అన్వేషించండి

Drying Clothes : చలికాలంలో బట్టలు ఆరబెట్టడం కష్టంగా ఉందా? ఈ సింపుల్ చిట్కాలతో ఇంట్లోనే త్వరగా ఆరబెట్టండి

Laundry Tips in Winter : చలికాలంలో బట్టలు ఆరబెట్టడానికి సులభమైన మార్గాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఫాలో అయితే తేమను తొలగి.. డ్రెస్​లు తాజాగా ఉంటాయి. అవేంటంటే..

Home Tricks to Dry Clothes in Winter : చలికాలంలో ఇంట్లో చేసే చిన్న పనులు కూడా చాలా ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యంగా బట్టలు ఆరేయడం. చల్లని గాలి, బలహీనమైన సూర్యరశ్మి, తేమ కారణంగా బట్టలు ఆరడానికి చాలా సమయం పడుతుంది. చలికాలంలో బట్టలు ఆరడానికి ఎక్కవ సమయం చూడాలి. అయితే మీరు ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వవచ్చు. ఇవి మీ పనిని సులభతరం చేయడంతో పాటు.. సరైన పద్ధతులతో ఆరేలా చేస్తాయి. బయటకు వెళ్లకుండానే మీ బట్టలు తాజాగా ఉంచుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ చూసేద్దాం.

బట్టలు ఆరేసే స్థలం

చలికాలంలో బట్టలు ఆరేయడానికి ఇంటి లోపల కొన్ని మూలలు సెట్ చేసుకోవాలి. కిటికీ దగ్గర లేదా గది తెరిచిన మూల వంటి తేలికపాటి గాలి ప్రసరణ ఉండే ప్రదేశాన్ని ఎంచుకోండి. అక్కడ ఒక రాడ్ లేదా బలమైన తాడును కట్టండి. దుస్తులు ఒకదానికొకటి అంటుకోకుండా ఆరేయండి.  దీనివల్ల అన్ని వైపుల నుంచి డ్రెస్​లకు గాలి తగులుతుంది. 

ఫ్యాన్​తో ఆరబెట్టండిలా

చలికాలంలో ఫ్యాన్లు చాలా తక్కువగా ఉపయోగిస్తారు. కానీ కొద్దిగా గాలి ప్రసరణ ఉంటే డ్రెస్​లు ఆరబెట్టే ప్రక్రియను వేగవంతం అవుతుంది. మీరు బట్టలకు ఎదురుగా ఒక టేబుల్ ఫ్యాన్ కూడా ఉంచవచ్చు. తక్కువ వేగంతో రాత్రిపూట ఫ్యాన్ వేయడం వల్ల దుస్తుల్లోని తేమ తగ్గుతుంది. ఇది బట్టలను వేగంగా ఆరబెట్టడానికి సహాయపడుతుంది.

అధిక నీటిని తీసేయండి..

దుస్తులు ఉతికిన తర్వాత దానిని బాగా పిండాలి. నీరు ఎంత తక్కువగా ఉంటే.. అది అంత త్వరగా ఆరిపోతుంది. చేతితో ఉతికితే బట్టల నుంచి అధిక నీటిని తీసేయొచ్చు. వాషింగ్ మిషన్ వాడితే స్పిన్ మోడ్‌ను రెండుసార్లు రన్ చేయాలి. ఇది అదనపు తేమను తొలగించడంలో సహాయపడుతుంది. తద్వారా బట్టలు త్వరగా ఆరిపోతాయి.

టవల్-అబ్సార్ప్షన్ ట్రిక్ 

తడి బట్టలను రెండు పొడి టవల్స్ మధ్య ఉంచి గట్టిగా నొక్కండి. టవల్స్ బట్టల నుంచి మంచి మొత్తంలో తేమను గ్రహిస్తాయి. దీని తరువాత బట్టలను హ్యాంగర్‌పై వేయండి. చాలా త్వరగా అవి ఆరిపోతాయి. ఈ పద్ధతి తడిని త్వరగా తగ్గించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

హెయిర్ డ్రైయర్‌తో 

కొన్ని సందర్భాల్లో డ్రెస్​కి తగ్గట్లు హెయిర్ ఉండేలా చూసుకుంటారు. కానీ జుట్టు బయటకు వెళ్లేప్పుడు ఇంకా తడిగా ఉంటే.. హెయిర్ డ్రైయర్ మీకు ఉత్తమ పరిష్కారం కావచ్చు. కాలర్లు, చేతులు, అంచులపై వేడి గాలిని పెట్టవచ్చు. ఇవి ఆరడానికి ఎక్కువ సమయం తీసుకునే ప్రాంతాలు. కొన్ని నిమిషాల్లో దుస్తులు ధరించడానికి అనుకూలంగా తయారవుతాయి.

