Skin Care: బాయ్స్, రోజూ ఈ టిప్స్ పాటిస్తే చాలు, వృద్ధాప్య ఛాయలు మాయమై యంగ్‌గా కనిపిస్తారు!
ఆడవాళ్లే కాదు పురుషులు కూడా చర్మ సంరక్షణ మీద ప్రత్యేక శ్రద్ద వహించాలి. అందుకోసం ఈ చిన్న చిన్న టిప్స్ పాటించండి.
అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం చాలా శ్రద్ద తీసుకుంటారు. కానీ మగవారు మాత్రం చర్మ సంరక్షణ చర్యలు తీసుకోవాలంటే కాస్త చిరాకు పడతారు. చికాకు కలిగించే చర్మాన్ని దూరం చేయాలంటే కాస్త చర్మ సంరక్షణ జాగ్రత్తలు చూసుకోవడం చాలా ముఖ్యం. అందుకే పురుషులు కూడా ఇప్పుడిప్పుడే పార్లర్ కి వెళ్ళడం, ఫేషియల్స్ చేయించుకోవడం ఇతర జాగ్రత్తలు పాటిస్తున్నారు. మగవారి కోసం కూడా మార్కెట్లో ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. మీ స్కిన్ కి తగినట్టుగా ఉన్న ఉత్పత్తులు ఎంచుకుని ఉపయోగించడం వల్ల అందంగా కనిపిస్తారు. అటు చర్మాన్ని సంరక్షించుకోవడమే కాదు మీ మొహం కాంతివంతంగా మెరిసిపోతుంది. అందుకోసం మీరు ఇలా చేసి చూడండి..
ఫేస్ వాష్
నిద్రలేవగానే చర్మానికి సరిపడా సున్నితమైన ఫేస్ వాష్ ఉపయోగించి చూడండి. ఉదయం, సాయంత్రం రొటీన్ లో క్లెన్సింగ్ చేయడం మొదలు పెట్టండి. మీరు రీఫ్రెష్ గా ఉంటారు. ఇలా చేశారంటే చర్మం మెరిసిపోతూ ఉంటుంది. చర్మం మీద పేరుకుపోయిన మృతకణాలని తొలగిస్తుంది. ఫ్రెష్ గా ఉన్న అనుభూతి కలిగిస్తుంది.
మాయిశ్చరైజింగ్
మాయిశ్చరైజింగ్ అనేది చర్మ సంరక్షణ దినచర్యలో ఒక ముఖ్యమైన భాగం. పర్యావరణ కాలుష్యం నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే ఇది తప్పనిసరి. పొడి లేదా పోషకాహార లోపం ఉన్న చర్మం అనేక చర్మ సమస్యలకు దారితీస్తుంది. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మాయిశ్చరైజింగ్ చాలా అవసరం. ఇది చర్మాన్ని రోజంగా హైడ్రేట్ గా ఉంచేందుకు అవసరమైన తేమను అందిస్తుంది. కఠినమైన వాతావరణం ఎదుర్కోవడానికి కావలసిన పోషణ అందిస్తుంది. 3 శాతం NMF కాంప్లెక్స్‌తో కూడిన డీకన్‌స్ట్రక్ట్స్ హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ ఉపయోగించడం వల్ల చర్మాన్ని హైడ్రేట్ గా చేసుకోవచ్చు.
సన్ స్క్రీన్
సన్ స్క్రీన్ చర్మాన్ని హానికరమైన యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. అకాల వృద్ధాప్యం, చర్మ క్యాన్సర్ ని నివారించడంలో సహాయపడుతుంది. వాతావరణంతో సంబంధం లేకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు సన్ స్క్రీన్ అప్లై చేయాలి. చర్మ రకానికి తగిన సన్ స్క్రీన్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. 30 SPF ఉన్న సన్‌స్క్రీన్‌ని ఎంచుకుంటే చర్మం దెబ్బతినకుండా ఉంటుంది.
ఎక్స్ ఫోలియేట్
మృతకాణాలను తొలగించడానికి చర్మ రంధ్రాలను అన్ లాగ్ చేయడానికి ఎక్స్ ఫోలియేషన్ చాలా చక్కని మార్గం. లాక్టిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్ వంటి తేలికపాటి AHAలు పురుషులకు మంచి ఎంపికలు. ఈ పదార్థాలు చనిపోయిన చర్మ కణాలను సున్నితంగా తొలగిటస్తయి. చర్మం రూపాన్ని మెరుగుపరుస్తుంది. వారానికి ఒకసారి వాడిన తర్వాత చర్మం వాటికి అలవాటు పడితే ఫ్రీక్వెన్సీ గా వాడుకోవచ్చు. కెమికల్ ఎక్స్ ఫోలియేట్ ఉపయోగిస్తున్నప్పుడు సన్ స్క్రీన్ ధరించడం మర్చిపోవద్దు.
చక్కగా తినాలి
అన్నింటికంటే ముఖ్యమైన పని సరైన ఆహారం తీసుకోవడం. విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహరం చర్మం రూపాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బ్రేక్ అవుట్ లను నిరోధిస్తుంది. ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారాలు అధికంగా తీసుకుంటే మొటిమలు, ఇతర చర్మం సమస్యలకు దారితీస్తుంది. విటమిన్లు సమృద్ధిగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. బిజీ షెడ్యూల్ అనుకోకుండా క్రమం తప్పకుండా వీటిని పాటిస్తే వృద్ధాప్యాన్ని కాస్త వెనక్కి నెట్టేసుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: పిండి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా నిల్వ చేయండి