By: Haritha | Updated at : 01 May 2023 11:31 AM (IST)
(Image credit: Pixabay)
అతిగా తినడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయని చాలామందికి తెలుసు. అలాగే సరిపడినంత తినకపోయినా కూడా అలాంటి ప్రభావాలే కనిపిస్తాయి. తక్కువ ఆహారం తినడం, ఆహారం తినాలన్న కోరికలను నియంత్రించుకోవడం వంటివి ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. శరీరానికి సరిపడా పోషకాలు, కేలరీలు ఉండే ఆహారం తినడం చాలా అవసరం. మీ బరువు తగ్గించే ప్రయాణంలో ఆహారానికి కోత పెడితే శరీరం తట్టుకోలేదు. కొన్ని లక్షణాల ద్వారా మీరు సరిపడా తినడం లేదని చెబుతుంది శరీరం. ఆ లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి తెలుసుకోండి.
1. తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తినడం, అది కూడా సరిపడా తినకపోవడం వల్ల ప్రాథమిక విధులను కూడా శరీరం నిర్వర్తించలేదు. శరీరానికి తగినంత శక్తి అందదు. దీనివల్ల తీవ్ర అలసట అనిపిస్తుంది. శక్తి హీనంగా అనిపిస్తుంది. మీరు శరీరానికి సరిపడా తినడం లేదని చెప్పే ప్రధాన లక్షణం ఇది.
2. జుట్టు రాలిపోవడం ప్రారంభమవుతుంది. జుట్టు పెరుగుదలకు కేలరీలు, ప్రొటీన్లు, సూక్ష్మ పోషకాలు అవసరం. అవి తగినంతగా శరీరానికి అందకపోతే జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలిపోతున్నప్పడు మీరు సరిగా తింటున్నారో లేదో ఆలోచించుకోండి. అంతే తప్ప షాంపూలు, క్రీములు పెట్టడం వల్ల ఉపయోగం ఉండదు.
3. నిద్రపోవడానికి ముందు, నిద్రపోయి లేచిన తర్వాత కూడా ఆకలి వేస్తూ ఉంటుంది. తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల హార్మోన్లలో మార్పులు సంభవిస్తాయి. శరీరానికి తగినంత క్యాలరీలు, పోషకాలు అందేలా చేయడం కోసం ఆకలిని పెంచుతాయి. రోజంతా ఎక్కువ సేపు ఆకలి వేస్తుంటే శరీరానికి మీరు తిన్న ఆహారం సరిపోవడం లేదని అర్థం.
4. ఎక్కువగా నిద్ర పోవాలనిపిస్తుంది. నీరసం వల్ల ఇలా అనిపిస్తుంది. అయితే ఆ నిద్రలో నాణ్యత కూడా తక్కువే ఉంటుంది. తక్కువగా తినడం వల్ల గాఢ నిద్ర పట్టదు.
5. చీటికిమాటికి చిరాకు పడతారు. ఓపికా, సహనం తగ్గిపోతాయి. ఆహారం ద్వారా తక్కువ క్యాలరీలు శరీరంలో చేరడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. T3 థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు కూడా తక్కువ అయిపోతాయి.
6. ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. ఎందుకంటే తక్కువ ఆహారం వల్ల తక్కువ వ్యర్ధపదార్థాలే తయారవుతాయి. దీనివల్ల జీర్ణవ్యవస్థ నెమ్మదిగా మారిపోతుంది. రెండు, మూడు రోజులకు ఒకసారి మాత్రమే మల విసర్జనకు వెళతారు.
7. శరీరంలో బి విటమిన్లు, ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు, ఫోలేట్లు వంటి పోషకాలు లోపించడం వల్ల మెదడు పనితీరు తగ్గిపోతుంది. అభిజ్ఞా సామర్థ్యం తగ్గుతుంది.
Also read: పచ్చి మామిడితో ఇలా చట్నీ చేస్తే దోశె, ఇడ్లీలోకి అదిరిపోతుంది - వేసవి తాపం తగ్గుతుంది కూడా
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Diabetes: మనదేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు, ఆ రాష్ట్రంలోనే ఎక్కువమంది
Heart Attack: గర్భనిరోధక మాత్రలు అతిగా వాడే మహిళలు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఎక్కువ
kadaknath: ఈ నల్ల కోడిమాంసాన్ని తింటే మంచి రుచే కాదు, ఎంతో ఆరోగ్యం కూడా
Jaggery: వేసవిలో రోజూ చిన్న బెల్లం ముక్క తినడం వల్ల అలాంటి సమస్యలన్నీ దూరం
మద్యం అతిగా తాగితే 33 రకాల జబ్బులు, షాకింగ్ న్యూస్ చెప్పిన కొత్త అధ్యయనం
Telangana Poltics : తెలంగాణ చీఫ్‌ను మారుస్తారని మళ్లీ ప్రచారం - బీజేపీ హైకమాండ్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దుతుంది ?
Devineni Uma : అహంకారం వల్లే ఓడిపోయాం - దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు !
Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!
Saroor Nagar Murder Case: పోలీసులనే భయపెట్టిన అప్సర హత్య కేసు నిందితుడు సాయికృష్ణ- పరువు కోసం చంపేసినట్టు స్టేట్‌మెంట్