News
News
X

Eye Health: ఇలా చేశారంటే మీ కంటి చూపుకి ఏ ఇబ్బంది ఉండదు, కళ్ళజోడు అవసరమే రాదు

కళ్ళు చాలా సున్నితమైనవి. అందుకే వాటి మీద అదనపు శ్రద్ధ పెట్టడం చాలా అవసరం.

FOLLOW US: 
Share:

శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో కళ్ళు ఒకటి. కానీ వాటి మీద శ్రద్ద మాత్రం చాలా తక్కువగా పెడతారు. గంటల గంటలు ఫోన్లు, టీవీ, కంప్యూటర్స్ చూడటం వల్ల కళ్ళు చాలా అలిసిపోయి బలహీనంగా మారిపోతున్నాయి. బలహీనమైన కంటి చూపు రోజువారీ జీవితానికి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. సమతుల్య ఆహారం తీసుకోకపోవడం వల్ల దృష్టి లోపం సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే కళ్ళు ఆరోగ్యంగా, దృష్టిని బలంగా ఉంచుకోవడానికి తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారాల జాబితా ఇక్కడ ఉంది. ఈ పదార్థాలు తింటూ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే కంటికి ఎటువంటి నష్టం వాటిల్లదు.

సమతుల్య ఆహారం తీసుకోవాలి

గుడ్లు, క్యారెట్లు, ఆకుకూరలు, బెర్రీలు, గింజలు, తాజా పండ్లు వంటి సూపర్ ఫుడ్ తో పాటు కాలనుగుణమైన సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఈ ఆహాలన్నింటిలో పోషకాలు ఉన్నాయి. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు మీ దృష్టి సన్నగిల్లకుండా చేయడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాలు మాక్యులర్ డిజేనరేషన్,కంటి శుక్లం వంటి వయస్సు సంబంధిత దృష్టి సమస్యలతో పోరాడటానికి సహాయపడతాయి. వీటిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. పొడి కళ్ళ సమస్యని వదిలించుకోవడానికి, కళ్ళ కింద నల్లటి వాలయాలు పోగొట్టుకునేందుకు కూడా ఇవి సహాయపడతాయి.  

కంటి వ్యాయామాలు చేయాలి

 ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కళ్ళు శరీరంలోని అత్యంత వేగవంతమైన, చురుకైన కండరాలు. అందుకే ఇతర అవయవాల మాదిరిగానే వాటిని ఫిట్ గా ఉంచడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. 10-15 నిమిషాల పాటు ఆప్టికల్ ఇల్యూషన్స్ చూడం మెమరీ గేమ్ లు ఆడటం వంటివి చేయొచ్చు. కనుగుడ్డు ఎడమ నుంచి కుడికి, పైకి కిందకి కొన్ని సార్లు తిప్పుతూ ఉండాలి. కనుబొమ్మలు ఎగరేయడం కూడా వ్యాయామం కిందకే వస్తుంది.

స్క్రీన్ టైమ్ నుంచి బ్రేక్ అవసరం

టీవీ చూడటం, కంప్యూటర్ లేదా ఫోన్ చూడటం వల్ల కళ్ళు ఎక్కువగా అలసిపోతాయి. అతిగా స్క్రీన్ చూడటం వల్ల చూపు మందగించడం, కళ్ళు పొడిబారటం. తలనొప్పి, మైగ్రేన్ వస్తాయి. అందుకే 20 నిమిషాలకు ఒకసారి కళ్ళు మూసుకోవడం చేయాలి. 20 సెకన్ల పాటు కళ్ళు మూసుకుని వాటికి విశ్రాంతి ఇవ్వాలి. కళ్ళు తేమగా ఉండాలంటే రెప్పలు వేస్తూ ఉండాలి.

నెయ్యి రాసుకోవడం

ఆయుర్వేదం ప్రకారం కళ్ళకు నెయ్యి లేదా వెన్న రాసుకోవచ్చు. అనేక ఆరోగ్య సమస్యలకి చికిత్స చేయడంలో సహాయపడుతుంది. దేశీ నెయ్యిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును బలోపేతం చేయడంలో సహాయపడతాయి. కంటి చూపు మెరుగుపరుచుకోవడం కోసం కళ్ళ చుట్టూ నెయ్యి రాసే ప్రతిరోజు కాసేపు మసాజ్ చేసుకోవాలి.

పొగ తాగకూడదు

కంటి సమస్యలతో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు ధూమపానం ప్రధాన కారణం. ధూమపానం, పొగాకు కంటి శుక్లం అభివృద్ధి చెసే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు. అంధత్వం రావడానికి ఇది కూడా ఒక కారణం. ఆప్టిక్ నరాలు దెబ్బతింటాయి. గ్లకోమా, మధుమేహం సంబంధిత రెటినోపతికి దారితీయవచ్చు.

ఆరుబయట కళ్ళని రక్షించుకోవాలి

అతినీలలోహిత కిరణాలు రేటినాకు హాని కలిగించకుండా ఉండటం కోసం ఎప్పుడు సన్ గ్లాసెస్ ధరించాలి. UV-A, UV-B రేడియేషన్‌లను 99 నుండి 100 శాతం నిరోధించే సన్ గ్లాసెస్‌ను కొనుగోలు చేయాలి. ఎందుకంటే ఇవి కంటి చికాకు, కంటిశుక్లం వచ్చేలా చేస్తాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: పాలిచ్చే తల్లులు తినాల్సిన పోషకాల లడ్డూ- ఇది ఎలా తయారుచేయాలంటే

Published at : 11 Feb 2023 04:41 PM (IST) Tags: EYESIGHT Eye Problems Eyes Health Eye Care Tips Eye Vision

సంబంధిత కథనాలు

Banana Coffee: సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ బనానా కాఫీ- ఇది ఎలా తయారు చేస్తారంటే!

Banana Coffee: సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ బనానా కాఫీ- ఇది ఎలా తయారు చేస్తారంటే!

ఆ వ్యక్తి గొంతులో మొక్కలు మొలిచేశాయ్, ఇదో విచిత్రమైన ఆరోగ్య సమస్య - ప్రపంచంలోనే ఇది తొలికేసు

ఆ వ్యక్తి గొంతులో మొక్కలు మొలిచేశాయ్, ఇదో విచిత్రమైన ఆరోగ్య సమస్య - ప్రపంచంలోనే ఇది తొలికేసు

Diabetes: ఓట్స్ ఇడ్లీ - డయాబెటిస్ వారి కోసం ప్రత్యేకం ఈ బ్రేక్‌ఫాస్ట్

Diabetes: ఓట్స్ ఇడ్లీ - డయాబెటిస్ వారి కోసం ప్రత్యేకం ఈ బ్రేక్‌ఫాస్ట్

రోటీని నేరుగా మంట మీద కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా?

రోటీని నేరుగా మంట మీద కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా?

Ragi Cake Recipe: రాగి పిండితో చేసే ఆరోగ్యకరమైన చాక్లెట్ కేక్ - పిల్లలకు హెల్తీ రెసిపీ

Ragi Cake Recipe: రాగి పిండితో చేసే ఆరోగ్యకరమైన చాక్లెట్ కేక్ - పిల్లలకు హెల్తీ రెసిపీ

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌-  నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి