Weight Loss: ఫిట్‌గా ఉండాలంటే జిమ్‌కి వెళ్లాల్సిన అవసరంలేదు, ఇంట్లోనే ఇలా చేయచ్చు
శరీరం ఫిట్ గా ఉంచుకునేందుకు కఠినమైన వ్యాయామాలు చేయాల్సిన పని లేకుండా సింపుల్ గా కూడా బరువు తగ్గొచ్చు. అదెలాగో తెలుసా?
శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడం కోసం అందరూ జిమ్ కి వెళ్ళి చెమటోడ్చి కష్టపడి పోతారు. డైటింగ్ పేరుతో ఇంకొంతమది తమకి ఇష్టమైన ఆహారాన్ని వదులుకుంటారు. ఇలా చేయడం వల్ల ఫిట్ నెస్ లక్ష్యాన్ని సాధించవచ్చు. కానీ జిమ్ కి వెళ్ళకుండా కూడా ఫిట్ గా ఆరోగ్యంగా ఉండొచ్చు. బరువు తగ్గాలనే మీ లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చు. జిమ్ వర్కౌట్ బాధ లేకుండా శారీరకంగా చురుకుగా ఉండేందుకు కొన్ని చిన్న చిన్న పనులు చేసి కూడా అందమైన శరీరాకృతి పొందవచ్చు.
మెట్లు ఎక్కడం
మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండటం కూడా ఒక వ్యాయామం కిందకే వస్తుంది. ఇది కాళ్ళకి చాలా మంచిది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు గొప్ప మార్గం. ఆరోగ్యకరమైన శరీర బరువు సాధించడానికి సహాయపడే ఉత్తమ మార్గాలలో ఇది ఒకటి. ఎముకలు, కీళ్ళు ధృడంగా మారేందుకు దోహదపడుతుంది.
స్కిప్పింగ్
స్కీప్పింగ్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కేలరీలని బర్న్ చేయడంతో సహాయపడుతుంది. బరువు తగ్గుతారు. స్కిప్పింగ్ చేసే సమయంలో తాడు దాటేందుకు కాళ్ళు ముందుకు వెనుకకి కదిలించడం వల్ల కండరాలు బలంగా మారతాయి.
హైకింగ్
హైకింగ్ కూడా ఒక కార్డియోవాస్కులర్ వ్యాయామం. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒత్తిడి, ఆందోళన దూరం చేస్తుంది. వర్కవుట్ కంటే విశ్రాంతి కార్యకలాపం లాంటిది. అందుకే ఆనందంగా ఉంటుంది. కేలరీలు బర్న్ చేయడంలో సహకరిస్తుంది.
లెగ్స్ అప్ ది వాల్
వాల్ స్ట్రెచ్ వ్యాయామం ప్రభావంతమైనది. నడుము భాగం వరకి నేల మీద ఉంచి గోడ మీద కాళ్ళు పెట్టి చేసే ఈ వ్యాయామం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మనసుకి విశ్రాంతినిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. థైరాయిడ్ పనితీరుని మెరుగుపరుస్తుంది. శక్తిని పెంచి, నడుము నొప్పిని తగ్గిస్తుంది.
శ్రావ్యమైన సంగీతం వినడం
చురుగ్గా ఉండేందుకు శ్రావ్యమైన పాటలు వింటూ డాన్స్ చేయడం మరొక మార్గం. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చేయొచ్చు. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నచ్చిన పాట పెట్టుకుని డాన్స్ చేస్తూ పని చేయడం వల్ల మనసుకి హాయిగా ఉంటుంది. ఒత్తిడిని అధిగమించవచ్చు. మానసిక ప్రశాంతత ఇవ్వడంలో ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
వాకింగ్
చక్కని పచ్చిక ఉండే ప్రశాంతమైన వాతావరణంలో నడిచినా మనసుకి హాయినిస్తుంది. మోకాళ్ళ మీద ఉండి ఎక్సర్ సైజు కూడా చేయొచ్చు. ముందుగా అవక మోకాలు వంచడం తర్వాత సాధారణ స్థితికి వచ్చి మరల మరొక మోకాలు వంచడం వల్ల కండరాలు గట్టి పడతాయి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులకి మేలు జరుగుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: చేపల్ని పసుపు, ఉప్పులో ఎందుకు మారినేట్ చేసి పెడతారో తెలుసా?