c-section: గర్భిణీలలో ఈ లక్షణాలు కనిపిస్తే సిజేరియన్ తప్పదా?
గర్భిణీలలో తమకు సహజప్రసవం అవుతుందా లేక సిజేరియన్ అవుతుందా అనే సందేహం నిత్యం మనసులో మెదులుతూనే ఉంటుంది.
గర్భిణిలు సంతోషంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, పోషకాహారాన్ని తినాలి, మనసులో బాధను ఉంచుకోకూడదు, ప్రతి విషయాన్ని భర్తతోనో, తల్లితోనో పంచుకుంటూ ఉండాలి... ఇలా వైద్యులు, ఇంట్లోని పెద్దవాళ్లు నిత్యం చెబుతూనే ఉంటారు. వారి మనసులో ఏ బాధ దాచుకోవడం మంచిది కాదు, మానసిక భారాన్ని మోయడం వారి గర్భంపై కూడా ప్రభావం చూపిస్తుంది. మానసిక ఆందోళనలు, రుగ్మతలకు గురైన గర్భిణిలలో సిజేరియన్ అయ్యే అవకాశం ఉందని ఓ అధ్యయనం తేల్చింది. ఎలాంటి మానసిక ఆందోళనకు గురికాని మహిళల్లో సహజప్రసవం అయ్యే ఛాన్సులు ఎక్కువట. ఆందోళన, డిప్రెషన్ వంటివి కేవలం ప్రసవం పైనే కాదు, పుట్టబోయే శిశువుపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని కొత్త అధ్యయనం తెలియజేస్తోంది.
మిచిగాన్ యూనివర్సిటీలోని పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఫలితాలను ‘జర్నల్ హెల్త్ ఎఫైర్స్’ మ్యాగజైన్ లో ప్రచురించారు. తల్లి ఇలా డిప్రెషన్, మానసిక ఆందోళనకు గురైతే బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, లేదా నెలలు నిండకుండానే ప్రసవించడం వంటివి జరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయనం కోసం
2008 -2017 మధ్య కాలంలో జరిగిన 3,60,225 ప్రసవాలను పరిశీలించారు. ఆ ప్రసవాలన్నీ 15 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు జరిగినవి. వీటిలో 24 శాతం తొలి ప్రసవాలు. కొంతమంది తల్లుల ఆరోగ్యచరిత్రలో వారు మానసిక ఆందోళన, డిప్రెషన్ బారిన పడినట్టు బయటపడింది. అలాంటి తల్లులందరికీ దాదాపు సహజప్రసవం కాలేదు, సిజేరియన్ చేసి బిడ్డను తీయాల్సి వచ్చింది. దీన్ని బట్టి తల్లి మానసిక ఆరోగ్యంపై ప్రసవం జరిగే తీరు ఆధారపడి ఉంటుందని అధ్యయనం తేల్చింది.
అయితే తల్లి మానసిక రుగ్మత, సిజేరియన్ ఆపరేషన్ కు మధ్య బంధాన్ని మరింత స్పష్టంగా తెలియజేయాలంటే ఇంకా చేయాల్సిన పరిశోధన చాలా ఉందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: డేటింగ్ యాప్ పై కోర్టుకెళ్లిన యువకుడు... కారణం తెలిస్తే నవ్వుకుంటారు
Also read: వంటనూనెల్లో ఏది మంచిది? ఏ నూనె ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?
Also read: ఆ సమస్యా ఉన్నా ఇలా చేస్తే పిల్లలు పుట్టే ఛాన్స్
Also read: డయాబెటిస్ రోగులు కూడా హ్యాపీగా తినొచ్చు... తింటే ఎన్ని లాభాలో
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి