సంతానం కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ రోజువారీ అలవాట్లు తప్పకుండా మానేయాల్సిందే
తల్లి కావాలని ప్రతి మహిళ ఆశపడుతుంది. కానీ గర్భం ధరించాలంటే కొంతమంది ఎన్నో సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది.
కొంతమందికి ఎటువంటి ఆటంకం లేకుండా గర్భం వస్తుంది. కానీ మరికొంతమందికి మాత్రం గర్భం వస్తుంది కానీ అది నిలబడకుండా గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బిడ్డని కనాలని ప్లాన్ చేస్తున్నవారు ఎవరైనా కూడా గర్భం ధరించే వరకు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని రోజువారీ ఆహారాలను నిరోధిస్తేనే గర్భం ధరించే వీలు ఉంటుంది. అలాగే సంతానోత్పత్తిని ప్రభావితం చేసే ఈ అలవాట్లు విస్మరించాలి. అప్పుడే మీరు అనుకున్నట్టుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గర్భం ధరించగలుగుతారు.
ధూమపానం మానేయాలి: పొగాకు వినియోగం అధికంగా ఉంటే సంతానోత్పత్తికి ఆటంకం కలుగుతుంది. ఇది అండాశయాలని తగ్గించేస్తుంది. ప్రతినెలా విడుదలయ్యే గుడ్లని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన పద్ధతిలో గర్భం ధరించాలని అనుకుంటే మాత్రమ తప్పనిసరిగా ధూమపానం వదిలేయాలి. వైద్యుల సలహాలు తీసుకుంటే ధూమపానం అలవాటు మానుకునేందుకు ప్రయత్నించాలి.
ఆల్కహాల్ వద్దు: మద్యపానం ఎక్కువగా చేస్తే అండోత్సర్గం ప్రమాదాన్ని పెంచుతుంది. గర్భం ధరించాలని అనుకుంటే ఖచ్చితంగా మద్యపానం పూర్తిగా నివారించాలి. పిండం పెరుగుదలకి ఆటంకం కలిగిస్తాయి. జింక్, ఫోలిక్ యాసిడ్ కూడా ఆల్కహాల్ తాగడం వల్ల మూత్రంతో పాటు బయటకి పోతాయి. దీంతో ఈ రెండింటి లోపం ఏర్పడుతుంది. దీని వల్ల గర్భం ధరించడం కష్టం అవుతుంది.
కెఫీన్ వద్దు: రోజుకి 200 మిల్లీగ్రాముల కంటే తక్కువ కెఫీన్ తీసుకోవడం వల్ల స్త్రీల సంతానోత్పత్తికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ మోతాదుకి మించి తీసుకుంటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే రోజుకి ఒకటి లేదా రెండు కప్పుల కాఫీకి పరిమితం చేయాలి.
అతిగా వ్యాయామం వద్దు: తీవ్రమైన శారీరక శ్రమ అండోత్సర్గం నిరోధిస్తుంది. ప్రొజెస్టేరాన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. బరువు అదుపులో ఉండి గర్భవతి కావాలని అనుకుంటే ఎక్కువగా శారీరక శ్రమ చేయకుండా ఉండటమే మంచిది. వారానికి ఐదు గంటల కంటే తక్కువ వ్యాయామాన్ని పరిమితం చేయాలి. డాక్టర్ల సూచనల మేరకు యోగాసనాలు, వ్యాయామం చేయడం మంచిది. అప్పుడే సుఖమైన ప్రసవం జరుగుతుంది.
టాక్సిన్స్ కు గురికావద్దు: పర్యావరణ కాలుష్య కారకాలు, టాక్సిన్స్, పురుగుమందులు, డ్రై క్లీనింగ్ ద్రావకాలు, సీసం వంటివి సంతానోత్పత్తికి ప్రతికూలంగా ఉంటాయి.
నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి: తగినంత నిద్రలేకపోతే తీవ్ర ఇబ్బందులు వస్తాయి. కొంతమంది రాత్రి పూట ఫోన్లు చూస్తూ ఆలస్యంగా నిద్రపోతారు. నైట్ షిఫ్ట్ వంటి పరిస్థితులు కూడా శరీరాన్ని బలహీనంగా మారుస్తాయి. ఖచ్చితంగా ఎనిమిది గంటలు నిద్ర శరీరానికి అవసరం.
ఐవీఎఫ్ పద్ధతిలో గర్భం ధరించాలని చూస్తున్న వాళ్ళు కూడా తమ అలవాట్లు మార్చుకుంటే మంచిది. శాఖాహారం, గ్లూటెన్ లేని ఆహారాన్ని తినడం చాలా మంచిది. ప్రాసెస్ చేసిన ఫుడ్స్, పచ్చి గుడ్లు, ధూమపానం, మద్యపానం, కెఫీన్, సముద్రపు చేపలు, రొయ్యలు తీసుకోకుండా ఉండాలి. ఇవి తీసుకోవడం వల్ల పిండం అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. పుట్టే పిల్లల్లో లోపాలు వచ్చే అవకాశం ఉంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: నిద్ర ఎక్కువగా వస్తుందా? అలసటగా అనిపిస్తుందా? అసలు కారణం ఇదే!