అన్వేషించండి

Kobbari Vadalu Recipe : తెలంగాణ స్పెషల్ కొబ్బరి వడ.. టేస్టీగా చేసుకోగలిగే ఈజీ రెసిపీ

Coconut Vada : మీకు కొబ్బరి వడలు తెలుసా? వీటి సరైన రుచి తెలియాలంటే మీరు తెలంగాణ స్టైల్​ కొబ్బరి వడలు తినాల్సిందే అంటున్నారు. ఈ టేస్టీ వడలు తయారు చేసేందుకు ఈ రెసిపీ ఫాలో అయిపోండి.

Telangana Recipes : తెలంగాణ వంటలకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే మీరు కూడా వాటిని ట్రై చేయాలనుకుంటే కొబ్బరి వడలను ట్రై చేయవచ్చు. వీటినే కొబ్బరి గారెలు, కొబ్బరి చెక్కలు అని కూడా అంటారు. దీనిని ఛాయ్​కి బెస్ట్​ కాంబినేషన్​గా చెప్తారు. ఉదయమైనా.. సాయంత్రమైనా స్నాక్​గా చేసుకోగలిగే రెసిపీలలో ఇదీ కూడా ఒకటి. పైగా దీనిని తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. అయితే వీటిని ఇతర ప్రాంతాలలో కూడా చేస్తారు కానీ.. తెలంగాణలో చేసే దీని రెసిపీ కాస్త డిఫరెంట్​గా ఉంటుంది. అంతేకాకుండా రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు 

బియ్యం  పిండి - 1 కప్పు

పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు

అల్లం - అంగుళం

జీలకర్ర - 1 స్పూన్

పచ్చిమిర్చి - 4

ఉప్పు - రుచికి తగినంత 

వేడి నీరు - అవసరానికి తగినంత 

నూనె - డీప్​ ఫ్రైకి సరిపడనంత 

తయారీ విధానం

ముందుగా అల్లం పై తొక్కను తీసి.. పచ్చిమిర్చి, అల్లాన్ని కడిగి మిక్సీ జార్​లోకి తీసుకోవాలి. వాటిలో జీలకర్ర కూడా వేసి మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి గిన్నె పెట్టి దానిలో నీరు వేసి మరిగించండి. స్టౌవ్ ఆపేసి.. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానిలో బియ్యం పిండి, తురిమిన కొబ్బరి, ముందుగా తయారు చేసుకున్న అల్లం ముద్దను వేసి బాగా కలపాలి. దానిలో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అనంతరం దానిలో వేడి నీళ్లు కొంచెం కొంచెంగా వేస్తూ.. చెంచాతో మిక్స్ చేయాలి. వేడి తగ్గాక.. పూరీ పిండిలా బిగుతుగా చేతితో ఒత్తుకోవాలి. 

ఇప్పుడు ఓ పాలిథిన్ షీట్​ లేదా బటర్ షీట్​ తీసుకోండి. పాలిథిన్ షీట్ తీసుకుంటే దానిలో కాస్త నూనె అప్లై చేయండి. స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టి దానిలో డీప్​ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేయండి. అది కాగిన తర్వాత.. చేతులకు కాస్త నీటిని అప్లై చేసి పాలిథిన్ కవర్​పై పిండిని పెట్టి దానిని ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న వడలను నూనెలో వేయాలి. మిగిలిన పిండితో కూడా ఇదే మాదిరిగా వడలు ఒత్తుకుని.. నూనెలో వేయాలి. ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు కూడా తిప్పి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పూర్తిగా వేగిన తర్వాత వాటిని టిష్యూలపై వేసుకోవాలి. వీటిని ఛాయ్​తో తింటే చాలా బాగుంటుంది. 

ఈ కొబ్బరి వడలు రెండు మూడు రోజుల వరకు తాజాగా ఉంటాయి. పైగా ఇవి ఏమాత్రం గట్టిగా ఉండవు. పైన క్రంచీగా, లోపల మృదువుగా ఉంటాయి. అయితే ఇవి ఎక్కువ నూనె పీల్చుకుంటాయి అనుకునేవారు కచ్చితంగా ఓ టిప్​ని ఫాలో అవ్వాలి. పిండి కాస్త గట్టిగా ఉంటే నూనె ఎక్కువ పీల్చుకోదు. వడలు తక్కువ నూనెను గ్రహిస్తాయి. కానీ పిండి ఎక్కువ లూజ్​గా ఉంటే అవి ఎక్కువ నూనెను పీల్చుకుంటాయి. కాబట్టి పిండిని కలిపే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఛాయ్ పార్టనర్​ని తయారు చేసి.. హాయిగా లాగించేయండి.

Also Read : ప్రసాదం స్టైల్ చింతపండు పులిహోర.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Maoists Surrender: దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
Chiranjeevi Venkatesh: మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
Advertisement

వీడియోలు

ప్రపంచంలోనే మొట్టమొదటి ఏలియన్ టెంపుల్ మిస్టరీ
India vs South Africa First ODI | నేడు భారత్ సఫారీ మధ్య మొదటి వన్డే
Ind vs SA ODI KL Rahul | కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Faf du Plessis Out of IPL 2026 | IPLకు స్టార్ ప్లేయర్ గుడ్​బై
BCCI Meeting With Rohit, Kohli | రో-కోతో గంభీర్ సమావేశం?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Maoists Surrender: దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
Chiranjeevi Venkatesh: మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
Andhra King Taluka Collections : 'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
Marriages in 2026: డిసెంబర్ రెండో వారం నుంచి పెళ్లిళ్లు బంద్.. వచ్చే ఏడాది ముహూర్తాల తేదీలివే
డిసెంబర్ రెండో వారం నుంచి పెళ్లిళ్లు బంద్.. వచ్చే ఏడాది ముహూర్తాల తేదీలివే
Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
SUVs to launch in December 2025: మారుతి నుంచి టాటా వరకు, మార్కెట్లోకి 4 కొత్త SUV లు.. ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వాలి
మారుతి నుంచి టాటా వరకు, మార్కెట్లోకి 4 కొత్త SUV లు.. ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వాలి
Embed widget