అన్వేషించండి

Healthy Heart : గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎంతసేపు నడవాలి? వేగం ఎంత ఉండాలి? వైద్యుల సూచనలు ఇవే

Walking for Heart Health : నడక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎంతసేపు నడవాలి? ఎలా నడిస్తే ప్రయోజనం ఉంటుందో వైద్యులు ఇస్తోన్న సూచనలు ఏంటో తెలుసుకుందాం.

Fast Walking for Heart Health : బరువు తగ్గడం నుంచి ఆరోగ్యంగా ఉండేందుకు నడక మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే హార్ట్ హెల్తీగా ఉండేందుకు కూడా రోజూ నడవచ్చు. అయితే గుండె ఆరోగ్యం కోసం రోజుకు ఎంతసేపు నడవాలి? ఎలా నడిస్తే ప్రయోజనం ఉంటుందనే దానిపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. హార్ట్ హెల్త్​ని కాపాడుకోవాలనుకుంటే నడక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూసేద్దాం. 

గుండె ఆరోగ్యం కోసం తక్కువ సమయంలో ఎక్కవ నడవాలని అంటున్నారు. అంటే 10 నుంచి 15 నిమిషాలు వేగంగా నడవడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని ఒక అధ్యయనం నిరూపించింది. ముఖ్యంగా శారీరకంగా చురుకుగా లేని వారికి, తక్కువ సమయం వేగంగా నడవడం వల్ల మరణం, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుందట. నడక విధానంలో చేసే చిన్న మార్పు కూడా గుండె ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని చెప్తున్నారు.

గుండె ఆరోగ్యానికై వాకింగ్..

ఈరోజుల్లో గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం గతంలో కంటే చాలా ముఖ్యం. అందుకే ఆరోగ్యకరమైన హృదయం కావాలనుకుంటే నడక అత్యంత సులభమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గంగా పరిగణిస్తున్నారు. WHO ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 17.9 మిలియన్ల మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారు. ఈ ప్రమాదాలను తగ్గించడానికి నడక అత్యంత సులభమైన మార్గంగా గుర్తించారు. కానీ ప్రశ్న ఏమిటంటే.. ఎంత వేగంగా నడిస్తే ప్రయోజనం ఉంటుంది?

ఎంత వేగంగా నడవాలి?

2023లో జీరోసైన్స్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఓ వ్యక్తి గంటకు దాదాపు 3 నుంచి 4.5 మైళ్ల వేగంతో నడిచేవారికి గుండె జబ్బుల వల్ల మరణించే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వ్యక్తులకు నెమ్మదిగా నడిచే వారి కంటే స్ట్రోక్, చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది. ఈ వేగం 20 నుంచి 13 నిమిషాల్లో ఒక మైలును అధిగమించడానికి సమానం.

పరిశోధన కూడా కొద్దిసేపు వేగంగా నడవడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చూపిస్తుంది. నిజానికి దీనినే బ్రిస్క్ వాకింగ్ (Brisk Walking) అంటారు. దీనిలో భాగంగా తక్కువ సమయంలో ఎక్కువ వేగంగా నడవాల్సి ఉంటుంది. గుండె ఆరోగ్యం కోసం.. వారంలో రోజుకు 10 నిమిషాలు వేగంగా నడవడం వల్ల ఫిట్‌నెస్, మానసిక స్థితి మెరుగుపడుతుందని, అకాల మరణ ప్రమాదాన్ని దాదాపు 15 శాతం తగ్గిస్తుందని తేలింది. 30 నిమిషాల బ్రిస్క్ వాకింగ్ అనేది మితమైన-తీవ్రత కలిగిన వ్యాయామంగా పరిగణిస్తోంది అమెరికన్ హార్ట్ అసోసియేషన్.

ఎంతసేపు నడిస్తే మంచిదంటే..

ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం, స్పెయిన్‌లోని యూనివర్సిడాడ్ యూరోపియన్ నిపుణుల నేతృత్వంలో జరిగిన ఒక అంతర్జాతీయ అధ్యయనంలో రోజుకు కొన్ని నిమిషాలు మితంగా నడవడం కూడా గుండె ఆరోగ్యంలో గణనీయమైన మార్పును కలిగిస్తుందని తేలింది. ఈ ఫలితాలు అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురించారు.

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ఆగకుండా 10 నుంచి 15 నిమిషాలు నడిస్తే.. గుండెపై సానుకూల ప్రభావం ఉంటుందట. ఎక్కువ శారీరక శ్రమ చేయలేనివారు రోజులో కనీసం 10 నిమిషాలు కేటాయించి బ్రిస్క్ వాకింగ్ చేస్తే మంచి ఫలితాలు చూడవచ్చు. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Alopecia Areata : జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? కంట్రోల్ చేసేందుకు ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
జుట్టులో అక్కడక్కడా ప్యాచెస్‌లా ఊడిపోతుందా? ఈ జపాన్‌ హెయిర్‌కేర్ టిప్స్ ఫాలో అవ్వండి
Chewing Gum Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే
బీట్‌రూట్ జ్యూస్ తాగి చూయింగ్ గమ్ నమిలితే బీపీ తగ్గుతుందా? పరిశోధకులు ఏం చెప్పారంటే

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget