వింటర్​లో గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయి. అందుకే దానిని పదిలంగా చూసుకోవాలి.

చలి ఎక్కువగా ఉన్నప్పుడు స్వెటర్స్ వేసుకోవడం, తలకు హ్యాట్, చేతులకు గ్లౌజ్​లు వేసుకుని వెచ్చగా ఉండాలి.

లేదంటే చలి ఎక్కువై గుండెకు ప్రెజర్ పెరుగుతుంది. దీనివల్ల గుండెపోటు రావొచ్చు.

ఎంత చలిలో ఉన్నా నీటిని తాగి హైడ్రేటెడ్​గా ఉండాలి. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది.

రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలైన నిద్రపోవాలి. దీనివల్ల గుండెపై ఒత్తిడి, ప్రెజర్ తగ్గుతుంది.

ఇంట్లోనే యోగా, వాకింగ్, స్విమ్మింగ్ వంటివి చేయాలి. ఇవి శరీరంలో రక్తప్రసరణను మెరుగు చేసి వెచ్చగా ఉండేలా చేస్తాయి.

చలి ఎక్కువగా ఉన్నప్పుడు గుండెకు ఇబ్బంది కలుగకుండా మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ చేస్తే మంచిది.

చలికాలంలో బీపీని రెగ్యులర్​గా చెక్ చేసుకోవాలి. దానికి తగ్గట్లు మెడిసిన్ తీసుకుంటే గుండెకు ఇబ్బంది కలుగదు.

వైద్యులు సూచించిన మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయకుండా వేసుకుంటే మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.