By: ABP Desam | Updated at : 16 Apr 2022 07:09 AM (IST)
Edited By: Suresh Chelluboyina
Image Credit: Pixabay
మాంచి ఎండలో నుంచి ఇంటికి రాగానే చల్లగా ఏదైనా తాగాలని అనిపిస్తుంది. దీంతో వెంటనే ఫ్రిజ్‌లో వాటర్ తీసుకుని గడగడ వాటర్ తాగేస్తాం. అప్పటికప్పుడు ఉపశమనం కోసం చల్లని నీరు తాగడం వల్ల పెద్ద సమస్య ఉండదు. కానీ, సీజన్ మొత్తం కూల్ వాటర్ తాగేవారికే సమస్య. ‘‘అదేంటీ, మేం రోజూ కూల్ వాటరే తాగుతాం. మాకేమీ కాలేదే’’ అని అనుకుంటున్నారా? కూలింగ్ వాటర్ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడండి.
వ్యాయమం, వాకింగ్ తర్వాత కూల్ వాటర్ వద్దు: వేసవిలో మాత్రమే కాదు, సాధారణ రోజుల్లో కూడా కూల్ వాటర్ వద్దు. ముఖ్యంగా వ్యాయామం, వాకింగ్ చేసేప్పుడు కూల్ వాటర్ తాగకపోవడమే ఉత్తమం. ఎందుకంటే.. వ్యాయమం చేసేప్పుడు శరీరంలో వేడి పుడుతుంది. వెంటనే చన్నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతల్లో సమతుల్యత దెబ్బతిని వికారం ఏర్పడుతుంది.
ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి: చిల్ వాటర్ వల్ల గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ సమస్యలు వస్తాయి. అలాగే ఆహారం తినేప్పుడు కూల్ వాటర్ తాగే అలవాటు ఉన్నట్లయితే కఫం ఏర్పడే అవకాశం ఉంది. గొంతులో చల్లని నీటి వల్ల ఏర్పడే శ్లేష్మం వల్ల ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. అలాగే, మీరు తీసుకొనే ఆహారంలో ఉండే ఫ్యాట్.. కూల్ వాటర్ వల్ల అవి గట్టిగా మారిపోతాయి. అవి అంత సులభంగా కరగవు. ఆహారం తీసుకున్న 30 నిమిషాల తర్వాత నీళ్లు తాగడం మంచిది.
గుండె వేగం తగ్గుతుంది: సమ్మర్‌లో కూల్ వాటర్ మాత్రమే కాదు, చల్లచల్లని కూల్ డ్రింక్స్, పండ్ల రసాలు కూడా తాగేస్తుంటారు. బాగా ఐస్ దట్టించిన చెరకు రసాలు కూడా తాగుతారు. ఆ చల్లదనం రక్త నాళాలపై చెడు ప్రభావం పడుతుంది. ఫలితంగా జీర్ణక్రియ సక్రమంగా ఉండదు. పోషకాలను శోషించే శక్తిని శరీరం కోల్పోతుంది. రక్త నాళాల సమస్య వల్ల కొందరిలో గుండె వేగం తగ్గిపోతుంది. ఐస్ వాటర్ తాగడం వల్ల గుండె వేగాన్ని తగ్గించడానికి శరీరం యొక్క స్వయంప్రతిపత్త నాడీ వ్యవస్థలో కీలక భాగమైన వాగస్ నాడిని ప్రేరేపిస్తుంది.
Also Read: వేసవిలో ఏసీ వాడాలంటే వణికిపోతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే కరెంట్ బిల్లు ఆదా!
జీర్ణ సమస్యలు వస్తాయ్: కూల్ వాటర్ వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చల్లని నీరు వల్ల వాత, కఫ, పిత్త దోషలు ఏర్పడతాయని ఆయుర్వేదం చెబుతోంది. కూల్ వాటర్ జీర్ణద్రవాల పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి, ఆహారాన్ని తినేప్పుడు ఫ్రిజ్‌లో వాటర్‌కు బదులుగా సాధారణ నీటిని తాగడమే ఉత్తమం.
Also Read: ఏసీని 24 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో పెడుతున్నారా? అయితే, ముప్పే!
Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!
Bad Body Odour: శరీర దుర్వాసన చికాకు పెడుతోందా? ఈ చిట్కాలు మీ కోసమే!
Moon sand: చంద్రుని మట్టిలో ఆకుకూరల పెంపకం, భవిష్యత్తులో అక్కడ కూడా పంటలు పండిస్తామా?
World Bee Day 2022: వేల తేనెటీగల కష్టమే మనం తాగే స్పూను తేనె, నేడు తేనెటీగల దినోత్సవం
Mutton Recipe: తలకాయ కూర వండడం రావడం లేదా? ఇలా అయితే సింపుల్
Complaint On Avanti Srinivas : "ఒరేయ్ పంతులూ .." అన్నారు - మాజీ మంత్రిపై పోలీసులపై ఫిర్యాదు !
Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్
CM Jagan Davos Tour Contro : దావోస్ కంటే ముందు జగన్ లండన్ వెళ్లారా? అసలు నిజం ఏమిటి ?
NSE Co-location Scam: ఎన్ఎస్ఈ స్కామ్లో కీలక పరిణామం - ట్రేడర్లు, బ్రోకర్ల ఇళ్లలో సీబీఐ సోదాలు