News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

New Virus: ఈ లక్షణాలు కనిపిస్తే జలుబు అనుకోవద్దు- కొత్త వైరస్ లక్షణాలు కావొచ్చు

జలుబు చేసినప్పుడు ఎలా ఉంటుందో అలాగే మనిషి నీరసపడిపోతాడు. కానీ అది జలుబు అనుకోని నిర్లక్ష్యం చేస్తే ఈ కొత్త వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది.

FOLLOW US: 
Share:

కరోనా వచ్చిన తర్వాత పలు దేశాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కొత్త కొత్త వైరస్లు పుట్టుకొచ్చి శ్వాస కోశ సమస్యలు తీసుకొస్తున్నాయి. కరోనా నుంచి ఇంకా పూర్తిగా బయట పడకముందే మరికొన్ని దాడి చేస్తున్నాయి. తాజాగా అమెరికా అంతటా ఎక్కువగా వ్యాపిస్తున్న వైరస్ హ్యూమన్ మెటాప్ న్యూమోవైరస్(HMP).  ఇది శ్వాస కోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. శిశువులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు, వృద్ధులు దీని బారిన త్వరగా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ జలుబు మాదిరిగానే దీని లక్షణాలు ఉంటున్నాయి.

HMP వైరస్ అంటే ఏంటి?

HMP అనేది రెస్పిరేటరీ వైరస్. న్యూమోవిరిడే కుటుంబానికి చెందినది. 2001 లో నెదర్లాండ్స్ లో 28 మంది పిల్లల్లో కనుగొన్నారు. వ్యాధి సోకిన పిల్లల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు జరిపారు. శ్వాస కోశ సిన్సిటియల్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే ఇబ్బందులతో ఈ వ్యాధి లక్షణాలు ఒకేలా ఉన్నాయి. శ్వాసకోశ వ్యాధి నుంచి న్యుమోనియా వరకు ఇది పరిణితి చెందవచ్చు. ఈ వైరస్ కనీసం 50 సంవత్సరాలుగా మానవులలో వ్యాపిస్తోందని పరిశోధకులు కనుగొన్నారు.

HMP కేసులు 30 శాతం పెరిగాయి

ఒక నివేదిక ప్రకారం ఈ మెటాప్ న్యూమోవైరస్ కేసులు మార్చిలో యూఎస్ అంతటా వ్యాపించాయి. యూఏస్ సెంటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఈ వైరస్ ను అడ్డుకునేందుకు 19.6 శాతం యాంటీజెన్ పరీక్షలు 10.9 శాతం పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. మహమ్మారి కంటే ముందుగానే ఈ వ్యాధి కేసులు 36 శాతం పెరిగాయి. ఈ వైరస్ యునైటెడ్ స్టేట్స్ లో ఒక ఫ్లూ మాదిరిగా మారిపోయింది. శీతాకాలంలో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.

లక్షణాలు ఏంటి?

యూఎస్ సెంటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు ఎక్కువగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు పిల్లల్లో కనిపిస్తున్నాయి. ఈ వైరస్ సోకిన చిన్నారుల్లో న్యుమోనియా లక్షణాలు బయట పడుతున్నాయని అమెరికన్ లంగ్ అసోసియేషన్ తెలిపింది. ఈ వైరస్ సోకిన వారికి ఎక్కువగా జలుబు చేస్తుంది. ఇమ్యూనిటీ బాగా ఉన్నవాళ్ళు త్వరగా తమంతట తాముగా కోలుకోగలుగుతున్నారు.

ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

ఇది అంటు వ్యాధి. రోగి తుమ్మినా దగ్గినా నోటి తుంపర్ల ద్వారా వ్యాపిస్తోంది. బాధిత వ్యక్తిని తాకినా, వారి వస్తువులు ముట్టుకున్నా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వైరస్ కి నిర్దిష్టమైన చికిత్స ఏమి లేదు. వ్యాక్సిన్ తయారీలో పరిశోధకులు నిమగ్నమయ్యారు. దీని నిరోధించడానికి టీకా ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుకే తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.

☀కనీసం 2 సెకన్ల పాటు చేతులని తరచుగా సబ్బుతో నీటితో కడగాలి. బయటకి వెళ్ళిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోకుండా ముక్కు, నోరు, కళ్ళు తాకకూడదు.

☀అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోకూడదు.

☀వ్యాధి సోకిన వ్యక్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోరు, ముక్కుకి ఏదైనా అడ్డం పెట్టుకోవాలి. రోగికి సంబంధించి వస్తువు, పాత్రలు, దుస్తులు ఇతరులతో పంచుకోవడం మానుకోవాలి. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరు బయట తిరగకపోవడమే మంచిది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా? మీ డైట్ ప్లాన్ ఇలా చేసుకోండి

Published at : 10 Sep 2023 11:02 AM (IST) Tags: Cold HMP Virus HMPV Virus America New Virus HMP Virus Symptoms

ఇవి కూడా చూడండి

Hyperacidity: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే

Hyperacidity: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే

Weight Loss: జిమ్‌కు వెళ్ళకుండా బరువులు ఎత్తకుండానే మీ బరువు ఇలా తగ్గించేసుకోండి

Weight Loss: జిమ్‌కు వెళ్ళకుండా బరువులు ఎత్తకుండానే మీ బరువు ఇలా తగ్గించేసుకోండి

Pea Protein Powder: బఠానీలతో చేసిన ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే అన్నీ లాభాలున్నాయా?

Pea Protein Powder: బఠానీలతో చేసిన ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే అన్నీ లాభాలున్నాయా?

Relatioships: నా భర్త ఆమెతో మళ్లీ మాట్లాడుతున్నాడు, నాకు నచ్చడం లేదు - ఏం చేయమంటారు?

Relatioships: నా భర్త ఆమెతో మళ్లీ మాట్లాడుతున్నాడు, నాకు నచ్చడం లేదు - ఏం చేయమంటారు?

Teenagers: తల్లిదండ్రులూ జాగ్రత్త, టీనేజర్లలో పెరిగిపోతున్న డిప్రెషన్ లక్షణాలు

Teenagers: తల్లిదండ్రులూ జాగ్రత్త, టీనేజర్లలో పెరిగిపోతున్న డిప్రెషన్ లక్షణాలు

టాప్ స్టోరీస్

KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్ మీటింగ్ వచ్చే వారం !

KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్  మీటింగ్ వచ్చే వారం   !

TDP News : అధికార మత్తు వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !

TDP News  :  అధికార మత్తు  వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?

Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?