Diabetes Control Tips: డయాబెటిస్‌కు చెక్ పెట్టాలా? జస్ట్, ఈ 3 టిప్స్ పాటిస్తే చాలు
Diabetes: డయాబెటిస్ రుగ్మత ఉన్నవాళ్లు ముఖ్యంగా ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉన్న కారణంగా కార్బోహైడ్రేట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి
Diabetes: డయాబెటిస్ అనేది వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి వస్తున్న రుగ్మత. డయాబెటిస్ వచ్చిన వారికి పూర్తిగా తగ్గడం అనేది ఉండదు. అందుకే ఇది ఒక జీవనశైలి వ్యాధి. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు. రక్తంలో చక్కర శాతం పెరగకుండా తరచూ రక్త పరీక్షలు చేయించుకుంటూ మందులు వాడుతూ ఉంటే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు.. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉన్న కారణంగా కార్బోహైడ్రేట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్‌లో తీయటి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు స్వీట్లు, బంగాళాదుంపలు, మామిడి పండ్లు వంటి అధిక కేలరీలు ఉన్నటువంటి ఆహారాల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే కార్బోహైడ్రేట్లతో పాటు ప్రోటీన్లు, ఫైబర్ కూడా సమానంగా ఉన్నటువంటి ఆహారం తీసుకున్నట్ల యితే రక్తంలో చక్కెర శాతం కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో మూడు సాధారణ చిట్కాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆహారం ద్వారా షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి చిట్కాలు
1. పాలిష్ చేయని బియ్యం తినండి:
శుద్ధి చేసిన వాటి కంటే పాలిష్ చేయని ఆహారం తీసుకోవడం తెలివైన నిర్ణయం. మీరు బ్రౌన్ రైస్ వంటి ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోవచ్చు. ఇందులో తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ (GI) ఉంటుంది. తక్కువ GI ఉన్న ఆహారాలు గ్లూకోజ్‌ని నెమ్మదిగా రక్తప్రవాహంలోకి విడుదల చేస్తాయి, రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది. పాలిష్ తక్కువగా ఉన్న బియ్యంలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇవి రక్తంలో స్థిరమైన చక్కెర స్థాయిని నిర్వహించడంలో సహాయపడతాయి.
2. ఫైబర్ కంటెంట్‌పై శ్రద్ధ వహించండి:
మీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలనుకుంటే, అధిక ఫైబర్ ఉన్న ఆహారాలను తినాాలి. ఎందుకంటే ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు షుగర్ రక్తంలో కలవకుండా ఉండేలా చేస్తాయి. గ్లైసెమిక్ నియంత్రణలో సహాయపడతాయి. గింజలు ప్రత్యేకంగా అధిక పోషకాలను కలిగి ఉంటాయి, ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆహారంలో లభిస్తాయి.
3. దాల్చిన చెక్క :
దాల్చిన చెక్కలో నియంత్రించే లక్షణం పుష్కలంగా ఉంది. మీరు కనుక డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లయితే దాల్చిన చెక్కతో చేసిన టీ తీసుకోవడం ద్వారా మీ షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే దాల్చిన చెక్క పొడిని వేడి నీళ్లలో కలుపుకొని తాగడం ద్వారా కూడా మీ డయాబెటిస్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు. దాల్చిన చెక్కలో పొట్టలో కొవ్వు కరిగించే రసాయనాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి బరువు తగ్గించేందుకు సహాయ పడుతుంది.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు కేవలం ఆహారపు అలవాట్లు మాత్రమే కాదు, శారీరక వ్యాయామం ద్వారా కూడా మీ రక్తంలో షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. తరచూ వాకింగ్, యోగా వంటి శారీరక వ్యాయామాలను చేయడం ద్వారా మీరు షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు.
Also Read : జాంబీ వైరస్: మళ్లీ ఉనికిలోకి 48,500 నాటి మహమ్మారి - ప్రపంచానికి మరో అతి పెద్ద ముప్పు?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.