Copper Peptide: కాపర్ పెప్టైడ్‌లతో అందం మీ సొంతం, రాగిలో ఎన్ని సుగుణాలో చూడండి
చర్మం కాంతివంతంగా ఉండాలంటే కాపర్ పెప్టైడ్‌లు వినియోగిస్తున్నారా? వాటి వల్ల ప్రయోజనాలే కాదు అనార్థాలు కూడా ఉన్నాయి.
రాగి.. పూర్వం రాగి పాత్రల్లోని వంట చేసుకునే వాళ్ళు. ఇప్పుడు స్టీలు, అల్యూమినియం, నాన్ స్టిక్ పాన్ అని రకరకాలు వస్తున్నాయి కానీ రాగి పాత్రల్లో వండుకున్నా వాటిలో తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. ఇప్పటికీ రాగి పాత్రల్లో వండుకునే వాళ్ళు ఎక్కడో కొంతమంది ఉంటున్నారు. ఎంతో కీలకమైన లోహం ఇది. నాణేలు దగ్గర నుంచి బంగారు వస్తువుల తయారీ వరకు అన్నింటిలోనూ రాగి తప్పకుండా ఉపయోగిస్తారు. పనిముట్లు, యంత్రాల్లో కూడా రాగిని విస్తృతంగా వినియోగించడం చేశారు. రాగి గ్లాసుల్లో నీటిని తాగితే చాలా మంచిదని అంటారు. అలా చేయడం వల్ల నీళ్లలోని బ్యాక్టిరియా నశిస్తుందని ఒక నమ్మకం. అది నిజమేనని అధ్యయనాలు కూడా నిరూపించాయి. ఇన్ని మంచి గుణాలు కలిగిన రాగి శరీరానికి కూడా చాలా అవసరం.
వృద్ధాప్య సంకేతాలు దూరం
ఆహార పదార్థాల ద్వారా దాన్ని పొందటం జరుగుతుంది. ఆహార పదార్థాల వల్ల తక్కువ స్థాయిలో రాగి తీసుకోవడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ నివారించే అవకాశం ఉంది. ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకి ఇప్పుడు రాగి అవసరం. కాపర్ పెప్టైడ్‌లు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇవి చర్మాన్ని డ్యామేజ్ కాకుండా రక్షిస్తుంది. ఈ పెప్టైడ్‌లు కొల్లాజెన్, ఎలాస్టిన్‌లను ఉత్పత్తి చేయడాన్ని ప్రోత్సహిస్తాయి. అంతే కాదు చర్మాన్ని దృఢంగా, మృదువుగా చేసి ముడతలు రాకుండా ఉంచడంలో సహాయపడుతుంది. వృద్ధాప్య సంకేతాలను ఇది దూరం చేస్తుంది. ముడతలు తగ్గించి మీరు మరింత యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఇది రాసుకోవడం వల్ల చర్మం పొడి బారకుండా తేమగా ఉండేలా చూస్తుంది.
వైద్య గుణాలు
చర్మాన్ని రిపేర్ చేసే గుణాలు ఈ పెప్టైడ్‌లో ఉన్నాయి. మీ స్కిన్ చూసేందుకు బాగుండెలా చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం కాపర్ పెప్టైడ్‌లు చర్మం నుంచి చెడు ఫైబర్స్ తొలగించి కొత్తవి వచ్చేలా చేస్తుంది. ఇప్పుడిప్పుడే ఈ కాపర్ పెప్టైడ్‌లను వినియోగించేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు.
క్లినికల్ ట్రయల్స్ తక్కువ
కాపర్ పెప్టైడ్ ప్రభావాన్ని నిర్ధారించడానికి మరికొన్ని క్లినికల్ ట్రయల్స్ అవసరం ఉందని చర్మ సంరక్షణ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది కొంతమంది స్కిన్ కి సెట్ అవ్వకపోతే దద్దుర్లు, అలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంది. చర్మ సంరక్షణ సమయంలో వేరే పదార్థాలతో కొన్ని సార్లు ఈ కాపర్ పెప్టైడ్‌లను వినియోగించాల్సి వస్తుంది. అటువంటి సమయంలో చర్మానికి హనీ కలిగించే విధంగా అలర్జీలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సున్నితమైన చర్మం ఉన్నవాళ్ళు కూడా దీన్ని వినియోగించవచ్చట. ఇది కనుక మీ చర్మానికి సెట్ అయితే మీరు మరింత అందంగా కనిపిస్తారని అనడంలో ఎటువంటి సందేహం లేదు. చర్మంపై ఇది సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఆరోగ్యకరమైన చర్మాన్ని ఇస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: ఈ చిత్రంలో అయిదు పక్షులు దాక్కున్నాయి, ఎక్కడున్నాయో వెతికి పట్టుకుంటే మీ చూపు భేష్
Also read: అయిదు రోజులు ట్రిప్‌కెళ్లాడు, వచ్చాక చూస్తే ఒకేసారి మంకీపాక్స్, కోవిడ్, హెచ్ఐవీ పాజిటివ్