అన్వేషించండి

Diabetes Alert : షుగర్ పేషెంట్స్ ఈ ఫ్రూట్స్ తింటుంటే జాగ్రత్త.. రక్తంలో చక్కెర పెంచే పండ్లు ఇవే

Diabetic Diet : ఆరోగ్యానికి పండ్లు చాలామంచివి. అయితే మధుమేహం ఉన్నప్పుడు కొన్ని ఫ్రూట్స్ తినకూడదని అంటున్నారు నిపుణులు. మరి షుగర్ ఉంటే ఏ పండ్లకి దూరంగా ఉండాలో చూసేద్దాం. 

High-Sugar Fruits to Avoid If You Have Diabetes : పండ్లు ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలుసు. చాలామంది వాటిని డైట్​లో చేర్చుకోవాలని అంటారు. అయితే మధుమేహం ఉన్నవారు మాత్రం పండ్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఎందుకంటే అన్ని పండ్లు రక్తంలో చక్కెరకు సురక్షితం కాదు. కొన్ని పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచి ఇబ్బందికి కారణమవుతాయి. షుగర్ కంట్రోల్ చేసుకోవాలనుకునేవారు ఎలాంటి ఫ్రూట్స్​కి దూరంగా ఉండాలో.. వేటిని తక్కువ మోతాదులో తీసుకోవాలో చూసేద్దాం. 

అరటిపండు..

అరటిపండు తినడం సర్వసాధారణం. కానీ అందులో చక్కెర అధికంగా ఉంటుంది. మీడియం అరటిపండులో దాదాపు 14 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది హై గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఎక్కువగా పండిన అరటిపండ్లు రక్తంలో చక్కెర వేగంగా పెరగడానికి కారణమవుతాయి.

ద్రాక్షలు

చిన్నగా, జ్యూసీగా ఉండే ద్రాక్షలు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి అనిపించవచ్చు. కానీ ఒక కప్పు ద్రాక్షలో దాదాపు 23 గ్రాముల చక్కెర ఉంటుంది. వాటిలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి చక్కెర త్వరగా రక్తంలోకి వెళ్లి షుగర్ స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి వాటిని మితంగా తినడం మంచిది.

మామిడి

మామిడిలో చక్కెర ఎంత ఎక్కువగా ఉంటుందో అంతే రుచికరంగానూ ఉంటుంది. ఒక కప్పు తరిగిన మామిడిలో దాదాపు 23 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది విటమిన్ సి ని అందిస్తుంది. కానీ అధిక మొత్తంలో రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది.

పైనాపిల్

తాజాగా లేదా స్టోర్ చేసిన పైనాపిల్.. చక్కెరను త్వరగా విడుదల చేస్తుంది. ఒక కప్పు పైనాపిల్‌లో దాదాపు 16 గ్రాముల చక్కెర ఉంటుంది. అధిక GI ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మంచిది. కానీ పోర్షన్ కంట్రోల్ అవసరం. లేదంటే మధుమేహం పెరుగుతుంది. 

చెర్రీలు

చెర్రీలను తేలికైన పండ్లుగా పరిగణిస్తారు. కానీ ఒక కప్పు చెర్రీలలో దాదాపు 18 గ్రాముల చక్కెర ఉంటుంది. అవి స్వీట్​గా ఉండడం వల్ల తెలియకుండానే ఎక్కువగా తినేస్తారు. వాటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కానీ మితంగా తీసుకోవడం మంచిది.

పుచ్చకాయ

పుచ్చకాయలో నీరు పుష్కలంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ దీనికి అధిక గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. ఒక కప్పు పుచ్చకాయలో చక్కెర తక్కువగా ఉన్నట్లు అనిపించినప్పటికీ.. ఇది రక్తంలో చక్కెరను త్వరగా పెంచుతుంది.

అంజీర్

అంజీర్ పండ్లను చాలా పోషకమైనవిగా చెప్తారు. కానీ వాటిలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. ఒక మధ్య తరహా అంజీర్‌లో దాదాపు 8 గ్రాముల చక్కెర ఉంటుంది. ఎండిన అంజీర్‌లో ఈ పరిమాణం మరింత పెరుగుతుంది.

ఖర్జూరాలు

ఖర్జూరాలలో చక్కెర ఉండటం వల్ల వాటిని శక్తిని పెంచేవిగా భావిస్తారు. కానీ ఖర్జూరంలో దాదాపు 16 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కానీ రక్తంలో చక్కెర సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

లిచీలు

లీచీలు స్వీట్స్ రుచిని పోలి ఉంటాయి. దాదాపు అదే స్థాయిలో చక్కెరను కలిగి ఉంటాయి. కేవలం 10 లీచీలలో దాదాపు 29 గ్రాముల చక్కెర ఉంటుంది. వాటిలో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల.. అవి రక్తంలో చక్కెర వేగంగా పెరగడానికి కారణమవుతాయి.

కాబట్టి పండ్లు ఆరోగ్యానికి మంచిదే అని అన్నీ తీసుకోకూడదు. అలాగే ఎక్కువ మోతాదులో తీసుకోకపోవడమే మంచిది. తక్కువ మోతాదులో అన్ని ఆస్వాదిస్తే ఎలా ఇబ్బందులు రావు.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget