అన్వేషించండి

Dextromethorphan Hydrobromide Cough Syrup: ఈ దగ్గు సిరప్ ప్రాణాంతకమా? డెక్స్ట్రోమెథోర్ఫాన్ సిరప్ ఎవరు వాడాలి.. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

Dextromethorphan cough syrup | దగ్గు సిరప్ కారణంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రాణాలు పోతున్నాయి. కానీ డాక్టర్ల సలహాతో మెడిసిన్ తీసుకోవాలి. డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇలా ఉన్నాయి.

Dextromethorphan hydrobromide cough syrup: రాజస్థాన్‌లో దగ్గు సిరప్ కారణంగా ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోనూ కొందరు చిన్నారులు దగ్గు సిరస్ వాడిన తరువాత అనారోగ్య సమస్యల బారిన పడ్డారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో సెప్టెంబర్ నెలలో ఆరుగురు చిన్నారులు మూత్రపిండాల ఇన్ఫెక్షన్ల కారణంగా చనిపోయారు. ఇలాంటి దగ్గు సిరస్ లను తీసుకున్న తర్వాత చిన్నారులు మరణించారని కూడా నివేదికలో తేలింది. దాంతో రాజస్థాన్‌లోని డ్రగ్ కంట్రోలర్ వెంటనే దగ్గు సిరప్ వాడకాన్ని నిషేధించి, పరీక్షల కోసం ప్రయోగశాలకు నమూనాలను పంపింది. సిరప్‌లో డయెథిలీన్ గ్లైకాల్ (DEG) వంటి విషపదార్థాల కారణంగా ఈ మరణాలు జరిగాయని అధికారులు భావిస్తున్నారు. కేంద్ర డ్రగ్ కంట్రోలర్ జనరల్ (CDSCO) నేతృత్వంలో దీనిపై దర్యాప్తు జరుగుతోంది.          

ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు అందించే దగ్గు సిరప్‌లు పిల్లల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి.  సికార్‌లో 5 ఏళ్ల బాలుడు, భరత్‌పూర్‌లో 4 ఏళ్ల బాలిక, జైపూర్‌లో 2 ఏళ్ల చిన్నారి, దగ్గు సిరప్‌లతో అనారోగ్యానికి గురయ్యారు. అయితే రాజస్థాన్‌లో పిల్లల అనారోగ్యాలకు కారణమైన దగ్గు సిరప్‌ డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ (Dextromethorphan hydrobromide) దగ్గు సిరప్. దాంతో దాని ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ గురించి చర్చ జరుగుతోంది.

డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ సిరప్..
దగ్గు నివారణకు ఉపయోగించే ఓ సిరప్ పేరు డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ సిరప్. దీన్ని 1950లలో రూపొందించారు. భారత్ సహా పలు దేశాల్లో చిన్నారుల దగ్గు సమస్యలకు ఈ సిరస్ వాడుతున్నారు. 

డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ అనేది ప్రధానంగా పొడి దగ్గు నివారణకు ఉపయోగిస్తారు. ఇది మెదడులో దగ్గును ప్రేరేపించే సంకేతాలను నిరోధించడం ద్వారా చిన్నారుల అనారోగ్య సమస్యపై పనిచేస్తుంది. దాంతో దగ్గు తగ్గి పేషెంట్లకు ఉపశమనం కలుగుతుంది. ఈ కాఫ్ సిరప్‌ను కెమికల్ ప్రాసెసింగ్ ద్వారా తయారు చేస్తారు. ఇందులో క్రియాశీల సమ్మేళనంగా డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ (Dextromethorphan HBr) ఉంటుంది. దీన్ని సిరప్ రూపంలో వినియోగించాలి. ఈ సిరప్ తీసుకుంటే పెద్దలతో పాటు చిన్నారులకు దగ్గు, పొడి దగ్గు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఈ దగ్గు సిరప్‌ ఎవరు వాడాలి
డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ (Dextromethorphan hydrobromide) కఫ్ సిరస్‌ను దగ్గును తగ్గించే మెడిసిన్‌గా డాక్టర్లు సూచిస్తారు. పెద్దలు, చిన్నారులు వైద్యుల చూచనతో ఇది వాడాలి. చిన్న పిల్లలు ఇది వాడటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు పిల్లలకు ఈ సిరప్ ఇవ్వకూడదు. అదే 2 సంవత్సరాల నుంచి 6 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు డాక్టర్లు సూచించిన మోతాదులో సిరప్ ఇవ్వాలి. 6 ఏళ్ల కంటే ఎక్కువ వయసు పిల్లలు, పెద్దలు ఈ సిరస్ వాడవచ్చు. కానీ డాక్టర్లు చెప్పిన మోతాదులో తీసుకోవాలి. ఢిల్లీకి చెందిన ఇంటర్నల్ మెడిసిన్, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ మాట్లాడుతూ.. తగిన మోతాదులో, డాక్టర్ ప్రిస్క్రిప్షనలతో వయోజనులు ఇది ఉపయోగంచాలన్నారు. మహిళలు సైతం సిరప్ తీసుకోవాలని సూచించారు. ఈ సిరస్ దగ్గు నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది. 

డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ సిరప్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి..
ఈ సిరప్ వాడకం ద్వారా కొంతమందిలో నిద్రలేమి, తలతిరగటం సమస్య వస్తుంది. కొందరికి స్వల్ప కడుపు నొప్పి, వికారం అనిపిస్తుంది. కొన్ని అరుదైన సందర్భాల్లో ఇది అలెర్జీకి దారితీస్తుంది. కొందరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను కూడా కలిగిస్తుందని కొందరు డాక్టర్లు చెబుతున్నారు. కాలేయం, మూత్రపిండాల సమస్య, ఇతర పెద్ద అనారోగ్య సమస్యలు ఉంటే ముందుగా డాక్టర్‌ను సంప్రదించి.. వారి సలహాతోనే ఇది వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

 

జైపూర్: భరత్‌పూర్, సికార్ జిల్లాల్లో ఇద్దరు పిల్లల మరణాలకు రాష్ట్ర ఉచిత వైద్య పథకం కింద పంపిణీ చేసిన దగ్గు సిరప్ కారణం కాదని రాజస్థాన్ ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆరోగ్య డైరెక్టర్ రవి ప్రకాష్ శర్మ మాట్లాడుతూ.. విచారణ నివేదికల ప్రకారం, రెండు కేసుల్లోనూ పిల్లలకు వైద్యుల సలహా లేకుండా ఇంట్లో సిరప్ ఇచ్చారని నిర్ధారించారు. డెక్స్ట్రోమెథోర్ఫాన్ (DXM) ఔషధాన్ని పిల్లలకు ఇవ్వకూడదు. కేవలం వైద్యుల సలహాతోనే వాడాలని శర్మ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆ రెండు ఘటనల్లోనూ డాక్టర్లు ఈ దగ్గు సిరప్‌ను సూచించలేదని తెలిపారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు
Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌
Rohit Sharma T20 World Cup | హిట్మ్యాన్ లేకుండా తొలి వరల్డ్ కప్
Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్‌ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
Balakrishna : యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
6 అడుగుల ఆజానుబాహులకు బెస్ట్‌ ఆప్షన్లు - కంఫర్ట్‌తో పాటు రైడింగ్‌ ఫన్‌ ఇచ్చే మోటార్‌సైకిళ్లు!
6 అడుగులకు పైగా ఎత్తున్న 30+ ఏజ్‌ వాళ్లకు బెస్ట్‌ బైక్‌లు - సిటీ రోడ్లకు చక్కగా సరిపోతాయి!
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
Embed widget