Condom Mistakes: శృంగార చిట్కాలు.. ఒకేసారి రెండు కండోమ్‌లు వాడొచ్చా? ఈ మిస్టేక్స్ చేయొద్దు!
శృంగారం సమయంలో చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ ఇవి. అలాగే కండోమ్ తరచుగా వాడేవారు కూడా ఈ ముఖ్యమైన విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి.
శృంగారం లేనిదే ఈ సృష్టి లేదు. ఆలుమగల కలయిక అనేది కేవలం సుఖానికి మాత్రమే కాదు.. సంసారానికి కూడా ఎంతో ముఖ్యం. శృంగారం తప్పు అనే భావన మనసులో పెట్టుకోకుండా.. చిన్న సమస్య ఉన్న బయటకు చెప్పుకుని పరిష్కారం పొందడం ఉత్తమ మార్గం. కానీ, ఇప్పటికీ ఈ సమస్యలపై చాలామంది పెదవి విప్పలేరు. అలాంటి వారి కోసమే ఈ చిట్కాలు. వీటిలో కొన్ని రెగ్యూలర్‌గా చేసే తప్పిదాలు. భవిష్యత్తులో వాటి వల్ల సమస్యలు రాకూడదంటే.. ఈ విషయాలు తెలుసుకోండి.
❤ పర్స్ లేదా వాలెట్‌లో కంటోమ్‌లు తీసుకెళ్లవద్దు: మీకు వాలెట్‌లో కండోమ్‌లు పెట్టుకొనే అలవాటు ఉందా? అయితే, వెంటనే మానేయండి. ఎందుకంటే.. అలా చేయడం వల్ల కండోమ్ ముడతలు పడొచ్చు లేదా చిట్లిపోవచ్చు. రేపర్ చెక్కు చెదరకపోయినా.. లోపల ఉండే కండోమ్‌కు మాత్రం నష్టం తప్పదు. అలాంటివి వాడితే మీకు తెలియకుండానే పొరపాటు జరిగిపోవచ్చు.
❤ లూబ్రికెంట్లతో జాగ్రత్త: శృంగారం సాఫీగా సాగేందుకు చాలామంది లూబ్రికెంట్లు (కందెనలు) ఉపయోగిస్తారు. అయితే, కండోమ్ వాడేప్పుడు లూబ్రికెంట్లు వాడటం అంత మంచిది కాదు. లూబ్రికెంట్లు కండోమ్ మెటీరియల్‌ను దెబ్బతీస్తుంది. కండోమ్ వాడేప్పుడు ప్రత్యేకంగా లూబ్స్ అవసరం లేదు. తప్పదనిపిస్తే.. నీటి ఆధారిత లూబ్రికెంట్లు మాత్రమే వాడండి. నూనె లేదా చమురు ఆధారిత లూబ్‌ల వల్ల కండోమ్‌కు ఉండే రబ్బరు బలహీనపడుతుంది.
❤ స్ఖలనం తర్వాత కండోమ్ తొలగించడం లేదా?: సెక్స్ తర్వాత అలసటతో పార్టనర్‌ను గట్టిగా కౌగిలించుకుంటారు. ఆ సమయంలో కండోమ్ తొడిగిన అంగాన్ని బయటకు తీయనట్లయితే నష్టం తప్పదు. కండోమ్ వదులుగా మారి.. వీర్యం ఆమెలోకి ప్రవేశించవచ్చు. అదే జరిగితే కండోమ్ ఉపయోగించినా ఫలితం ఉండదు.
❤ గోర్లతో జాగ్రత్త.. పరిశుభ్రత చాలా ముఖ్యం: హ్యాండ్‌జాబ్ ఎక్కువగా చేసేవారు తప్పకుండా తమ చేతి గోర్లను తొలగించుకోవాలి. ఎందుకంటే.. ఆ గోళ్లు గుచ్చుకోవడం వల్ల రహస్యాంగాలకు గాయాలయ్యే ప్రమాదం ఉంది. అలాగే కలయికకు ముందు, ఆ తర్వాత ప్రైవేట్ భాగాలను శుభ్రం చేసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. ఎందుకంటే.. వాటి వల్ల ఇన్ఫెక్షన్ ఏర్పడే ప్రమాదం ఉంది.
❤ అతి వేగం.. అతి నెమ్మది వద్దు: శృంగారాన్ని ఒకే స్పీడుతో సాగించడం బోరు కొడుతుంది. అప్పుడప్పుడు పురుషుడు తన వేగాన్ని పెంచుతూ రఫ్‌గా చేయాలి. అప్పుడప్పుడు సున్నితంగా చేయాలి. శీఘ్రస్కలనం కాకుండా ఉండాలంటే.. స్టాప్ అండ్ స్టార్ట్ చేయాలి. అంటే.. ఆపి ఆపి చేయాలి.
❤ సెక్స్ తర్వాత మూత్ర విసర్జన చేయొచ్చా?: మహిళలు సెక్స్ తర్వాత మూత్ర విసర్జన చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు. శృంగారం సమయంలో పాసయ్యే బ్యాక్టీరియాను బయటకు పంపడానికి ఇది సహాయపడుతుంది. ఇది UTI ని నిరోధించడంలో సహాయపడుతుంది. పురుషులు కూడా తమ ప్రైవేట్ పార్ట్‌ను శుభ్రం చేసుకోవాలి.
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
❤ కండోమ్ కొనలో కాస్త ఖాళీ ఉండాలి: చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల కండోమ్‌ను పూర్తిగా తొడిగేస్తారు. దానివల్ల వీర్యానికి స్థలం ఉండదు. ఫలితంగా కండోమ్ చిట్లిపోయే అవకాశం ఉంది. కాబట్టి.. కండోమ్ తొడిగేప్పుడు కొనలో కాస్త ఖాళీ ఉండేలా చూడండి. గాలి చొరబడకుండా జాగ్రత్తపడండి. గాలి ప్రవేశిస్తే.. అది బుడగలా మారి పగిలిపోయే అవకాశం కూడా ఉంది.
Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!
❤ ఒకేసారి రెండు కండోమ్‌లు వాడొచ్చా?: కొందరు సేఫ్టీ గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తారు. ఒకటి చిరిగినా మరొకటి ప్రొటెక్ట్ చేస్తుందని భావిస్తారు. దీంతో రెండేసి కండోమ్‌లు ధరిస్తారు. దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఎందుకంటే.. రెండు కండోమ్‌ల మధ్య జరిగితే రాపిడి వల్ల రెండి కండోమ్‌లు విచ్ఛిన్నయ్యే అవకాశాలున్నాయి.
Also Read: ఛీ.. యాక్.. ఈ ఆహారాన్ని లొట్టలేసుకుని మరీ తింటారట, ఇది ఏమిటో తెలుసా?
Also Read: ఈ ఊరిలో ప్రజలంతా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఇదో భిన్నమైన గ్రామం
Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి