Tattoo Child: ఆ పసివాడి ఒళ్లంతా పచ్చబొట్లే, తల్లిని తిట్టిపోస్తున్న జనం, కానీ అసలు కథ వేరే ఉంది!

పచ్చబొట్టు ఎంత నొప్పి కలిగిస్తుందో తెలిసిందే. కానీ, ఈ పసివాడి తల్లి అతడి ఒళ్లంతా టాటూలు వేయించింది. కానీ, అసలు కథ వేరే ఉంది.

FOLLOW US: 

చ్చబొట్టు(టాటూ) చూసేందుకు అందంగానే ఉంటుంది. కానీ, దాన్ని పొడిపించుకొనేప్పుడు చుక్కలు కనిపిస్తాయి. పైగా, టాటూలు అందరి శరీరానికి పడకపోవచ్చు. అవి అలర్జీలు కూడా కలిగించవచ్చు. అందుకే, వైద్యులు టాటూలతో అనవసరమైన సమస్యలు కొని తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు. టాటూల వల్ల భవిష్యత్తులో ఉద్యోగం, పెళ్లి విషయాల్లో కూడా ఆటంకాలు ఎదురుకావచ్చని చెబుతున్నారు. అయితే, ఓ తల్లి ఏడాది వయస్సు గల తన పసిబిడ్డకు టాటూలు వేయించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేగాక, ఆ ఫొటోలను ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్ట్ చేస్తూ భారీగా ఫాలోవర్లను కూడా సంపాదించింది. టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా సైట్లలో ఆమెకు తిరుగే లేదు. అయినా ఆమెకు అదేం పాడుబుద్ధి? పాపం ఆ పసివాడికి అలా పచ్చబొట్టు పొడిచేస్తుంటే ఎలా తట్టుకోగలిగాడు? సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలా పిల్లాడిని హింసిస్తారా? అంటూ నెటిజనులు మండిపడుతున్నారు. ఈ కామెంట్లు చూసి ఆ పసివాడి తల్లి బాధపడటం లేదు. పైగా నవ్వుకుంటోంది. ఎందుకంటే, ఆ పచ్చబొట్లు వెనుక అసలు కథ వేరే ఉంది. 

Also Read: ఏంటమ్మా ఏంటీ? సింధూరం పెట్టుకుంటే శృంగార కోరికలు పుడుతాయా?

వాస్తవానికి అవి నిజమైన టాటూలు కాదు. ఫ్లొరిడాకు చెందిన ఫ్యాషన్ డిజైనర్‌ షమేకియా మోరిస్‌కు టాటూలంటే చాలా ఇష్టం. దీంతో తన కొడుకు ట్రెలిన్‌కు పుట్టిన ఆరు నెలల వయస్సులోనే పచ్చబొట్లు పొడిపించాలని అనుకుంది. కానీ, పసివాడు ఆ నొప్పిని భరించలేడనే కారణంతో హైపర్‌రియలిస్టిక్ టెంపరరీ టాటూలతో అతడి శరీరాన్ని నింపేసింది. అవి చూసేందుకు నిజమైన టాటూల్లాగానే ఉంటాయి. ప్రస్తుతం ట్రెలిన్ వయస్సు ఒక సంవత్సరం మాత్రమే. షమేకియా మోరిస్ టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు చేస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. పామ్ బీచ్‌ ఏరియాలో ఒళ్లంతా టాటూలతో, మెడలో చైన్‌తో ర్యాప్ సూపర్ స్టార్‌లో ట్రెలిన్ కనిపిస్తాడు. అవి తాత్కాలిక టాటూలని నెటిజనులకు చెప్పి చెప్పి షమేకియా అలసిపోయింది. పసివాడి శరీరానికి హానిచేయని సిరతోనే ఆ టాటూ డిజైన్లు వేసినట్లు షమేకియా తెలిపింది. ఈ ఫొటోలు చూస్తే మీరు కూడా మీ కళ్లను మీరు నమ్మలేరు. 

Also Read: చాక్లెట్లు తింటే చిన్న వయస్సులోనే చనిపోతారా? తాజా అధ్యయనంలో ఏం తేలింది?

View this post on Instagram
 
A post shared by Treylin Armani 👶🏼🔥💉 (@nuggetworld561)

View this post on Instagram
 
A post shared by Treylin Armani 👶🏼🔥💉 (@nuggetworld561)

View this post on Instagram
 
A post shared by Treylin Armani 👶🏼🔥💉 (@nuggetworld561)

Published at : 21 May 2022 05:31 PM (IST) Tags: Tattoos to Child Tattoo Child One Year Old Tattoo Florida Mother Florida Mother Tattoo

సంబంధిత కథనాలు

Optical Illusion: ఈ చిత్రం ద్వారా మీరు మీ జీవిత భాగస్వామిని మోసం చేసే వారో కాదో చెప్పేయచ్చు

Optical Illusion: ఈ చిత్రం ద్వారా మీరు మీ జీవిత భాగస్వామిని మోసం చేసే వారో కాదో చెప్పేయచ్చు

Height: ఎత్తుగా ఉన్నవాళ్లకి ఈ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువట, అదే ఎత్తు తక్కువగా ఉంటే అవి తప్పవట

Height: ఎత్తుగా ఉన్నవాళ్లకి ఈ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువట, అదే ఎత్తు తక్కువగా ఉంటే అవి తప్పవట

Hair Pulling Disorder: వెంట్రుకలు పీక్కుంటున్నారా? అది అలవాటు కాదు రోగం, ఆ రోగానికి కారణాలు ఇవే

Hair Pulling Disorder: వెంట్రుకలు పీక్కుంటున్నారా? అది అలవాటు కాదు రోగం, ఆ రోగానికి కారణాలు ఇవే

Sesame Oil: నువ్వుల నూనెతో వండిన వంటలు తింటే మగవారికెంతో లాభం

Sesame Oil: నువ్వుల నూనెతో వండిన వంటలు తింటే మగవారికెంతో లాభం

Mutton Pickel: మటన్ నిల్వ పచ్చడి, ఇలా చేస్తే ఆరునెలలైనా తాజాగా ఉంటుంది

Mutton Pickel: మటన్ నిల్వ పచ్చడి, ఇలా చేస్తే ఆరునెలలైనా తాజాగా ఉంటుంది

టాప్ స్టోరీస్

Ind vs Eng 5th Test: నాడు ఆస్ట్రేలియాలో, నేడు ఇంగ్లాండ్‌లో జాత్యహంకారం - భార‌త‌ ఫ్యాన్స్‌పై దారుణమైన వ్యాఖ్యలు

Ind vs Eng 5th Test: నాడు ఆస్ట్రేలియాలో, నేడు ఇంగ్లాండ్‌లో జాత్యహంకారం - భార‌త‌ ఫ్యాన్స్‌పై దారుణమైన వ్యాఖ్యలు

RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?

RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?

Hyderabad Traffic News: నేడు రూట్స్‌లో వెళ్తే ఇరుక్కున్నట్లే! వేరే మార్గాలు చూసుకోవాలన్న పోలీసులు

Hyderabad Traffic News: నేడు రూట్స్‌లో వెళ్తే ఇరుక్కున్నట్లే! వేరే మార్గాలు చూసుకోవాలన్న పోలీసులు

Assam Floods: ఆ వరదలు కావాలని సృష్టించినవే- తాజాగా ఇద్దరు అరెస్ట్!

Assam Floods: ఆ వరదలు కావాలని సృష్టించినవే- తాజాగా ఇద్దరు అరెస్ట్!