అన్వేషించండి

పెయిన్ కిలర్స్ వాడితే మగతనం మటాష్? పిల్లలు పుట్టడమూ కష్టమేనా, తాజా అధ్యయనంలో ఏం తేలింది?

సర్జరీలు లేదా మరేదైనా ఇతర చికిత్సల కోసం పెయిన్ కిల్లర్లు తప్పనిసరిగా వాడాల్సిందే. కానీ అదే పనిగా వాడితే ఆరోగ్యం మీద చాలా ప్రభావం పడుతోందని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది నిపుణులు హెచ్చిరిస్తున్నారు.

మధ్య నొప్పి భరించే ఓపిక ఎవరికీ ఉండడం లేదు. చిన్న తలనొప్పికి కూడా పెయిన్ కిల్లర్లు వాడేస్తున్నారు. ఐబుప్రొఫెన్ ఎక్కువగా వాడుకలో ఉన్న పెయిన్ కిల్లర్. ప్రిష్క్రిప్షన్ అవసరం లేకుండానే ఇది దొరికేస్తోంది. ఇలాంటి పెయిన్ కిల్లర్లను తరచుగా వాడేవారిలో చాలా దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని, ఒక్కోసారి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి, పెయిన్ కిల్లర్స్ తీసుకొనేవారు.. తప్పకుండా దీనిపై అవగాహన కలిగి ఉండాలని చెబుతున్నారు.

ఆస్పిరిన్, నాప్రోక్సెన్, ఐబుప్రొఫెన్ వంటి నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు ఎక్కువగా వాడేవారిలో రకరకాల అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉందట. ఒకపూట నొప్పిని తప్పించుకునేందుకు పెయిన్ కిల్లర్ వాడడం ఫర్వాలేదు. కానీ వీటిని తరచుగా దీర్ఘకాలం పాటు వాడే వారిలో తీవ్రమైన సమస్యలు వస్తాయట.

కడుపులో అల్సర్లు

పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ లోపల అల్సర్లు ఏర్పడవచ్చు. గ్యాస్ట్రిక్ ఆసిడ్ నుంచి జీర్ణవ్యవస్థలోపలి పొరలను కాపాడేందుకు శరీరం శ్లేష్మ పొరను సహజంగా తయారు చేస్తుంది. ఈ సామర్థ్యం తగ్గిపోతుంది. అందువల్ల అజీర్తి, గుండెల్లో మంట, వికారంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆసిడ్ ప్రభావంతో కడుపులో అల్సర్లు ఏర్పడుతాయి.

సంతాన సాఫల్య సమస్యలు

ఆరువారాల వరకు పెయిన్ కిల్లర్లు వాడిన పురుషుల్లో సె* హార్మోన్ల ఉత్పత్తి తగ్గిందని ఒక అధ్యయనం చెబుతోంది. సాధారణంగా వృద్ధులు, పొగతాగే అలవాటున్నవారిలో ఈ పరిస్థితి కనిపిస్తుంది. దీనిని కాంపెన్సేటెడ్ హైపోగొనాడిజం అంటారు. ఈ సమస్యలో అంగస్తంభన సమస్యలు, మానసిక సమస్యలు, కండరాలు తగ్గిపోవడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే మందులు వాడడం ఆపిన కొద్ది రోజుల్లో తిరిగి కోలుకోవచ్చట.

వినికిడి సమస్యలు

అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీలో ప్రచురించిన హార్వర్డ్ అధ్యయనంలో ఐబుప్రోఫెన్ తో మహిళల్లో వినికిడి సమస్యలను గుర్తించారట. వారానికి కనీసం రెండు సార్లు పెయిన్ కిల్లర్లు తీసుకునే స్త్రీలలో లోపలి చెవిలోని కోక్లియార్ కు రక్తప్రసరణలో అంతరాయం ఏర్పడడం వల్ల వినికిడి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆస్పిరిన్ తో కూడా ఈ సమస్య రావచ్చట.

గుండె సమస్యలు

బ్రిటీష్ మెడికల్ జర్నల్ ప్రచురించిన అధ్యయన వివరాల్లో పెయిన్ కిల్లర్లను వాడే వారిలో అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ అయ్యే ప్రమాదం 31 శాతం పెరుగుతుందని చెబుతున్నారు అధ్యయనకారులు. కార్డియాక్ అరెస్ట్ గుండెపోటుకు చాలా భిన్నంగా ఉంటుంది. అకస్మాత్తుగా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. అత్యవసరస్థితికి చేరుకుంటారు. వెంటనే వైద్య సహాయం అందకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది.

రక్తం గడ్డకట్టడం

ఐబుప్రోఫెన్ ను గర్భనిరోధక మాత్రల వంటి హార్మోన్ టాబ్లెట్లతో కలిపి తీసుకునే స్త్రీలలో బ్లడ్ క్లాట్ బారిన పడొచ్చు. దీనిని త్రాంబోఎంబోలిజం అంటారు. ఈ సమస్య వచ్చే ప్రమాదం 5 రెట్లు పెరుగుతుందట. ఇలా రకరకాల తీవ్రమైన అనారోగ్యాలకు మితిమీరిన పెయిన్ కిల్లర్ల వాడకం కారణం అవుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. మందులు వేసుకునే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించడం అవసరం.  

Also Read : Eating tips: టీవీ చూస్తూ తినే అలవాటు ఉందా? ప్రమాదంలో పడినట్లే!

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget