News
News
X

Coronavirus: వీటిని తింటే మీ రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది... కరోనా వేళ ఇవి తినడం అవసరమా?

ఏ ఆహారమైనా మన శరీరానికి మేలు చేసేదై ఉండాలి. కానీ కొన్ని కీడు చేస్తాయి.

FOLLOW US: 
Share:

కొత్త వేరియంట్లు విరుచుకుపడుతున్నవేళ రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. అందుకోసం పోషకాహారంతో పాటూ, వ్యాయామాలు కూడా చేయమని చెబుతున్నారు వైద్యులు. అలాగే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలే కాదు, తగ్గించే ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిని తినవద్దని కూడా సూచిస్తున్నారు. అవి తినడం వల్ల అప్పటికే ఒంట్లో ఉన్న ఇమ్యూనిటీ ఇంకా తగ్గిపోతుంది. 

సోడా
వేసవిలో అందరికీ ఇష్టమైన పానీయం సోడా. అలాగే శీతాకాలంలో స్పైసీ బిర్యానీలు తిన్నాక సోడా తాగే వాళ్లు ఎక్కువ. దాహాన్ని తీర్చే ఈ పానీయం రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. సోడాలు చక్కెరతో కలిపి ప్యాక్ చేస్తారు. వీటిలో కేలరీలు ఏమీ ఉండవు, శరీరానికి ఎటువంటి పోషకాలు అందవు. వీటిని తరచూ తాగడం వల్ల బరువు పెరగడంతోపాటూ రోగనిరోధక వ్యవస్థ పనితీరును అణచివేస్తుంది. 

ఫ్రైడ్ ఫుడ్
ఆయిల్ డీప్‌గా వేయించిన ఆహారాలు అంటే ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ పకోడాలాంటి వాటిలో కొవ్వు అధికంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. అంతగా తినాలనిపిస్తే వీటికి బదులు  తక్కువ నూనెలో వేయించిన, లేదా కాల్చిన పదార్థాలు ఎంచుకోండి. లేదా ఎయిర్ ఫ్రైయర్లో వేయించినవి తిన్నా బెటరే. 

మద్యపానం
అప్పుడప్పుడు తాగితే కాస్త ఫర్వలేదు కానీ, రోజూ తాగే వారిలో మాత్రం ఆల్కహాల్ ప్రభావం మామూలుగా పడదు. ఇది రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఇది నిద్రకు కూడా భంగం కలిగిస్తుంది. ఊబకాయానికి దారితీస్తుంది. కాలేయ పనితీరును దెబ్బతీస్తుంది. గుండెపై కూడా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. 

బేకరీ ఉత్పత్తులు
బేకరీలోని కేకులను అధికంగా శుద్ధి చేసిన పిండిని ఉపయోగించి తయారు చేస్తారు. ఇందులో గ్లూటెన్, కొవ్వు, పదార్థాలు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. మైదా, పంచదార, నూనె ఉపయోగించి చేసే బేకరీ ఉత్పత్తుల వల్ల రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. 

పంచదార పదార్థాలు
పంచదారతో చేసిన ఆహారాన్ని తినకపోవడం చాలా మంచిది. క్యాండీలు, చాక్లెట్లు, కేకులు, డోనట్స్, బిస్కెట్లు, డిజర్ట్‌లు చక్కెరతో చేస్తారు. టోమాటో కెచప్, పండ్ల రసాలు, బ్రెడ్, పాస్తాల్లో కూడా కనిపించకుడా చక్కెర దాగి ఉంటుంది. వీటిని అధికంగా తినడం ఇమ్యూనిటీ తగ్గుతుంది. వీటికి బదులు బెల్లం, తేనె, కొబ్బరి చక్కెర, మాపుల్ సిరప్ వంటివి ప్రయత్నించవచ్చు. ఇవి ఆరోగ్యకరమైనవి కూడా. 

Also read: కోపాన్ని కంట్రోల్ చేసుకునేందుకు తొమ్మిది చిట్కాలు...

Also read: అప్పుడప్పుడు ఆయిల్ మసాజ్‌... ఇమ్యూనిటీ పెరగడంతో పాటూ ఇంకా ఎన్నో లాభాలు

Also read: తిని పడేసే చాక్లెట్ రేపర్‌పై దేవుడి ఫోటో... ఏకిపడేసిన నెటిజన్లు, సారీ చెప్పిన నెస్ట్లే ఇండియా

Also read: రాగిపాత్రలలో నిల్వ ఉంచిన నీరు తాగితే ఆ క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చు... ఆయుర్వేదం, సైన్స్ కలిపి చెబుతున్నదిదే

Also read: కరోనాలాంటి వైరస్‌లను అంతం చేయలేం... పర్యావరణంలో భాగంగా కలిసిపోవడమే వాటి ముగింపు, WHO కీలక వ్యాఖ్యలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.

Published at : 21 Jan 2022 04:49 PM (IST) Tags: corona virus Immunity foods Immune system Lower Immunity

సంబంధిత కథనాలు

Toxic Food: రోజూ తినే ఈ ఆహార పదార్థాలు ఎంత విషపూరితమో తెలుసా? ఒక్కోసారి ప్రాణాలు పోతాయ్

Toxic Food: రోజూ తినే ఈ ఆహార పదార్థాలు ఎంత విషపూరితమో తెలుసా? ఒక్కోసారి ప్రాణాలు పోతాయ్

Prostate Cancer: పురుషుల్లో ఆ ముప్పు - పండ్లు, కూరగాయలే రక్షిస్తాయట!

Prostate Cancer: పురుషుల్లో ఆ ముప్పు - పండ్లు, కూరగాయలే రక్షిస్తాయట!

Summer Skin Care: అబ్బాయిలూ ఈ వేసవిలో మీ చర్మాన్ని ఇలా రక్షించుకోండి

Summer Skin Care: అబ్బాయిలూ ఈ వేసవిలో మీ చర్మాన్ని ఇలా రక్షించుకోండి

Coffee: కొవ్వుని కరిగించే కాఫీలు- ఓసారి ట్రై చేసి చూడండి

Coffee: కొవ్వుని కరిగించే కాఫీలు- ఓసారి ట్రై చేసి చూడండి

Peanut Butter: పీనట్ బటర్, రోజుకో స్పూను తింటే ఎంతో ఆరోగ్యం

Peanut Butter: పీనట్ బటర్, రోజుకో స్పూను తింటే ఎంతో ఆరోగ్యం

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!