప్పుడు కూడా దీనిని చేసుకోవచ్చు.