World Pneumonia Day 2025 : వరల్డ్ న్యూమోనియా డే.. చలికాలంలో పిల్లలకు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Pneumonia Preventions : పిల్లల్లో, పెద్దల్లో వచ్చే న్యూమోనియాపై అవగాహన కల్పిస్తూ ప్రపంచ వ్యాప్తంగా న్యూమోనియా డే చేస్తున్నారు. చలికాలంలో న్యూమోనియా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం.

Precautions and Prevent tips to Pneumonia : చలికాలంలో వచ్చే సీజనల్లో వ్యాధుల్లో ఎక్కువగా అటాక్ చేస్తాయి. లేదా పరిస్థితిని తీవ్రంగా మారుస్తాయి. అలాంటి వాటిలో న్యూమోనియా ఒకటి. పిల్లలపై, వృద్ధులపై ఎక్కువగా ప్రభావం చూపే ఈ సమస్య గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది నవంబర్ 12వ తేదీన “వరల్డ్ న్యూమోనియా డే(World Pneumonia Day)”ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా న్యూమోనియా కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా చిన్నారులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ అంశంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా 2009లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యునిసెఫ్ కలిసి న్యూమెనియా డే ప్రారంభించింది.
న్యూమోనియా..
న్యూమోనియా అనేది ఊపిరితిత్తుల సంక్రమణ వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా పిల్లల మరణాల్లో ఇది ప్రధాన కారణంగా ఉంది. వైరస్, బాక్టీరియా, లేదా ఫంగస్ వల్ల వస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిలో ప్రమాదకరంగా మారుతుంది. ఇదికేవలం చలికాలంలో వచ్చే సమస్య మాత్రమే కాదు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోతాయి. కాబట్టి న్యూమోనియా లక్షణాలు, నివారణ చర్యలపై కనీస అవగాహన ఉంటే.. సమస్య ప్రమాదకరంగా మారకుండా ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూసేద్దాం.
న్యూమోనియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
న్యూమోనియా కేసులు చలికాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఈ సమయంలో పరిస్థితి తీవ్రం కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల సమస్య రాకుండా లేదా న్యూమోనియా ఎక్కువ కాకుండా ఉంటుంది. ముందుగా చలి నుంచి కాపాడుకునేందుకు స్వెటర్స్, క్యాప్స్, సాక్స్‌లు వేసుకోవాలి. ఇవి శరీర ఉష్ణోగ్రతను కాపాడుతాయి. చలికాలంలో నీటిని తక్కువ కాకుండా.. శరీరానికి అవసమైరనంత తీసుకోవాలి. నీళ్లు, హాట్ సూప్స్, కషాయాలు తాగుతూ హైడ్రేటెడ్‌గా ఉండాలి.
వైరస్ వ్యాప్తిని తగ్గించుకునేందుకు తరచుగా చేతుకులు కడుక్కోవాలి. ఇతరులకు హ్యాండ్ షేక్ ఇచ్చినప్పుడు, ఆహారం తీసుకునేముందు కచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. పిల్లలకు కచ్చితంగా ఫ్లూ, న్యూమోనియా వ్యాక్సిన్స్ ఇప్పించాలి. పెద్దలు, వృద్ధులు అయితే స్మోకింగ్ పూర్తిగా మానేయాలి. లేదంటే పొగ ఊపిరితిత్తులను బలహీనపరుస్తుంది. న్యూమోనియా కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యంపైనే డిపెండ్ అయి ఉంటుంది. పిల్లలైనా, పెద్దలైనా చలిలో బయటకు వెళ్లకపోవడమే మంచిది.
వైద్యసహాయం
ఆరోగ్యంగా ఉండాలంటే చలికాలంలో వచ్చే శ్వాస సంబంధిత సమస్యలను లైట్ తీసుకోకండి. దగ్గు, జ్వరం, శ్వాసలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే ఇది న్యూమోనియా రాకుండా జాగ్ర్తతలు తీసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. ఒకవేళ న్యూమోనియా వచ్చినా ఈ టిప్స్ ఫాలో అయితే దానిని దూరం చేసుకోవచ్చు. అయితే వైద్యసహాయాన్ని అస్సలు విస్మరించకూడదు.






















