By: Haritha | Updated at : 27 Nov 2022 08:36 AM (IST)
(Image credit: Pexels)
రోజూ ముక్క ఉంటే కానీ ఎంతో మందికి ముద్ద దిగదు. ఇలా రోజూ చికెన్ తినడం అలవాటు చేసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు రాకమానవు. చికెన్ ఆరోగ్యకరమే కానీ, రోజూ తినాల్సిన అవసరం లేదు. రెండు మూడు రోజులకోసారి తిన్నా చాలు. ఒకవేళ రోజూ తినే అలవాటు ఉంటే, రెండు ముక్కల కన్నా ఎక్కువ తినకూడదు. చేపలు తరువాత ఆరోగ్యకరమైన మాంసం ఇదే. వారానికి రెండు సార్లు తిన్నా చాలు మన శరీరానికి అవసరమైన ప్రొటీన్ అందుతుంది. ఆరోగ్యం కదా అని రోజూ తింటే కొన్ని అనారోగ్యాలు వచ్చే అవకాశం పెరుగుతుంది.
అధిక ప్రొటీన్
చికెన్లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. రోజూ కోడిమాంసం తినేవారిలో ప్రొటీన్ అధికంగా శరీరంలో చేరుతుంది. ఇది కొవ్వు రూపంలో మారి పేరుకుపోతుంది. మీకు తెలియకుండానే బరువు పెరుగుతారు. రక్తంలో లిపిడ్ స్థాయిలు పెరిగిపోతాయి. కాబట్టి రొజూ తినే అలవాటును మానుకుంటే మంచిది.
గుండె జబ్బులు
చికెన్‌ని ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగవచ్చు. ఇది హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాన్ని కూడా పెంచుతుంది. చికెన్ లాంటి అధిక ప్రోటీన్ ఉత్పత్తులను అతిగా తినడం వల్ల పరోక్షంగా గుండె సంబంధ వ్యాధులను పెంచుకున్కనట్టే. అంటే అకాల మరణాన్ని కొని తెచ్చుకున్నట్టే.
బరువు పెరుగుతారు
చికెన్ అనేది జంతు ఆధారిత ప్రొటీన్‌కు మూలం. దీన్ని తినడం వల్ల ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం కష్టమవుతుంది. అంటే బరువు పెరిగిపోతారన్నమాట. శాఖాహారులతో పోలిస్తే రోజూ చికెన్ తినేవారి BMI అధికంగా ఉన్నట్టు గుర్తించారు అధ్యయనకర్తలు.
ఫుడ్ పాయిజనింగ్
చికెన్ శుభ్రంగా కడిగి, బాగా ఉడికించాలి. ఇలా చేయకపోతే ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే అవకాశం ఎక్కువ. వండని చికెన్ పై సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టిరియాలు ఉంటాయి. చికెన్‌ను ముట్టుకుంటే మన చేతులకు అంటుకుని పొట్ట లోనికి చేరే అవకాశం ఉంది. అలాగే సరిగా ఉడికించకపోయినా ఈ బ్యాక్టరియా శరీరంలోకి చేరి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. గర్భిణిలకు ఇది చాలా ప్రమాదకరం.
యాంటీ బయోటిక్స్ పనిచేయకపోవచ్చు
పౌల్ట్రీ రైతులు తాము పెంచుతున్న కోళ్లకు బలవంతంగా యాంటీబయోటిక్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్టు వార్తలు వస్తాయి. అలాంటి చికెన్ తినేవారిలో యాంటీబయోటిక్స్ నిరోధకత పెరిగిపోతుంది. అంటే మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు వైద్యులు ఇచ్చిన యాంటీ బయోటిక్స్ మీపై పనిచేయవన్న మాట. ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి రోజూ చికెన్ తినే అలవాటును మానుకోండి.
Also read: మధుమేహుల కోసం రాగిపిండి కేకు, ఇంట్లోనే ఇలా చేయండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Cauliflower: క్యాలీఫ్లవర్ ఆకులు పడేస్తున్నారా? దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇక మీదట అలా చెయ్యరు
Green Peas Recipe: పచ్చిబఠానీ - చీజ్ కట్లెట్ రెసిపీ, సాయంత్రానికి టేస్టీ స్నాక్
Samantha Diet: ఆటోఇమ్యూన్ డైట్ - సమంత పాటిస్తున్న డైట్ ఇదే, ఇంతకీ ఏంటిది?
అది ప్రేమ హార్మోన్ కాదు, ఆ హార్మోన్ లేకున్నా మనం ప్రేమించగలం - కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
గంజి నీళ్ళతో ఎన్ని ఉపయోగాలో తెలిస్తే, మీరు కూడా గంజి వచ్చేలా అన్నం వండుతారు
కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీలో రచ్చరచ్చ- ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీ
Bharat Jodo Yatra: శ్రీనగర్‌లో రాహుల్, ప్రియాంక సందడి - భారీ సభతో జోడో యాత్రకు ముగింపు
Kangana Ranaut:‘ఈ దేశం ఖాన్‌లను, ముస్లీం హీరోయిన్లకు ప్రేమిస్తోంది’ - ‘పఠాన్’ సక్సెస్‌పై కంగనా కామెంట్స్
Prabhas –Hrithik: ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్, ప్రభాస్-హృతిక్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ మూవీ?