News
News
వీడియోలు ఆటలు
X

WaterMelon: పుచ్చకాయతో పాటు వీటిని తింటే విరేచనాలు, ఉబ్బరం రావడం ఖాయం

పుచ్చకాయ తినేటప్పుడు కొన్ని రకాల ఆహారాలు తినకూడదు. అలా తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి.

FOLLOW US: 
Share:

వేసవికాలం వచ్చిందంటే పుచ్చకాయల కాలం వచ్చేసినట్టే. రోడ్లమీద కుప్పలుగా పోసి పుచ్చకాయలు అమ్ముతూ ఉంటారు. వీటిలో 95% నీరే ఉంటుంది, కాబట్టి వేసవి తాపాన్ని ఇట్టే తీర్చేస్తుంది. అందుకే పుచ్చకాయ తినే వారి సంఖ్య చాలా ఎక్కువ. బరువు తగ్గడానికి, జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తికి, చర్మ సంరక్షణకు పుచ్చకాయలు చాలా ధీటుగా పనిచేస్తాయి.  ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం ఈ పండు తినడం వల్ల కామోద్దీపన కూడా జరుగుతుంది. అలాగే విటమిన్ A, C, B6 వంటివి కూడా పుష్కలంగా అందుతాయి. పొటాషియం, ఫోలేట్, కాల్షియం వంటి ఖనిజాలు నిండుగా ఉంటాయి. అయితే చాలామంది తెలియని విషయం ఏమిటంటే పుచ్చకాయ తిన్నాక కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. లేకుంటే కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

పాలు
ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం పుచ్చకాయ, పాలు వ్యతిరేక పదార్థాలు. పాలలో కొవ్వు, విటమిన్ బి, ప్రోటీన్లు ఉంటాయి. ప్రోటీన్ పుచ్చకాయ వంటి ఆమ్ల శాతం అధికంగా ఉండే పండుతో కలిస్తే పొట్ట సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

ప్రొటీన్ ఆహారాలు
పుచ్చకాయ తిన్న తర్వాత ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం హానికరం. పుచ్చకాయల్లో ఉండే పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం తినడం వల్ల జీర్ణ క్రియలో ఎంజైమ్‌ల ఉత్పత్తి దెబ్బతింటుంది. ఇది పొట్టకు హానికరం. పుచ్చకాయ తిన్న తర్వాత కనీసం అరగంట గ్యాప్ తీసుకొని ప్రొటీన్ ఆహారాలను తినాలి. 

గుడ్డు
గుడ్డు, పుచ్చకాయలు రెండూ ఫైబర్‌తో నిండి ఉంటాయి. ఈ రెండింటినీ ఒకేసారి తినడం వల్ల పొట్టనొప్పి రావచ్చు.  ప్రోటీన్‌తో పాటు గుడ్లలో ఒమేగా 3 వంటి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. పుచ్చకాయలో నీరు అధికంగా ఉంటుంది. ఇటువంటి తినేటప్పుడు ఈ రెండూ కలిసి ఒక దాన్ని ఒకటి జీర్ణం కాకుండా నిరోధించుకుంటాయి. దీనివల్ల మలబద్ధకంతో పాటు కడుపులో తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి.

నీరు
ఆయుర్వేద వైద్యులు చెబుతున్న ప్రకారం పుచ్చకాయ తిన్న తర్వాత నీరు తాగకూడదు. ఎందుకంటే ఇది మీ జీర్ణాశయాంతర ప్రేగులపై చాలా ప్రభావం చూపిస్తుంది. సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా వంటివి అభివృద్ధి చెందడానికి సహకరిస్తుంది. పుచ్చకాయ తిన్న తర్వాత నీరు తాగితే సూక్ష్మజీవులు వ్యాపించే అవకాశం ఉంది. అంతేకాదు ఆయుర్వేదం ప్రకారం సాధారణ జీవన ప్రక్రియకు ఇది అంతరాయం కలిగిస్తుంది. శరీరంలోని చక్రాల సమతుల్యతను దెబ్బతీస్తుంది. అందుకే వాటర్ మిలన్ తిన్న వెంటనే నీరు తాగకపోవడమే మంచిది. అలా తాగితే వెంటనే అసౌకర్యంగా అనిపిస్తుంది. 

Also read: మీరు తిన్న ఆహారం మీ శరీరానికి సరిపోవడం లేదని చెప్పే లక్షణాలే ఇవన్నీ

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 01 May 2023 11:36 AM (IST) Tags: Avoid these foods Watermelon Watermelon benefits Bloating Watermelon Diarrhea

సంబంధిత కథనాలు

Milk in Dream: పాలు తాగుతున్నట్లు కల వచ్చిందా? మీకేం జరగబోతోందో తెలుసా?

Milk in Dream: పాలు తాగుతున్నట్లు కల వచ్చిందా? మీకేం జరగబోతోందో తెలుసా?

Diabetes: మీ పొట్టే మిమ్మల్ని డయాబెటిస్ నుంచి రక్షిస్తుందట - తాజా స్టడీతో సరికొత్త ఆశలు!

Diabetes: మీ పొట్టే మిమ్మల్ని డయాబెటిస్ నుంచి రక్షిస్తుందట - తాజా స్టడీతో సరికొత్త ఆశలు!

Babies In Lab: గర్భంలో కాదు ల్యాబ్‌లోనే పిల్లల సృష్టి - ఇంకో ఐదేళ్లలో అందుబాటులోకి!

Babies In Lab: గర్భంలో కాదు ల్యాబ్‌లోనే పిల్లల సృష్టి - ఇంకో ఐదేళ్లలో అందుబాటులోకి!

Curd: సమ్మర్‌లో రోజూ పెరుగు ఎందుకు తీసుకోకూడదు? ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

Curd: సమ్మర్‌లో రోజూ పెరుగు ఎందుకు తీసుకోకూడదు?  ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?

Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?

టాప్ స్టోరీస్

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి