First Time Drinking Alcohol : మందు మొదటిసారి తాగాలనుకుంటున్నారా? అయితే కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలివే
Drinking First Time Tips : మొదటిసారి డ్రింక్ చేయాలనుకుంటున్నారా? మరి సరైన ఆల్కహాల్ ఎలా ఎంచుకోవాలి?ఎలా తాగాలి? మైకంతో ఇబ్బంది పడకుండా డ్రింక్ ఎంజాయ్ చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.

- మొదటిసారి త్రాగేటప్పుడు తక్కువ ఆల్కహాల్ పానీయాలు ఎంచుకోవాలి.
- ఖాళీ కడుపుతో కాకుండా, ఆహారం తీసుకున్న తర్వాత త్రాగాలి.
- నెమ్మదిగా త్రాగుతూ, మీ పరిమితులను తెలుసుకోవడం ముఖ్యం.
- డీహైడ్రేషన్ నివారించడానికి పానీయాల మధ్య నీరు త్రాగాలి.
Drinking Alcohol for the First Time : మొదటిసారి మందు తాగడం అనేది జీవితాంతం గుర్తుండి పోయే విషయం. ఒకరు బాధతో స్టార్ట్ చేస్తారు. మరొకరు ఫ్రెండ్స్‌తో చిల్ అవ్వాలని మొదలుపెడతారు. మరొకరు పార్టీని ఎంజాయ్ చేసేందుకు తాగుతారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో అనుభవం ఉంటుంది. మీరు మీ ఆల్కహాల్ జర్నీని స్టార్ట్ చేయాలనుకుంటే.. మొదటిసారి మందు తాగాలనుకుంటే ఏ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
మొదటి డ్రింక్ ఎలా ఉండాలంటే..
ఆల్కహాల్ బై వాల్యూమ్ తక్కువగా ఉండే వాటితో మీ డ్రింకింగ్ మొదలు పెట్టవచ్చు. ఆ లెక్కన చూస్తే మీరు కాక్‌టెయిల్స్ ట్రై చేయవచ్చు. కాక్‌టెయిల్స్‌లో ఆల్కహాల్ రుచిని రకరకాల సిరప్‌లు.. జ్యూస్‌లతో కలిపి ఇస్తారు. కాబట్టి కొత్తగా తాగేవారికి ఇవి బాగా నచ్చే అవకాశం ఉంది. పైగా జ్యూస్‌లు కలపడం, షేక్ చేయడం వల్ల ఆల్కహాల్ శాతం తగ్గుతుంది. అయితే వీటిని ఒకేసారి ఎక్కువగా తీసుకోకూడదు.
Also Read : బ్రో బ్రీజర్ సాఫ్ట్ డ్రింక్ కాదు ఆల్కహాల్ ఉంటుందట జాగ్రత్త.. సైడ్ ఎఫెక్ట్స్ ఇవే
తిన్న తర్వాతే తాగండి
మీరు డ్రింక్ తాగే ముందు.. కాస్త ఫుడ్ తినండి. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు చిన్న పేగుల ద్వారా రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో కడుపు ఖాళీగా ఉంటే.. ఆల్కహాల్ మరింత వేగంగా రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల ఆల్కహాల్ విచ్ఛిన్నం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఖాళీ కడుపుతో తాగకపోవడమే మంచిది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం మంచిదని చెప్తున్నారు.
నెమ్మదిగా తాగండి
మీ చుట్టూ ఉన్నవాళ్లు ఫాస్ట్‌గా తాగుతున్నారని మీరు కూడా వేగంగా తాగేయాలని ప్రెజర్ తీసుకోకండి. మీకు సౌకర్యంగా అనిపించిన దానికంటే ఎక్కువగా తాగవద్దు. డ్రింక్‌ను నెమ్మదిగా, జాగ్రత్తగా తాగడమే మంచిది. అలాగే మీ డ్రింక్‌లో ఆల్కహాల్ తక్కువగా ఉన్నదే ఎంచుకోండి. అలాగే 2D రూల్ ఫాలో అవ్వండి. అదే డైట్ అండ్ డైల్యూషన్‌పై ఫోకస్ చేయండి.
Also Read : వేసవిలో బీర్ తాగితే నిజంగా కూల్ అవుతారా? సైడ్ ఎఫెక్ట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
నో చెప్పడం నేర్చుకోండి..
పక్కన వాళ్లు ఫోర్స్ చేస్తున్నారని.. లేదా మిమ్మల్ని ఎంక్రేజ్ చేస్తున్నారని డ్రింక్ ఎక్కువ తాగకూడదు. ఎవరు ఏమి చేస్తున్నా.. ఎంత తాగినా.. మీ లిమిట్స్‌లో మీరు కంట్రోల్డ్‌గా ఉండటమే మంచిది. ఆల్కహాల్ వినోదం కోసం మాత్రమే తీసుకునేది. కాబట్టి మితంగా తాగడమే మంచిది. స్పిరిట్ తీసుకుంటే 60 ml.. వైన్ అయితే 200 ml, బీర్ అయితే 500 ml తీసుకుంటే బెటర్ అని చెప్తున్నారు.
హైడ్రేషన్ ఇంపార్టెంట్
మీరు ఏమి తాగుతున్నా సరే.. ప్రతి డ్రింక్స్ మధ్య ఒక గ్లాసు నీళ్లు తప్పకుండా తాగండి. ఎందుకంటే ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. కాబట్టి దాహం వేయకపోయినా దాన్ని కంట్రోల్ చేయడానికి నీళ్లు తాగాలని సూచిస్తున్నారు నిపుణులు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీరు మొదటిసారి మందు తాగుతుంటే.. షాట్స్ తాగకపోవడం మంచిది. ఎందుకంటే ఇవి గ్లాసు వైన్ లేదా బీర్ కంటే చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అలాగే తాగడం అయిపోగానే పడుకోవద్దు. కాసేపు రిలాక్స్ అవ్వండి. మధ్యలో నీళ్లు తాగుతూ ఉండండి. అలాగే కాస్త ఫుడ్ తీసుకోవడం కూడా మంచిది.
Also Read : బీర్ తాగితే బొజ్జ కాదు, బుద్ది పెరుగుతుందట - కానీ, చిన్నట్విస్ట్!
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























