By: ABP Desam | Updated at : 25 Mar 2022 08:21 AM (IST)
Edited By: harithac
(Image credit: Instagram)
తల్లిపాలతో నగలా? అదెలా సాధ్యం? అయిన అదేమి ఆలోచనా? ఇవే కదా మీ మదిలో మెదులుతున్న ప్రశ్నలు. ప్రయత్నించి చూస్తే ఏదైనా సాధ్యమే అని నిరూపించింది ఓ జంట. తల్లిపాలను వేస్టు చేయడం ఎందుకు వాటితోనే వ్యాపారం చేస్తే అన్న ఆలోచన నుంచి వచ్చిందే ‘తల్లిపాల జ్యూయలరీ’కి నాంది పలికింది. ఇప్పుడు జ్యూయలరీ విపరీతంగా ఆన్లైన్లో అమ్ముడవుతోంది. వచ్చే ఏడాది రూ.15 కోట్ల టర్నోవర్ దిశగా దూసుకెళ్తోంది ఈ వ్యాపారం.
ఎవరు? ఎక్కడా?
లండన్ చెందిన జంట సఫియా రియాద్, ఆడమ్ రియాద్. వీరికి మెజెంటా ఫ్లవర్స్ అనే సంస్థ ఉంది. ఈ సంస్థ పువ్వులను విలువైన జ్ఞాపకాలుగా మార్చి భద్రపరిచేలా చేసి ఇస్తుంది. అంటే ఉదాహరణకు పెళ్లి రోజు మీరు మెడలో వేసుకున్న పూల దండను ఇస్తే... దాన్ని ఏళ్ల తరబడి చెక్కుచెదరని కళాఖండంగా మార్చి మీకు తిరిగి ఇస్తుంది ఈ సంస్థ. మూడేళ్లలో దాదాపు 4000 ఆర్డర్లను డెలివరీ చేసింది ఈ సంస్థ. ఇప్పుడు కొత్తగా తల్లిపాలతో జ్యూయలరీ తయారుచేసి అమ్మడం మొదలుపెట్టింది.
కోవిడ్ 19 లాక్ డౌన్ సమయంలో వారు తల్లిపాలతో నగలు తయారుచేయచ్చనే విషయాన్ని తెలుసుకున్నారు. తయారీని నేర్చుకున్నారు. తల్లిపాల కోసం కొంతమంది చిన్నపిల్లలున్న తల్లులతో ఒప్పందం కుదర్చుకున్నారు. వారి దగ్గర నుంచి రోజూ పాలను కొనుక్కోవడం మొదలుపెట్టారు. ఆ పాలను విలువైన రాళ్లుగా మార్చారు. వాటిని అమ్మితే మంచి ధరకే కొనడం మొదలుపెట్టారు వినియోగదారులు. తల్లిబిడ్డల అనుబంధానికి తల్లిపాలు ఒక నిదర్శనం. కొంతమంది తల్లులు తమ పాలను జ్యూయలరీగా తయారుచేయించి జ్ఞాపకంగా మార్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఒక విలువైన చిన్న రాయిగా మార్చడం కోసం 30ఎమ్ఎల్ పాలు అవసరం అవుతాయి.
పాలు రంగు కోల్పోకుండా రాయిగా మార్చే ప్రక్రియ తెలుసుకోవడానికి భార్యభర్తలిద్దరూ చాలా పరిశోధన చేశారు. రంగులు కోల్పోకుండా పాల రంగులోనే రాయి తయారవుతుంది. సఫియా పాలను డీహైడ్రేట్ చేసే సాంకేత్రిక ప్రక్రియను కనుగొన్నారు. దాన్ని సాధారణ నాణ్యత కలిగిన రెసిన్ తో కలిపి ఆభరణాలుగా మారుస్తున్నారు. తల్లిపాలతో చేసిన నెక్లెస్‌లు, చెవి దిద్దులు, ఉంగరాలు, పెండెంట్లను అందుబాటులో ఉంచింది ఈ సంస్థ.
Also read: షాకింగ్, రక్తంలోనూ చేరిపోయిన ప్లాస్టిక్ , నిరూపించిన కొత్త పరిశోధన
Also read: త్వరలో మగవారికీ గర్భనిరోధక మాత్రలు, అవి వస్తే ఆడవారి కష్టాలు తీరినట్టే
Parenting: ఎంత కోపం వచ్చినా మీ పిల్లలతో ఈ మాటలు అనవద్దు, వారి మనసులో ఉండిపోతాయి
High Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? ఈ ఒక్క కూరగాయ తింటే చాలు, అంతా కరిగిపోతుంది
Chicken Pakodi: చికెన్ పకోడి చిటికెలో చేసేయండిలా
Google: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే
Dengue Diet: డెంగ్యూ జ్వరం వస్తే తినాల్సినవి ఇవే, వీటితో సమర్థంగా ఎదుర్కోవచ్చు
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు
Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!
Yasin Malik Convicted: వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌ను ఆ కేసులో దోషిగా తేల్చిన కోర్టు