లైట్ ఐరన్ 

బట్టలు కొద్దిగా ఆరినప్పుడు కానీ ఇంకా కొంత తేమ ఉన్నప్పుడు.. వాటిని లోపలికి తిప్పి ఐరన్‌తో తేలికగా నొక్కండి. వేడి మిగిలిన తేమను ఆవిరి చేస్తుంది. చెడు వాసన రాకుండా చేస్తుంది. ఐరన్ చేసిన తర్వాత.. పూర్తి ఆరిన కోసం బట్టలను ఒకటి లేదా రెండు గంటలు వేలాడదీయండి.

రూమ్ హీటర్ 

గది చాలా చల్లగా ఉన్నప్పుడు, దుస్తులు ఆరడానికి ఎక్కువ సమయం పట్టినప్పుడు రూమ్ హీటర్ చాలా సహాయపడుతుంది. తలుపు మూసి.. హీటర్ ఆన్ చేసి.. బట్టలను సురక్షితమైన దూరంలో వేలాడదీయండి. వెచ్చని గాలి క్రమంగా తేమను తొలగిస్తుంది. ఆరబెట్టే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

మందంగా ఉండే దుస్తులను కాసేపు అయినా ఎండలో వేస్తే మంచిది. లేదంటే అవి వాసన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు కూడా వింటర్​లో డ్రెస్​లు ఆరేసుకునేందుకు ఇబ్బంది పడితే.. వీటిని ఫాలో అయిపోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Calcium and Protein Rich Foods : కాల్షియం, ప్రోటీన్ కోసం వీటిని తినండి.. పాలు తాగడం ఇష్టం లేనివారికి బెస్ట్ ఆప్షన్స్ ఇవే
కాల్షియం, ప్రోటీన్ కోసం వీటిని తినండి.. పాలు తాగడం ఇష్టం లేనివారికి బెస్ట్ ఆప్షన్స్ ఇవే
Back Pain in Men : 40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
AP Health Survey: ఏపీని భయపెడుతున్న బీపీ, షుగర్‌.. కొత్తగా 12 లక్షల బీపీ, 11 లక్షల మధుమేహ కేసులు
ఏపీని భయపెడుతున్న బీపీ, షుగర్‌.. కొత్తగా 12 లక్షల బీపీ, 11 లక్షల మధుమేహ కేసులు
Milk Purity Checks at Home : పాలు పల్చగా ఉన్నాయా.. వాసన, రుచిలో తేడా కనిపిస్తోందా? ఇంట్లోనే కల్తీపాలను ఇలా గుర్తించండి
పాలు పల్చగా ఉన్నాయా.. వాసన, రుచిలో తేడా కనిపిస్తోందా? ఇంట్లోనే కల్తీపాలను ఇలా గుర్తించండి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New Universities: ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
Back Pain in Men : 40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
TDP Candidates: ఏపీలో రెండోదశ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్థానాలు, అభ్యర్థులు ఖరారు
ఏపీలో రెండోదశ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్థానాలు, అభ్యర్థులు ఖరారు
AP Panchayat Elections 2026 : ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 50 లక్షల నజరానా.. అధికార పార్టీ రాజకీయానికా, గ్రామాల అభివృద్ధికా?
ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 50 లక్షల నజరానా.. అధికార పార్టీ రాజకీయానికా, గ్రామాల అభివృద్ధికా?
Telangana Phone Tapping Case: త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
Viral News: అతడికి 31.. ఆమెకు 61 - పెళ్లి చేసుకోవాలని కెనడా నుంచి భారత్‌కు.. చివర్లో ఊహించని ట్విస్ట్
అతడికి 31.. ఆమెకు 61 - పెళ్లి చేసుకోవాలని కెనడా నుంచి భారత్‌కు.. చివర్లో ఊహించని ట్విస్ట్
AP Panchayat Elections 2026: పల్లె పోరులో వేలం పాటల జోరు.. సర్పంచి పదవి కోసం రూ.2.30 కోట్లు, పోటీతో పెరిగిన డిమాండ్
పల్లె పోరులో వేలం పాటల జోరు.. సర్పంచి పదవి కోసం రూ.2.30 కోట్లు, పోటీతో పెరిగిన డిమాండ్
Denza D9: లగ్జరీ కారుకి కొత్త అర్థం.. 7 సీట్లు, మసాజ్ ఫీచర్‌, 730 కి.మీ. రేంజ్‌తో వచ్చిన 'డెంజా D9'
కదిలే స్టార్‌ హోటల్‌ లాంటి Denza D9.. ఈ కారు మీ దగ్గరుంటే ప్రతి ఒక్కరి కళ్లూ మీ మీదే!
Embed widget