News
News
X

Weight Loss With Beer: బీరు తాగితే బరువు తగ్గుతారా? మందు బాబ్స్, ఇది మీకే!

ఆల్కహాల్ తీసుకునే వారిలో బరువు పెరగడానికి కారణం వారు తాగడం వల్లే అని అనుకుంటూ ఉంటారు. కానీ తాగినా కూడా బరువు పెరగకుండా ఉండవచ్చని అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం.

FOLLOW US: 
 
మీరు బీరు ప్రియులా.. అయితే, మీకు ఇది గుడ్ న్యూసే. సాధారణంగా చాలామంది బీరు తాగితే బరువు పెరుగుతారని, బొజ్జ వచ్చేస్తుందని తెగ వర్రీ అయిపోతారు. కానీ, బీరు తాగి బరువు తగ్గొచ్చట. అయితే, ఇందులోనే ఒక ట్విస్ట్ ఉంది. బీరుతో బరువు తగ్గకూడదంటే ఈ కింది సూచనలు తప్పకుండా పాటించాలి. 

ల్కహాల్ తీసుకునే సమయంలో మంచింగ్ సాధారణమే. అలా మంచింగ్ లో ఏం తింటున్నామనే దాని మీదే బరువు పెరగడమనేది కూడా ఆధారపడి ఉంటుంది. ఆల్కహాల్‌తో పాటు తినే స్టఫ్ కచ్చితంగా ప్రొటీన్ ఎన్ రిచ్డ్ అయితే మంచిదనేది నిపుణుల సూచన. కార్బోహైడ్రేట్లు జోడిస్తే ముందే ఆల్కహాల్ లో కేలరీలు ఉంటాయి. వాటికి తోడు కార్బోహైడ్రేట్ల కేలరీలు కూడా జత చేరి బరువు పెంచేసే ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరి బీరు తాగుతూ చేసే మంచింగ్ ఎలా ఉండాలో, తాగినా బరువు పెరగకుండా ఉండేందుకు మార్గాలేమిటో చూసేయండి.

ప్రొటీన్ తీసుకున్నపుడు కడుపు నిండుగా ఉన్న భావన కలిగి తక్కువ తింటాం. ఫలితంగా అదనపు క్యాలరీలు శరీరంలో చేరవనేది నిపుణుల వాదన. దీనికోసం ప్రత్యేకంగా ఒక అధ్యయనం కూడా నిర్వహించారు. దీనిలో పాల్గొన్న వారిలో మూడింట రెండు వంతుల మంది ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారమే ఎంచుకున్నారు. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నారు. అందువల్ల ఆల్కహాల్ తో కలిపి 1749 క్యాలరీలు మాత్రమే శరీరంలో చేరాయి. నిజానికి వారు ఉన్న బరువును అలాగే కొనసాగించేందుకు అవసరమయ్యే క్యాలరీల కంటే దాదాపు 577 కేలరీలు తక్కువ.

సాసేజ్ రోల్స్, క్రిస్ప్స, బిస్కట్ల వంటి రుచికి బావుండి, ప్రొటీన్ తక్కువ, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు ఆల్కహాల్ తో పాటు తీసుకున్నవారి శరీరాల్లో సగటున 3051 క్యాలరీలు చేరాయి. అది వారికి అవసరమైన దానికంటే దాదాపు 813 క్యాలరీలు ఎక్కువ.

News Reels

ఆల్కహాల్ వినియోగించే వారు ఎలాంటి ఆహారం తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ప్రొటీన్ రిచ్ ఫూడ్ తీసుకున్నపుడు వినియోగించే క్యాలరీలు ఎంత తక్కువ అవుతున్నాయి. వంటి వివరాలు తెలుసుకోవడానికి ఈ అధ్యయనం నిర్వహించామని యూనివర్సిటి ఆఫ్ సిడ్నీ కి చెందిన డాక్టర్ అమందా గ్రెచ్ ఓ మీడియా సంస్థకు తెలిపారు. ఆల్కహాల్ ఎనర్జీ బూస్టింగ్ డ్రింక్ అనడంలో ఏం సందేహం లేదు. కానీ దీని వల్ల బరువు పెరుగుతారు అనడానికి పక్కా రుజువులు లేవనేది ఆమె అభిప్రాయం.

ఈ అధ్యయనం వారి ఆహార అలవాట్లను పరిగణనలోకి తీసుకొని నిర్వహించారు. 9341 మంది వ్యక్తులకు సంబంధించిన డాటాను ఆస్ట్రేలియన్ నేషనల్ న్యూట్రిషన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ సర్వే వారు ఈ అధ్యయనానికి ఎంచుకున్నారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల పెరిగే ఆకలిని చల్లార్చుకోవడానికి మంచి ప్రొటీన్ కలిగిన ఆహారాన్ని ఎంచుకోవడం వల్ల బరువు పెరిగే ప్రమాదం దాదాపు ఉండదని డాక్టర్ గ్రెచ్ అంటున్నారు.

ఇక బీరు ప్రియులు బరువు పెరుగుతామని భయపడకుండా బీరు లాగించవచ్చన్న మాట. అయితే బీరుకు తోడుగా మంచింగ్‌కు.. శాకాహారులైతే ఏ పన్నీరు ముక్కలో, లేదా పల్లీలో, జీడిపప్పులో తినెయ్యాలని, మాంసాహారులైతే చికెన్ కబాబులో, చేప ముక్కలో తినాలని గుర్తుంచుకోండి. బీరుతో బిర్యానీ లాగిస్తే మాత్రం ప్రమాదమే మరి. బీరు బిర్యాని వద్దు, బీరుతో పన్నీరే ముద్దు. ఏమంటారు మరి.

Published at : 21 Oct 2022 08:49 PM (IST) Tags: Health weight alchohol protein

సంబంధిత కథనాలు

ఆ పానీయాలతో క్యాన్సర్ వచ్చే అవకాశం - ఎందుకొస్తుందో వివరించిన అధ్యయనం

ఆ పానీయాలతో క్యాన్సర్ వచ్చే అవకాశం - ఎందుకొస్తుందో వివరించిన అధ్యయనం

Palak Paneer: పాలక్ పనీర్ కాంబో చాలా ఫేమస్, కానీ ఆ కాంబినేషన్ తినకపోవడమే మంచిది

Palak Paneer: పాలక్ పనీర్ కాంబో చాలా ఫేమస్, కానీ ఆ కాంబినేషన్ తినకపోవడమే మంచిది

కాల్చిన సీతాఫలాలను ఎప్పుడైనా తిన్నారా? రుచికి రుచి, ఎన్నో పోషకాలు

కాల్చిన సీతాఫలాలను ఎప్పుడైనా తిన్నారా? రుచికి రుచి, ఎన్నో పోషకాలు

Dandruff: చుండ్రు సమస్య వేధిస్తుంటే ఈ చిట్కాలు పాటించండి

Dandruff: చుండ్రు సమస్య వేధిస్తుంటే ఈ చిట్కాలు పాటించండి

Momos: మోమోస్ తినడం ఆరోగ్యానికి హానికరమా? డయాబెటిస్ వచ్చే ఛాన్సు పెరుగుతుందా?

Momos: మోమోస్ తినడం ఆరోగ్యానికి హానికరమా? డయాబెటిస్ వచ్చే ఛాన్సు పెరుగుతుందా?

టాప్ స్టోరీస్

MP Raghurama Krishna Raju: మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో ఏపీకి పెట్టుబడులు వస్తాయా? - ఎంపీ రఘురామ

MP Raghurama Krishna Raju: మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో ఏపీకి పెట్టుబడులు వస్తాయా? - ఎంపీ రఘురామ

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Rahul Gandhi on BJP: 'పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు?'

Rahul Gandhi on BJP: 'పెట్రోల్, గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు?'

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్

Pawan Kalyan : పదేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్‌తో - సుజిత్, పవర్ స్టార్ సినిమా ప్రకటన వచ్చేసిందోచ్