News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Joint Pains: కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? ఈ ఆహారంతో నొప్పుల నుంచి ఉపశమనం

వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయి. దానికి కారణం కఠినమైన వ్యాయామాలు చేయడం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు. వాటిని తగ్గించుకోవాలంటే ఆహారమే సరైన మార్గం.

FOLLOW US: 
Share:

కీళ్ల నొప్పులు వస్తే కనీసం కింద కూర్చుని రోజువారీ పనులు కూడా చేసుకోలేని పరిస్థితి. వెన్నెముక, మోకాలు, చేతులు, చీల మండల్లో నొప్పు లేదా మంటను అనుభవిస్తారు. వాటి మీద మరింత ఒత్తిడి పెడితే నొప్పిని తీవ్రతరం చేస్తుంది. గతంలో గాయాలు అయినప్పుడు, దీర్ఘకాలిక వైద్య పరిస్థితులను కలిగి ఉన్నప్పుడు, డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి, అధిక బరువు, ఆరోగ్యం సరిగా లేనప్పుడు కీళ్ల నొప్పులు సంభవిస్తాయి. కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు వ్యాయాయం, సరైన పోషకాహారం తీసుకోవడం వంటి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

విత్తనాలు, నట్స్

బాదం, హాజేల్ నట్స్, పెకాన్స్, వేరుశెనగ, వాల్ నట్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. గింజల్లో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ ఇ ఉన్నాయి. పాలీ అన్ శాచురేటెడ్, మోనోశాచురేటెడ్ కొవ్వులకు మంచి మూలం. కీళ్ళకి మాత్రమే కాదు గుండెకి కూడా మంచి ఆరోగ్యకరమైనవి.

బెర్రీలు

బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రా బెర్రీలు, క్రాన్ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్ వంటి బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అనేక అధ్యయనాల ప్రకారం కీళ్లపై బెర్రీలు మంచి ప్రభావాన్ని చూపుతున్నాయి. బెర్రీలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్, ఇన్ఫ్లమేషన్  నుంచి రక్షిస్తాయి.

క్రూసిఫరస్ కూరగాయలు

బ్రకోలి, కాలీఫ్లవర్ వంటి క్రూసిఫెరస్ కూరగాయలలో సల్ఫోరాఫేన్, ఆస్టియో ఆర్థరైటిస్ మంటను నిరోధించే సహజ సమ్మేళనం ఉన్నట్టు కనుగొనబడింది. కాలానుగుణ కూరగాయలను ఎంపిక చేసుకోవాలి. తినడానికి ముందు దాన్ని సరిగ్గా కడగాలి. ఎందుకంటే సాగు సమయంలో ఉపయోగించే పురుగుమందులు, ఎరువులు శుభ్రంగా తొలగించాలి.

ఆలివ్ నూనె

మానవ ఆరోగ్యంపై ఆలివ్ ఆయిల్ పాత్రపై ఆయనేక అధ్యయనాలు జరిగాయి. గుండెకి ఆరోగ్యకరమైన నూనెల్లో ఆలివ్ నూనె మంచిది. కీళ్ల నొప్పులను తగ్గించుకునేందుకు ఆలివ్ నూనె జోడించుకోవడం ఉత్తమం. వాపుతో సంబంధం ఉన్న ప్రమాదాలని తగ్గిస్తుంది.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ ఒక విధంగా ఆరోగ్యకరమైన ఆరహం. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీర్ఘకాలిక మంట వల్ల మధుమేహం, ఆర్థరైటిస్, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. డార్క్ చాక్లెట్ లోని గుణాలు హానికరమైన ప్రభావాల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి.

వీటిని తిన్నా మంచిదే

ఈ ఆహారాలు మాత్రమే కాదు ఇతర ఆహారాలు కూడా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు. ఎరుపు మిరియాలు, సాల్మన్ చేపలు, ఓట్స్, పసుపు, వెల్లుల్లి, అల్లం, బచ్చలికూర, ద్రాక్షలను కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు తీసుకోవచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: మధుమేహులకు గుడ్ న్యూస్, మీ డైట్ ఇలా ప్లాన్ చేశారంటే షుగర్ లెవల్స్ అసలు పెరగవు

Published at : 03 Jun 2023 07:00 AM (IST) Tags: Joint Pains Healthy Food Dark chocolate Joint Pains Relief Food

ఇవి కూడా చూడండి

Mineral Water: ఇంట్లోనే ఇలా సింపుల్ గా మినరల్ వాటర్ తయారు చేసేసుకోండి!

Mineral Water: ఇంట్లోనే ఇలా సింపుల్ గా మినరల్ వాటర్ తయారు చేసేసుకోండి!

Fruits: పండ్లు కుళ్లిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి!

Fruits: పండ్లు కుళ్లిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి!

Garcinia Cambogia: బరువు తగ్గించుకునేందుకు ఈ పండు తినేస్తున్నారా- మరి సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసా!

Garcinia Cambogia: బరువు తగ్గించుకునేందుకు ఈ పండు తినేస్తున్నారా-  మరి సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసా!

Diabetes: వీటి వల్ల కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త

Diabetes: వీటి వల్ల కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త

High BP: హై బీపీ లేనివారు కూడా ఉప్పు తింటే ప్రమాదమే

High BP: హై బీపీ లేనివారు కూడా ఉప్పు తింటే ప్రమాదమే

టాప్ స్టోరీస్

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?