Weight Loss : బరువు తగ్గేందుకు యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకుంటున్నారా ? కానీ ఇలా మాత్రం తీసుకోకండి
బరువు తగ్గడానికి యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకోవచ్చు కానీ దాని వల్ల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.
బరువు తగ్గేందుకు చెమటోడ్చి కష్టపడాల్సిన అవసరం లేకుండా ఆహారంలో మార్పులు చేసుకున్నా సరిపోతుంది. అందుకు బెస్ట్ ఎంపిక యాపిల్ సిడర్ వెనిగర్. ఇది తీసుకోవడం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుందని అనేక అధ్యయనాలు కూడా వెల్లడిస్తున్నాయి. యాపిల్ సిడర్ వెనిగర్ ఆహారం తిన్న తర్వాత వచ్చే గ్లూకోజ్ పెరుగుదలని నియంత్రిస్తుందని అధ్యయనాలు నిరూపించాయి. దీని వల్ల ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరుస్తుంది. కనుక కొవ్వు పేరుకుపోయే అవకాశం తగ్గుతుంది. ఇది తీసుకువడం వల్ల ఆకలి కూడా అణచివేసేందుకు దోహదపడుతుంది. దీన్ని తాగడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. దాని వల్ల తినడం తగ్గిస్తారు. అప్పుడు బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది.
బరువు తగ్గడానికి వ్యాయామంతో పాటు సమతుల్య ఆహార తీసుకోవడం కూడా ముఖ్యమే. బరువు తగ్గాలని నిర్ణయించుకుని యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. దీని వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ వైద్యుడు, పోషకాహార నిపుణుల సలహా లేకుండా దీన్ని తీసుకోకూడదు. దాని వల్ల అనారోగ్య సమస్యలు దారి తీసే అవకాశం ఉంది.
నేరుగా తాగకూడదు
యాపిల్ సిడర్ వెనిగర్ నేరుగా తాగడం వల్ల పంటి మీద ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. అలాగే కడుపులో కూడా ఇబ్బంది వస్తుంది. అందుకే దాన్ని అలాగే ఎప్పుడు తీసుకోకూడదు. నీటిలో కరిగించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. 1 కప్పు నీటిలో 1 టేబుల్ స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్ తీసుకుని కరిగించుకుని తీసుకుంటే సరిపోతుంది.
సలాడ్ మీద చల్లుకోవచ్చు
యాపిల్ సిడర్ వెనిగర్ ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరం. అందుకే దాన్ని తీసుకోవడానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. సలాడ్ మీద డ్రెస్సింగ్ గా వేసుకోవచ్చు. ఆలివ్ నూనెతో కలిపి కూడా తీసుకోవచ్చు.
భోజనం చేసిన వెంటనే తాగొద్దు
ఆహారం తీసుకున్న వెంటనే యాపిల్ సిడర్ వెనిగర్ తాగడం మంచిది కాదు. ఇది జీర్ణక్రియ సమస్యలని సృష్టిస్తుంది. భోజనం తిన్న తర్వాత తీసుకోవాలని అనుకుంటే కనీసం 20 నిమిషాలు పాటు వేచి ఉండాలి. అలాగే భోజనం ముందు దీన్ని తీసుకోవచ్చు.
ఎక్కువగా తాగకూడదు
బరువు తగ్గించే ప్రయోజనాలు ఉన్నాయి కదా అని దీని ఎక్కువగా తాగకూడదు. ఇది అమితంగా తీసుకోవడం శరీరానికి ప్రమాదకరం. బర్నింగ్ సెన్సేషన్ ఇస్తుంది. గొంతుని ఇబ్బంది పెడుతుంది. ఇతర దుష్ప్రభాలకు దారి తీస్తుంది. అందుకే తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. రోజుకి 2 టేబుల్ స్పూన్లకి మించి తాగకూడదు. అది కూడా కరిగించకుండా నీళ్ళలో కలపకుండా అసలు తీసుకోకూడదు.
నిద్రపోయే ముందు వద్దే వద్దు
నిద్రకి ఉపక్రమించే ముందు యాపిల్ సిడర్ వెనిగర్ తాగడం వల్ల ప్రయోజనం ఉండదు. లాభం లేకపోగా గొంతు, అన్నవాహికకు హానికరం. అందుకే భోజనానికి ముందు తీసుకోవాలి. తాగిన తర్వాత భోజనం చేసేందుకు కనీసం 30 నిమిషాలు గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also read: ఈ సమయాల్లో తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ, ముందు జాగ్రత్తలు తీసుకోక తప్పదు