అన్వేషించండి
Advertisement
Diabetes Symptoms: డయాబెటిస్.. యమ డేంజర్, ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!
యావత్ ప్రపంచాన్ని వేదిస్తున్న ఆరోగ్య సమస్య ‘డయాబెటీస్’. అయితే, దీని లక్షణాలను ముందుగానే తెలుసుకోవడం ద్వారా డయాబెటీస్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
కరోనా వంటి వైరస్‌లకు చికిత్స.. వ్యాక్సిన్లు ఉంటాయేమో. కానీ, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక రోగాలకు మాత్రం చికిత్స ఉండదు. నివారణకు మందులు కూడా లేవు. ఈ వ్యాధి శరీరంలోకి ఎంట్రీ ఇవ్వకుండా జాగ్రత్తపడటం ఒక్కటే మన వద్ద ఉండే మార్గం. ముఖ్యంగా మీ కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ సమస్య ఉన్నా.. మీరు అతిగా తీపి, పిండి పదార్థాలను ఆహారంగా తీసుకుంటున్నా.. మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ వ్యాధిగానీ ఒక్కసారి శరీరంలో తిష్ట వేసిందంటే.. కొత్త సమస్యలు మొదలవుతాయి. శరీరంలోని ఇతర అవయవాలు కూడా ముప్పులో పడతాయి.
డయాబెటిస్ ఎందుకు వస్తుంది?:
టైప్-1, టైప్-2, గెస్టేషనల్ అనే మూడు రకాల డయాబెటిస్ సమస్యలు ప్రస్తుతం మానవళిని శాసిస్తున్నాయి. టైప్-1 డయాబెటిస్ పిల్లలు, యువతలో ఎక్కువగా వస్తుంది. వీరికి పుట్టుక నుంచే ఇన్సులిన్ అందించాల్సి వస్తుంది. టైప్-2 డయాబెటిస్ శరీరానికి అందాల్సిన ఇన్సులిన్ మోతాదు తగ్గడం వల్ల వస్తుంది. ఇక గెస్టేషనల్ అనేది గర్భధారణ సమయంలో ఏర్పడుతుంది. అత్యధిక ప్రజానీకం టైప్-2 డయాబెటిస్‌తోనే బాధపడుతున్నారు.
ఇదే కారణం:
మన శరీరంలో సహజంగానే గ్లూకోజ్ లేదా చక్కెరలు ఉంటాయి. మన శరీరానికి ఇంధనంలా పనిచేస్తూ కావలసినంత శక్తిని గ్లూకోజ్ అందిస్తుంది. అది సరైన మోతాదులో ఉంటేనే ఆరోగ్యానికి మంచిది. శరీరంలో చక్కెర స్థాయిలు.. తీవ్రమైతే ముప్పు తప్పదు. ఈ సమస్యనే ‘హైబ్లడ్ షుగర్’ అని అంటారు. ఇది క్రమేనా డయాబెటిస్‌కు దారి తీస్తుంది. అప్పటి నుంచి రక్తంలో చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు మొదలవుతాయి. వాటిని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు సాగడం ఒక్కటే మధుమేహానికి మందు. తేడా వస్తే.. అవయవాలన్నీ నాశనమవుతాయి.
మూత్ర పిండాలకు ముప్పే!:
మనం రోజూ తీసుకొనే ఆహారంలో సహజంగానే చక్కెర ఉంటుంది. దాన్ని నియంత్రించగలిగే సామర్థ్యం శరీరానికి లేకపోతే డయాబెటిస్ ముప్పు తప్పదు. ఆహారం ద్వారా అందే అదనపు చక్కెర కాలేయంలోనే నిలువ ఉంటుంది. మనం ఏదైనా పనిచేసేప్పుడు.. శరీరానికి అవసరమైన శక్తి ఆ చక్కెర నుంచే లభిస్తుంది. అయితే, కాలేయం అదనపు చక్కెరను నిలువ ఉంచదు. దీంతో ఆ చక్కెర మూత్రం (యూరిన్) ద్వారా పోతుంది. అందుకే డయాబెటిస్ బాధితుల్లో చాలామందికి తరచు మూత్రం వస్తుంది. ముందుగానే ఈ సమస్యను గుర్తించకపోతే.. మూత్ర పిండాలు (కిడ్నీలు) పాడయ్యే ప్రమాదం కూడా ఉంది.
మధుమేహం ముదిరితే ఏమవుతుంది?:
డయాబెటిస్ వచ్చిందంటే నోరు కట్టేసుకోవల్సిందే. ఎప్పటికప్పుడు రక్తంలోని బ్లడ్ షుగర్స్ చెక్ చేసుకుంటూ.. దానికి తగిన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. మధుమేహ బాధితులకు గాయాలు అంత త్వరగా మానవు. ఏదైనా వ్యాధి సోకినా, పుండ్లు ఏర్పడినా అంత త్వరగా తగ్గవు. డయాబెటిస్ బాగా ముదిరితే కంటి చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కొందరికి పక్షవాతం కూడా ఏర్పడుతుంది. ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలను భవిష్యత్తులో ఎదుర్కోవలసి వస్తుంది.
ఎలా గుర్తించాలి? లక్షణాలేమిటీ?:
మధుమేహం బాధితుల్లో ఎక్కువగా కనిపించే ప్రధాన సమస్య ‘అతి మూత్రం’. రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే మూత్ర పిండాలు సక్రమంగా వడపోయలేవు. చక్కెర పేరుకుపోవడం వల్ల తరచుగా మూత్రం వస్తుంది. మూత్రంలో నిలువ ఉండే చక్కెర వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా సమస్యలు ఏర్పడవచ్చు. మర్మాంగాల వద్ద దురద లేదా నొప్పి ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. తీవ్రమైన అలసట, అకస్మాత్తుగా బరువు తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తాయి. మరికొందరు మాత్రం అధిక బరువుతో మధుమేహానికి గురవ్వుతారు. కంటి చూపు మందగించినా సరే డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవాలి. గొంతు పొడిగా ఉన్నా, అతిగా దాహం, ఆకలి వేస్తున్నా డయాబెటిస్‌గా అనుమానించాలి. కొందరిలో చర్మం రంగు కూడా మారుతుంది. మెడ వద్ద చర్మం నల్లగా మారితే వైద్యుడిని సంప్రదించండి.
నివారణ సాధ్యమేనా?:
డయాబెటిస్‌కు మందు లేదు. సరైన మోతాదులో ఇన్సులిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం. శరీరంలో డయాబెటిస్ స్థాయిని బట్టి వైద్యులు ఔషదాలు సూచిస్తారు. డయాబెటిస్ సాధారణ స్థితిలో ఉన్నవారికి మాత్రలను సూచిస్తారు. మధుమేహం తీవ్రంగా ఉన్నట్లయితే సిరంజి ద్వారా శరీరానికి నేరుగా ఇన్సులిన్ ఇవ్వాలని తెలుపుతారు. అయితే, మనం తీసుకొనే ఆహారం ద్వారా కూడా మధుమేహాన్ని నియంత్రించవచ్చు. వైద్యుల సూచన మేరకు తగిన కాయగూరలు, పండ్లు తీసుకోవాలి. రోజుకు కనీసం అరగంట నుంచి గంట సేపు వ్యాయామం, యోగా, ధాన్యం వంటివి చేస్తుండాలి. శరీరక శ్రమ వల్ల రక్తంలోని అదనపు చక్కెర ఖర్చవుతుంది. ఫలితంగా మూత్రపిండాలపై భారం తగ్గుతుంది. మధుమేహం బాధితులు ఏ డైట్ పాటించాలన్నా, ఔషదాలు తీసుకోవాలన్నా వైద్యుడి సలహా తప్పకుండా తీసుకోవాలి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
వరంగల్
క్రైమ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement