అన్వేషించండి

Reheat Tea : 'టీ'ని మళ్లీ మళ్లీ వేడిచేసి తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!

పదే పదే వేడి చేసిన టీ తాగితే ఆ సమస్యలు తప్పవు అంటున్న నిపుణులు.

ఇండియాలో ఎక్కువ మంది తాగే పానీయం టీ అనే చెప్పవచ్చు. ఉదయం లేవడంతో మొదలుకొని రాత్రి పడుకునే ముందువరకు కూడా టీ తాగే వారు చాలామందే ఉన్నారు. హెర్బల్ టీలు, ఆరోగ్యం కోసం రూపొందించిన ఎన్ని టీలు వచ్చినా.. పాలతో తయారు చేసుకునే టీ తాగితే కానీ ప్రాణం కుదటపడదు కొందరికీ. అలాంటి టీ వ్యసనపరుల కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 

అనారోగ్య సమస్యలు తప్పవు

కొందరు టీ తాగేందుకు మంచిగా ప్రిపేర్ చేసుకుని కప్పులో పోసుకుంటారు. కానీ ఏదో పనిలో పడి దానిని మరచిపోతారు. అబ్బా చల్లారిపోయింది మళ్లీ తాగుదాంలే అని వేడి చేసుకుంటారు. మరికొందరు అయితే ఉదయాన్నే ఓ 5 కప్పుల టీ రెడీగా పెట్టుకుని.. ఫ్లాస్క్​లు ఉపయోగించకుండా.. తాగాలనుకున్న ప్రతీసారి దానిని వేడి చేసి తాగుతూ ఉంటారు. ఇలా టీని పదే పదే వేడి చేయడం ఎంత ప్రమాదమో మీకు తెలుసా? టీ తాగాలన్న మీ కోరిక అటుంచితే.. లేని పోని అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి అంటున్నారు నిపుణులు. 

ఫంగస్ పెరిగిపోతుంది..

టీని మళ్లీ వేడి చేసి తాగడం చాలా ప్రమాదకరమైనది. అలా చేయడం వల్ల దానిలోని రుచి, వాసనలు కోల్పోతుంది. దానిలోని పోషక లక్షణాలు, ఖనిజాలు పోతాయి. అలాంటి దానిని తాగడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా నాలుగు గంటల కంటే ఎక్కువ సేపు ఉంచిన టీని తర్వాత మళ్లీ వేడి చేసి తాగడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. దానిలో బ్యాక్టీరియా పెరిగిపోయి.. ఫంగస్ వృద్ధి చెందుతుంది. 

జీర్ణ సమస్యలు..

టీలోని బాక్టీరియా.. ముఖ్యంగా మిల్క్​టీని మళ్లీ వేడి చేయడం వల్ల టానిని ఎక్కువ శాతం విడుదలై.. దాని సొంత రుచిని కోల్పోయేలా చేసి రుచిలేని గుణాన్ని ఇస్తుంది. అది కడుపు సమస్యలకు మూలం అవుతుంది. అతిసారం, తిమ్మిర్లు, కడుపు ఉబ్బరం, వికారం వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. వీటిని తేలికగా తీసుకుంటే ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. లేదా ఒకేసారి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. 

వేడి చేయాలనుకుంటే..

అయితే మీరు టీని వేడి చేయాలనుకుంటే మాత్రం టీ పెట్టిన 15 నిమిషాల వరకు వేడి చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పటికీ బ్యాక్టీరియా వృద్ధి చెందకపోవచ్చు. 4 గంటలకు మించి ఎక్కువసేపు ఉంచిన టీని మళ్లీ మాత్రం వేడి చేయకూడదని మరచిపోకండి. ఇది చాలా హానికరం. మీకు అవసరమైనంత టీని మాత్రమే సిద్ధం చేసుకోండి. టైమ్ కలిసి వస్తుందని ఒకేసారి పెట్టుకుని ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకోకండి. 

ముఖ్యంగా టీ దుకాణాలవద్ద టీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వారు పొద్దున్న నుంచి సాయంత్రవరకు దానిని మరిగిస్తూనే ఉంటారు. లేదంటే ఒకేసారి టీ పెట్టి.. అడిగినప్పుడు వేడి చేస్తూనే ఉంటారు. ఇలాంటి టీ తాగడం కన్నా మీరు టీ అనే వ్యసనం నుంచి బయటపడిపోండి. లేదంటే ప్రశాంతంగా ఇంట్లోనే కావాల్సినంత టీ పెట్టుకుని రోజును ప్రారంభించండి. 

Also Read : రవ్వతో ఊతప్పం.. కేవలం 15 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు

గమనిక:పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకోండి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

టాప్ హెడ్ లైన్స్

Kidney Health : కిడ్నీలను డీటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్.. నీటి తర్వాత ఇవే బెస్ట్
కిడ్నీలను డీటాక్స్ చేసి ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్.. నీటి తర్వాత ఇవే బెస్ట్
Diabetes and Dengue : మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
మధుమేహం(Type 2 Diabetes) ఉన్నవారికి డెంగ్యూ వస్తే ప్రమాదమా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Embed widget