అన్వేషించండి

First night Vlog: శోభనం రాత్రి వీడియోను పోస్ట్ చేసిన కొత్త జంట - తల బాదుకుంటున్న నెటిజన్స్, ఇంతకీ ఆ వీడియోలో ఏముంది?

హోం టూర్, బాత్రూమ్ టూర్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు కొత్తగా ఫస్ట్ నైట్ రూమ్ టూర్ మొదలైంది. ఈ వీడియో చూస్తే మీరు తప్పకుండా షాకవుతారు.

రీల్స్, షార్ట్స్, వ్లాగ్.. పేర్లు ఏవైనా, కాన్సెప్ట్ మాత్రం ఒక్కటే. టాలెంట్ చూపిద్దాం.. ఫేమస్ అయిపోదాం. కానీ, ఇక్కడే ఒక చిక్కు వచ్చిపడింది. కొందరు టాలెంట్‌కు బదులు.. ఏవేవో చూపించి వైరల్ అయిపోతున్నారు. ముఖ్యంగా మంచి కంటే.. చెడుతోనే ఎక్కువ సంపాదిస్తున్నారు. అందుకే, ఇటీవల సోషల్ మీడియాలో పనికొచ్చే వీడియోలే కనిపించడం లేదు. ఎక్కడ చూసినా చెత్తే. అయితే ట్రోల్స్ లేదా అశ్లీల వీడియోలు.. ఇవే నిండిపోతున్నాయి. 

ఇక Vlog పేరుతో చాలామంది తమ సంసారాన్ని అంగట్లో పెడుతున్నారు. హోమ్ టూర్ మొదలుకుని కిచెన్ టూర్, బాత్రూమ్ టూరు ఇలా వారికి నచ్చింది చేసి జనాల్లోకి వదులుతున్నారు. తాజాగా ఓ జంట కూడా ఇదే చేసింది. నాలుగు గదుల్లో జరగాల్సిన ఫస్ట్ నైట్‌ను ఆన్‌లైన్‌లో పెట్టారు. ఏ సాంప్రదాయంలోనైనా శోభనం అనేది ఒక రహస్య కార్యం. దాన్ని నలుగురికి చూపించుకొనేది కాదు. కానీ, ఈ జంట మాత్రం.. ఈ రోజు మాకు శోభనం జరగబోతోంది. ఇదిగో వీడియో అంటూ.. వాళ్ల పూలతో అలంకరించిన మంచాన్ని గదిని వీడియోలో చూపించారు. 

వరుడు ఈ వీడియోలో వధువుకు ముద్దు కూడా పెట్టాడు. ఆ తర్వాత.. ‘‘ఎలా ఉంది మన ఫస్ట్ నైట్’’ అని అన్నాడు. ‘‘ఇంకా మొదలు పెట్టలేదు కదా’’ అని వధువు సమాధానం ఇచ్చింది. ‘‘అవును, మా ఫస్ట్‌ నైట్ ఇంకా కాలేదు. మొదలుపెట్టాలి’’ అని పేర్కొన్నాడు. ఆ తర్వాత ‘‘నువ్వు వెళ్లి మంచం మీద కూర్చో’’ అన్నాడు. వధువు స్పందిస్తూ.. ‘‘నేను కాదు.. నువ్వు వెళ్లి కొంగు కప్పుకుని కూర్చో’’ అని చెప్పడంతో వీడియో పూర్తయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం ట్విట్టర్‌లో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ వీడియోను 5 లక్షల మందికి పైగా వీక్షించారు.

ఈ వీడియో చూసిన నెటిజన్స్ ముక్కున వేలు వేసుకున్నారు. ‘‘ఇంకేం చూడాల్సి వస్తుందో’’ అంటూ కామెంట్లు పెట్టారు. ‘‘జీవితంలో ఇదొక్కటే మిగిలిపోయింది.. ఇది కూడా చూసేశా.. ఇక చచ్చిపోతా’’ అని మరికొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే.. ‘‘అసలు మీకు సిగ్గు ఉందా? ఫస్ట్ నైట్ వీడియోను ఆన్‌లైన్‌లో పెడతారా? మీ పెద్దలు మీకు సంస్కారాన్ని నేర్పించారా?’’ అని క్లాస్ పీకుతున్నారు. కొందరైతే ఆ జంటపై జోకులు పేల్చుతున్నారు. మొత్తం ఫస్ట్ నైట్‌ను లైవ్ (ప్రత్యక్ష ప్రసారం) పెట్టాల్సిందని మరికొందరు పేర్కొన్నారు. ‘‘వీళ్లకు ఇది మొదటి శోభనం కాదు. ఇప్పటికే 1000కి పైగా చేసుకుని ఉంటారు. వ్యూస్ కోసం ఇలా చేసి ఉంటారు’’ అని మరొకరు కామెంట్ చేశారు. 

ఈ వీడియోలో ఉన్న జంట ఏ ప్రాంతానికి చెందినవారనేది ఇంకా తెలియరాలేదు. వారు పశ్చిమ బెంగాల్‌కు చెందిన జంట కావచ్చని కొందరు అంటున్నారు. అయితే, వారు హిందీలో మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లేదా బీహార్‌కు చెందినవారు కావచ్చని మరికొందరు అంటున్నారు. వారు ఏ ప్రాంతానికి చెందినవారైనా.. వీడియో మాత్రం బాగా వైరల్ అయ్యింది. ఆ జంటకు ఎక్కడాలేని క్రేజ్ తెచ్చింది. మరి, ఈ వీడియోపై మీరు ఏమంటారు? 

Also Read: కాఫీ తాగడానికి బెస్ట్ టైమ్స్ ఇవే - మీరూ తప్పకుండా ట్రై చెయ్యండి, మంచి ఫలితాలుంటాయి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Minsiter Gottipati Ravikumar: 'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
Special Trains: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
Embed widget