అన్వేషించండి

Head Bath: రోజూ తల స్నానం చేస్తున్నారా? వారంలో ఎన్నిసార్లు హెడ్ బాత్ చేయాలి?

మీకు రోజూ తల స్నానం చేసే అలవాటు ఉందా? అయితే, ఈ విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి.

కార్తీక మాసంలో చాలామంది ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు. ఉదయాన్నే తల స్నానం చేసి ఇంటి ముందు దీపాన్ని వెలిగిస్తారు. ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. కొందరు ఉపవాసాలు కూడా ఉంటారు. దీంతో ఈ నెల మొత్తం తల మీద నుంచి స్నానాలు చేస్తూనే ఉంటారు. అయితే, ఇది ఒక నెల రోజులకు మాత్రమే పరిమితమైతే పర్వాలేదు. కొందరు ప్రతి రోజూ తల మీద నుంచి స్నానం చేస్తారు. వారంలో సుమారు మూడు నుంచి నాలుగు సార్లు తల స్నానం చేసేవారు కూడా ఉంటారు. మరి వారంలో ఎన్నిసార్లు తల స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ స్నానం చేయడం చాలా ముఖ్యం. అలాగే.. తలపై పేరుకుపోయే దుమ్ముదూళి, చెమట పోవాలంటే హెడ్ బాత్ చేయాలి. కాబట్టి రోజూ తల స్నానం చేస్తే మంచిదే. కానీ, మీ జుట్టు పరిస్థితిని బట్టి.. మీరు దీన్ని ఎంచుకోవాలి. ఒక వేళ మీ జుట్టు వీక్‌గా ఉండి.. ఎక్కువగా రాలిపోతున్నట్లేయి.. రోజు విడిచి రోజు లేదా వారంలో రెండు సార్లు తల స్నానం చేయడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో మీ జుట్టు స్వభావం ఎలాంటిదో తెలుసుకుని వారంలో ఎన్ని రోజులకు ఒకసారి తల స్నానం చేస్తే మంచిదో ఎంచుకోండి. మీరు నివసించే ప్రాంతం బట్టి కూడా మీ జుట్టు స్వాభావం, తల స్నానం ఎన్నిసార్లు చేయాలనేది ఆధారపడి ఉంటుంది. 

☀ ప్రస్తుతం వర్షాలు జోరుగా కురుస్తున్నాయి కాబట్టి.. జుట్టును కాపాడుకోవడం ఇంకా మంచిది. వర్షంలో తడిచిన వెంటనే టవల్‌తో తుడుచుకుని ఆరబెట్టుకోవాలి. వర్షంలో తల తడిస్తే.. తప్పకుండా షాంపు పెట్టుకుని స్నానం చేయండి. కండిషనర్ వాడండి.
☀ జుట్టును ఆరబెట్టుకొనేందుకు వీలైనంత వరకు హెయిర్ డ్రయ్యర్లకు దూరంగా ఉండండి. అత్యవసరమైతే మాత్రమే వాడండి. జుట్టును టవల్‌తో తుడుచుకుని గాలికి ఆరబెట్టడమే ఉత్తమమైన పద్ధతి. జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వెన వాడొద్దు.  
☀ మీరు అతి శీతల ప్రదేశంలో నివసిస్తున్నట్లయితే తల స్నానం చేయడం మంచిదే. తలకు టోపీలు పెట్టుకోవడం వల్ల పుర్రెపై చర్మంపై చెమట పట్టి చుండ్రు ఏర్పడుతుంది. తల దురద పెడుతుంది. దాని నుంచి ఉపశమనం కోసం తల స్నానం చేసి ఆయిల్ పెట్టుకోవడం మంచిది. 
☀ మీ జుట్టుగా పలుచుగా ఉన్నట్లయితే.. రోజూ తల స్నానం చేయకపోవడమే ఉత్తమం. నిపుణులను సంప్రదించి రోజు విడిచి రోజు మంచి షాంపుతో తలంటుకోండి. 
☀ మీకు డ్రై హెయిర్ (పొడి జట్టు) ఉన్నట్లయితే అతిగా తల స్నానం చేయకూడదు. వీరు షాంపుతోపాటు కండిషనర్ కూడా వాడాలి. క్రమం తప్పకుండా తలకు నూనె పెట్టాలి. 
☀ కొందరి జుట్టు ఆయిలీగా (జిడ్డుగా) ఉంటుంది. వీరి జుట్టు కుదుళ్ల నుంచి ఆయిల్స్ రిలీజ్ కావడం వల్లే ఈ సమస్య ఏర్పడుతుంది. ఇలాంటివారు రోజూ తల స్నానం చేయడం అంత మంచిది కాదు. వారంలో కనీసం 3 నుంచి 4 సార్లు మాత్రమే తల స్నానం చేయాలి. 
☀ మీకు ఒత్తైన జుట్టు ఉన్నట్లయితే.. రోజూ తల స్నానం చేయడం మంచిది. వీరి కుదుళ్లు బలంగా ఉంటాయి కాబట్టి.. పెద్ద సమస్య కాదు. క్రమం తప్పకుండా తలకు ఆయిల్ పెట్టాలి.
☀ మీ జుట్టు ఏ టైపో తెలియకపోతే.. రోజు విడిచి రోజు తల స్నానాన్నే ఎంచుకోండి. కండిషనర్ తప్పకుండా వాడండి. మీకు జుట్టు సమస్యలు ఉన్నట్లయితే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. వారు సూచించే షాంపూ, ఆయిల్స్ మాత్రమే ఉపయోగించాలి.
☀ మీకు రింగుల జుట్టు (ఉంగరాల జుట్టు) ఉన్నట్లయితే.. పెద్దగా తల స్నానం చేయాల్సిన అవసరం ఉండదు. రోజు విడిచి రోజు లేదా వారంలో మూడు సార్లు తల స్నానం చేయాలి. 
☀ బట్టతల ఉన్నవారు కూడా తప్పకుండా హెడ్ బాత్ చేయాలి. లేకపోతే దుమ్ముదూళి తలపై పేరుకుపోయి చుండ్రు ఏర్పడుతుంది. కనీసం రోజు విడిచి రోజు తల స్నానం చేయాలి. 

రోజూ షాంపూతో స్నానం చేయడం వల్ల తలపై ఉండే ఆరోగ్యకరమైన ఆయిల్స్ తొలగిపోతాయి. అయితే, తలలో జిడ్డు పెరిగితే.. చర్మంపై సెబోరియాకు కారణమయ్యే ఫంగస్‌ ఏర్పడుతుంది. దాని వల్ల దురద ఏర్పడుతుంది. పొలుసులుగా మారుతుంది. ఒక వేళ మీ జుట్టు ఎక్కువగా జిడ్డుగా ఉన్నా.. నిత్యం వ్యాయామం చేస్తున్నా.. రోజూ తల స్నానం చేయడం మంచిదనని నిపుణులు తెలుపుతున్నారు. అయితే, మీ జుట్టుకు ఎలాంటి షాంపూ మంచిదనేది వైద్య నిపుణులు మాత్రమే చెప్పగలరు.

Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్

Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!

Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

High alert at Uppal Stadium: కోల్‌కతా ఎఫెక్ట్.. ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Dhandoraa : 'దండోరా' టైటిల్ సాంగ్ - ఆలోచింపచేసేలా కాసర్ల శ్యామ్ లిరిక్స్
'దండోరా' టైటిల్ సాంగ్ - ఆలోచింపచేసేలా కాసర్ల శ్యామ్ లిరిక్స్

వీడియోలు

Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Team India worst performance | 200 టార్గెట్ అంటే హడలెత్తిపోతున్న టీమిండియా | ABP Desam
సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
High alert at Uppal Stadium: కోల్‌కతా ఎఫెక్ట్.. ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Dhandoraa : 'దండోరా' టైటిల్ సాంగ్ - ఆలోచింపచేసేలా కాసర్ల శ్యామ్ లిరిక్స్
'దండోరా' టైటిల్ సాంగ్ - ఆలోచింపచేసేలా కాసర్ల శ్యామ్ లిరిక్స్
Best in EV Scooters: ఈవీ స్కూటీల అమ్మకాల్లో దుమ్మురేపుతోన్న TVS.. ఓలా, బజాజ్ లను వెనక్కి నెట్టి నెంబర్ 1గా..
ఈవీ స్కూటీల అమ్మకాల్లో దుమ్మురేపుతోన్న TVS.. ఓలా, బజాజ్ లను వెనక్కి నెట్టి నెంబర్ 1గా..
Mamata Banerjee Apologised : మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
Dhurandhar Collection : 'పుష్ప 2' రికార్డు బ్రేక్ చేసిన రణవీర్ 'ధురంధర్' - వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?
'పుష్ప 2' రికార్డు బ్రేక్ చేసిన రణవీర్ 'ధురంధర్' - వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?
Lionel Messi In Kolkata: కేవలం 22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!
22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!
Embed widget