Skin Cancer: చర్మక్యాన్సర్ వచ్చిన విషయాన్ని కళ్లు చెబుతాయా? లక్షణాలెలా ఉంటాయి?
చర్మ క్యాన్సర్ వస్తే ఆ విషయం మనకెలా తెలుస్తుంది? ఏ లక్షణాల ద్వారా ఆ క్యాన్సర్‌ను గుర్తించవచ్చు?
![Skin Cancer: చర్మక్యాన్సర్ వచ్చిన విషయాన్ని కళ్లు చెబుతాయా? లక్షణాలెలా ఉంటాయి? Do eyes tell when skin cancer has come? What are the symptoms? Skin Cancer: చర్మక్యాన్సర్ వచ్చిన విషయాన్ని కళ్లు చెబుతాయా? లక్షణాలెలా ఉంటాయి?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/24/ca0c04850761733f8083c9fe87c1c500_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ప్రపంచంలో అతి భయంకరమైన రోగాలలో క్యాన్సర్ ఒకటి. అనేక రకాల క్యాన్సర్లు ఉన్నాయి. అది వచ్చే భాగాన్ని దాని పేరు మారిపోతుంది. కాకపోతే అన్ని క్యాన్సర్లో చర్మానికి వచ్చే క్యాన్సర్ ను మాత్రమే కచ్చితంగా నయం చేయగలమని చెప్పగలం. మిగతావి మాత్రం వాటి దశలు, చికిత్సపై ఆధారపడి ఉంటుంది. కానీ చర్మ క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన చాలా తక్కువ ఉంది. ఎలాంటి లక్షణాల ద్వారా దాన్ని గుర్తించవచ్చో అధికశాతం మందికి తెలియదు.
స్కిన్ క్యాన్సర్ అంటే..
చర్మ క్యాన్సర్ అనేది చర్మంలోని కణాల అసాధారణ పెరుగుదలను సూచిస్తుంది. సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలకు అధిక కాలం తరచూ గురవుతూ ఉంటే ఆ భాగంలో చర్మక్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. పుట్టుమచ్చల్లాగే కనిపిస్తుంది చర్మక్యాన్సర్. అందుకే దాన్ని కనిపెట్టడం కాస్త కష్టమే. ఇప్పుడు తాజాగా కళ్లకు, చర్మక్యాన్సర్ మధ్య ఉన్న అనుబంధం బయటపడింది. కళ్ల కలక, కళ్లు దురద పెట్టడం వంటివి నిత్యం అందిరకీ ఎదురయ్యే సమస్యలే. అయితే అవి ఒక్కోసారి చర్మక్యాన్సర్ ను కూడా సూచిస్తున్నాయి కొత్త పరిశోధనా ఫలితం చెబుతోంది.
ఎలా తెలిసింది?
ఒక మహిళా రోగి రెండు వారాలుగా కళ్ల దురదతో బాధపడుతోంది. ఆమె వైద్యులను సంప్రదించింది. ఆమె కనురెప్ప పొడుచుకు వచ్చినట్టు అయ్యింది, పిగ్మెంటెడ్ లెసియన్స్ అని పిలిచే గోధుమరంగు పాచెస్‌తో కనురెప్పపై వచ్చాయి. అంతేకాదు కనురెప్ప లోపలి వైపుకు తిరిగినట్టు అయ్యింది. దీన్ని ‘ఐలిడ్ ఎవర్షన్’ అంటారు. ఆమె టెస్టులు చేస్తే ప్రాణాంతక మెలనోమా అనే చర్మ క్యాన్సర్ కంట్లో వచ్చినట్టు తెలిసింది. ఆమెకు వెంటనే చికిత్స ప్రారంభించారు. వారం రోజుల్లోనే ఆమె క్యాన్సర్ విస్తరించకుండా ఆగినట్టు గుర్తించారు.
మెలనోమా లక్షణాలు
కంటి దురద మెలనోమాకు చెందిన ప్రధాన సంకేతం. మెలనోమా చాలా ప్రమాదకర చర్మక్యాన్సర్. సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే నయమవుతుంది. లేకుంటే ప్రాణం తీస్తుంది. కంటి మెలనోమా లక్షణాలు కొన్ని ప్రధానంగా ఉన్నాయి.
1. కళ్ల వెంట చిన్నగా రక్తం కారడం
2. కంటిపై గరుకుగా, పొలుసుల్లా గోధుమరంగు, ఎరుపురంగుల్లో పాచెస్ ఏర్పడడం
3. ఎరుపు రంగుల్లో ఏర్పడిన పుండు
4. కనురెప్పలు ఊడిపోవడం
ఇవన్నీ కంటి మెలనోమా లక్షణాలే. మీకు ఏమాత్రం కళ్లు తేడాగా అనిపించినా, పుండ్లు లాంటివి వచ్చినా, పాచెస్ ఏర్పడినా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
Also read: ఈ అయిదు వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయా? అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్టే
Also read: రాత్రిపూట బిర్యానీలు లాగిస్తున్నారా? ఆరోగ్యానికి చేటు తప్పదు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)