By: ABP Desam | Updated at : 23 Mar 2022 07:54 PM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
తెలుగు రాష్ట్రాల్లో బిర్యానీ అభిమానులు ఎక్కువ. హైదరాబాద్‌లో అయితే మరి చెప్పక్కర్లేదు, రోజూ బిర్యానీలు తినేవారున్నారు. ప్రపంచవ్యాప్తంగా బిర్యానీకి లవర్స్ ఎక్కువ. బిర్యానీ వాసనకే నోరూరిపోతుంది చాలా మందికి. కంటికి ఇంపుగా కనిపించే బిర్యానీలు మనసును లాగేస్తాయి. అయితే కొంతమంది రాత్రిపూట పొట్టనిండా బిర్యానీలు తింటారు. బిర్యానీలు తరచూ తినడమే అనారోగ్యకరం. అలాంటిది రాత్రిపూట తింటే మరీ అనర్థం. నిద్ర కూడా సరిగా పట్టదు. పొట్ట పెరిగిపోతుంది. ఎసిడిటీ పెరిగిపోతుంది. ఇంకా ఎన్నో ప్రమాదకర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
తరచూ బిర్యానీని తినడం వల్ల వెంటనే ప్రభావం కనిపించకపోవచ్చు. కానీ దీర్ఘకాలంలో మాత్రం కచ్చితంగా ప్రభావం కనిపిస్తుందని చెబుతున్నారు వైద్యులు. బిర్యానీలో నూనెను ఎక్కువ శాతం వాడతారు. అలాగే రకరకాల మసాలాలు అధికంగా దట్టిస్తారు. కాబట్టి బిర్యానీని అధికంగా తింటే ప్రేగులకు, అలాగే మొత్తం జీర్ణవ్యవస్థకు హాని కలగడం ఖాయం. ప్రతికూల ప్రభావాలు ఒక్కోసారి నాలుగైదు రోజులకే అజీర్తి రూపంలో బయటపడతాయి. కొందరిలో మాత్రం ఏళ్ల తరువాత పెద్ద అనారోగ్య సమస్యగా బహిర్గతమవుతాయి. కాబట్టి బిర్యానీని వారానికోసారి మాత్రమే తింటే మంచిది.
నిషేధిత రంగులు
కొందరు బిర్యానీకి మంచి రంగు రావడం కోసం ఆర్టిఫిషియల్ రంగును వాడతారు. ఆహార సంస్థలు నిషేధించిన రంగులను కూడా రెస్టారెంట్ల వారు వాడుతున్నారు. అందులో ఒకటి టర్ ట్రాజెన్ కూడా ఒకటి. ఇది సింథటిక్ తో తయారయ్యే ఓ రసాయనం. నీటిలో ఇట్టే కరిగిపోతుంది. బిర్యానీ వండాక చివర్లో రంగు కోసం చల్లుతారు. చికెన్ తందూరీలో కూడా దీన్ని అధికంగా వాడుతారు. టర్ ట్రాజెన్ తినడం వల్ల చాలా ప్రమాదకరమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఆస్తమా, దద్దుర్లు, క్యాన్సర్ వంటివి రావచ్చని చెబుతున్నారు నిపుణులు. అందుకే బిర్యానీని తినడం తగ్గించాలి.
Also read: ఈ అయిదు వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయా? అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్టే
Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!
Dhaniya Powder: ఈ ధనియాల పొడిని అన్నంతో, ఇడ్లీతో తినొచ్చు, ఎలా చేయాలో తెలుసా?
Brain Foods: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే బ్రెయిన్ ఫుడ్స్ ఇవన్నీ, రోజుకొకటైనా తప్పకుండా తినిపించాల్సిందే
Sleeping Pills: స్లీపింగ్ పిల్స్ అధికంగా వాడుతున్నారా? వాటి వల్ల కలిగే నష్టాలు ఇవే
Amazon: ఒక ప్లాస్టిక్ బకెట్ ఇరవై ఆరువేల రూపాయలా? అది కూడా ‘సోల్డ్ అవుట్’
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల