అన్వేషించండి

Mouth Breathing : నోటితో గాలి పీల్చుకుంటున్నారా? అయితే జాగ్రత్త.. మీ హెల్త్ రిస్క్​లో ఉన్నట్టే

Breathing Issues : కొందరు వివిధ కారణాల వల్ల ముక్కుకి బదులుగా నోటితో గాలి పీల్చుకుంటారు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు. అది ఆరోగ్యానికి రిస్క్ అట.

Mouth Breathing Hidden Health Risks : ఉదయం నిద్ర లేచినప్పుడు నోరు పొడిగా ఉంటుందా? లేదా దిండుపై లాలాజలం మరకలు ఉన్నాయా? ఇది రాత్రుళ్లు నోటి ద్వారా శ్వాస తీసుకుంటున్నాము అనే దానికి గుర్తు. వినడానికి ఇది కామన్​గానే ఉన్నా.. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా హాని కలుగుతుందని చెప్తున్నారు నిపుణులు. చాలామంది దీనిని ఒక అలవాటుగా చూస్తారు కానీ.. ఇది ఆరోగ్యంపై చాలా నెగిటివ్గా ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే మన శరీరం ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడానికి డిజైన్ చేయబడింది. ముక్కు ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు.. గాలి ముక్కు ద్వారా శుభ్రంగా వెళ్లి వెచ్చగా, తేమగా మారుతుంది.

ముక్కు లోపల చిన్న సిలియా, శ్లేష్మం ఉంటాయి. ఇవి ధూళి, కాలుష్యం, బ్యాక్టీరియా వంటి వాటిని నిరోధిస్తాయి. ఇది ఊపిరితిత్తులకు చేరే గాలిని శరీరానికి మరింత మంచిదిగా చేస్తుంది. కానీ ఏదైనా కారణం వల్ల ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం కష్టమైతే.. శరీరం తనంతట తానుగా నోటి ద్వారా శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తుంది. ఈ అలవాటు ఎక్కువ కాలం కొనసాగితే.. ఆరోగ్యానికి ఇబ్బంది వస్తుంది. కాబట్టి ముక్కుకు బదులుగా నోటి ద్వారా శ్వాస ఎందుకు తీసుకుంటారో.. దాని ప్రభావం ఆరోగ్యంపై ఎలా ఉంటుందో చూసేద్దాం. 

ముక్కు దిబ్బడ

చలికాలంలో జలుబు, అలెర్జీలు లేదా సైనస్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో ముక్కు దిబ్బడ ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి శరీరం నోటిని ఉపయోగిస్తుంది.

ఎడినాయిడ్స్ లేదా టాన్సిల్స్

పిల్లల్లో ఎడినాయిడ్స్ లేదా టాన్సిల్స్ తరచుగా పెరుగుతాయి. ఇది ముక్కు మార్గాన్ని మూసివేస్తుంది. దీని కారణంగా కూడా ముక్కుకు బదులుగా నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు.

ముక్కు లోపల లోపం

ఎవరికైనా సెప్టమ్ వంకరగా ఉంటే లేదా ముక్కులో పాలిప్స్ ఉంటే.. గాలి మార్గం క్లోజ్ అవుతుంది. దీని కారణంగా కూడా ముక్కుకు బదులుగా నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు.

దవడ నిర్మాణం

కొంతమంది ముఖం లేదా దవడల నిర్మాణం వల్ల నోరు కొద్దిగా తెరిచి ఉంటుంది. దీని వలన నోటి ద్వారా శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది.

అలవాటు

చాలాసార్లు చిన్నతనంలో బొటనవేలు పెట్టుకునే అలవాటు లేదా పదేపదే నోరు తెరిచి ఉంచడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.

స్లీప్ అప్నియా

ఇది నిద్రకు సంబంధించిన సమస్య. దీనిలో నిద్రపోయేటప్పుడు శ్వాస ఆగిపోతుంది. ఈ స్థితిలో కూడా ప్రజలు నోరు తెరిచి శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తారు.

ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే

నోటితో గాలి పీల్చుకోవడం వల్ల ఆరోగ్యానికిి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. లాలాజలం నోటిని శుభ్రంగా, తేమగా చేస్తుంది. కానీ నోటి ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు పొడిబారిపోయి లాలాజలం ఆరిపోతుంది. దీని వలన బ్యాక్టీరియా పెరుగి నోటి నుంచి దుర్వాసన వస్తుంది. లాలాజలంలో దంతాలను బలంగా ఉంచే ఖనిజాలు ఉంటాయి. నోరు పొడిబారడం వల్ల అవి తగ్గి చిగుళ్ల వాపు, పళ్లు వదులుగా మారడం జరుగుతుంది. నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుంది. స్లీప్ అప్నియాకు కారణం అవుతుంది. దీనివల్ల మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు. దీని ఎఫెక్ట్ పగులు ఉంటుంది. అలసట, చికాకుతో పాటు దేనిపై ఫోకస్ చేయలేరు. 

పిల్లలకు ఈ అలవాటు ఉంటే దంతాల పెరుగుదలపై ప్రభావం ఉంటుంది. ఈ అలవాటు వల్ల పిల్లల ముఖం పొడవుగా, దవడ సన్నగా మారవచ్చు. దంతాలు వంకరగా మారవచ్చు. భవిష్యత్తులో ఆర్థోడోంటిక్ చికిత్స అవసరం కావచ్చు. నోటి ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు శరీరంలో ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది. దీని వలన మెదడు సరిగ్గా పనిచేయదు. కాబట్టి వీలైనంత వరకు వైద్యుల సహాయం తీసుకుంటే మంచిది. అసలు దేనివల్ల సమస్య వచ్చిందో గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలావరకు ఈ ప్రాబ్లమ్ దూరమవుతుంది.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Fenugreek Growing Tips : ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
ఇంట్లోనే మెంతి కూర చాలా ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? చిన్న కుండీలో పెంచగలిగే టిప్స్ ఇవే
Tips To Control Diabetes : మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
మధుమేహాన్ని డైట్​తోనే కాదు.. ఈ 3 మార్పులతో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయండి
Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! 92 లక్షల మందికి నోటీసులు! అక్టోబర్‌ 19న తుది జాబితా!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! 92 లక్షల మందికి నోటీసులు! అక్టోబర్‌ 19న తుది జాబితా!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget