అన్వేషించండి

Pneumonia Cases : న్యుమోనియా కేసులు పెరుగుతున్నాయట, జాగ్రత్త.. చలికాలంలో ఆ తప్పులు చేయకండి

Pneumonia Risk : చలికాలంలో శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ సమయంలో వైరస్ పెరుగుతాయి. ముక్కు, గొంతు పొడిబారి ఇన్ఫెక్షన్లు సులభంగా ఊపిరితిత్తులకు చేరుకుంటాయి. అందుకే జాగ్రత్తలు తీసుకోవాలి.

Pneumonia Causes and Prevention Tips : చలికాలం ప్రారంభం కాగానే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు రావడం కామన్​. చల్లని గాలి, ఉష్ణోగ్రతలు తగ్గడం, శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనంగా మారడం వల్ల చాలామంది త్వరగా అనారోగ్యానికి గురవుతారు. అయితే అన్ని జలుబులు.. సాధారణ జలుబు కాకపోవచ్చు. ఎందుకంటే అది న్యుమోనియా కావచ్చు. మొదట్లో సాధారణ జలుబుగా ప్రారంభమై.. తీవ్రమైన ఇన్ఫెక్షన్ రూపం దాల్చవచ్చు. అందుకే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. 

చలికాలంలో శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే తగ్గుతుంది. దీని వలన వైరస్​, బ్యాక్టీరియా వేగంగా పెరుగుతాయి. ముక్కు, గొంతు ఎండిపోతుంది. దీని వలన ఇన్ఫెక్షన్ సులభంగా ఊపిరితిత్తులకు చేరుకుంటుంది. అందుకే చలికాలంలో న్యుమోనియా కేసులు బాగా పెరుగుతాయి. మరి చలికాలంలో న్యుమోనియా ఎందుకు పెరుగుతుందో.. ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం. 

న్యుమోనియాకు కారణాలివే..

చలికాలంలో శ్వాస తీసుకునేప్పుడు చల్లని గాలి ఊపిరితిత్తులకు చేరుకుంటుంది. ఈ గాలి ఊపిరితిత్తుల కణజాలాలను ప్రభావితం చేసి.. ఇన్ఫెక్షన్ త్వరగా వస్తుంది. చలి కారణంగా ఎక్కువమంది కిటికీలు, తలుపులు మూసివేస్తారు. స్వచ్ఛమైన గాలి లోపలికి రాదు. లోపలి గాలి బయటకు వెళ్లేదారి ఉండదు. దీని వలన కూడా వైరస్లు త్వరగా వ్యాప్తి చెందుతాయి. అలాగే వింటర్​లో శరీర ఉష్ణోగ్రత తగ్గడం వల్ల రోగనిరోధక శక్తి కొంచెం నెమ్మదిస్తుంది. అటువంటి పరిస్థితిలో.. శరీరం ఇన్ఫెక్షన్​తో పోరాడలేకపోతుంది. ఇది న్యుమోనియా ప్రమాదం పెంచుతుంది.

పొడి, చల్లని గాలి ముక్కు, గొంతులో తేమను తగ్గిస్తుంది. దీని వలన వైరస్లు, బ్యాక్టీరియా సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆస్తమా, గుండె ఆరోగ్యం, మధుమేహం లేదా COPD ఉన్నవారిలో చలికాలంలో ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతుంది. వారికి న్యుమోనియా వచ్చే అవకాశం పెరుగుతుంది. 

న్యుమోనియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే 

చల్లని గాలి నేరుగా ముక్కు నుంచి ఊపిరితిత్తులకు చేరుకుంటుంది. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు మఫ్లర్ లేదా మాస్క్ ధరించండి. వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతాయి కాబట్టి.. చేతులను శుభ్రంగా కడుక్కోండి. లేదా శానిటైజర్ చేసుకోండి. కిటికీలను కొద్దిసేపు తెరవండి. తద్వారా గాలి లోపలికి, బయటకు వెళ్లే అవకాశముంది. చలికాలంలో తక్కువ నీరు తాగుతారు. దీని వలన శరీరం డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి నీళ్లు తాగండి. లేకపోతే సూప్, కషాయం వంటి హెర్బల్ డ్రింక్స్ తీసుకోవచ్చు. 

పండ్లు, కూరగాయలు, పప్పులు, డ్రై ఫ్రూట్స్,  విటమిన్-సి అధికంగా ఉండే వాటిని తీసుకోండి. సిగరెట్లు ఊపిరితిత్తులను బలహీనపరుస్తాయి. న్యుమోనియా ప్రమాదాన్ని చాలా రెట్లు పెంచుతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. పిల్లలు, వృద్ధులు, ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నవారు ఫ్లూ, న్యుమోనియా టీకాలు వేయించుకోవాలి. ఇవి తీవ్రమైన ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. చలికాలంలో ఇన్ఫెక్షన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి కొంత దూరం పాటించండి. మాస్క్​లు వేసుకుంటే మంచిది. 

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
Embed widget