Chicken Dosa Recipe: చిటికెలో చికెన్ దోశ, చినుకుల్లో వేడివేడిగా తింటే ఆ రుచే వేరు

రకరకాల దోశలు తిని ఉంటారు. ఇప్పుడు నాన్ వెజ్ చికెన్ దోశ ప్రయత్నించండి.

FOLLOW US: 

దోశకు ఫ్యాన్స్ ఎక్కువ. మసాలా దోశ, రవ్వ దోశ, ఉల్లి దోశ, ఎగ్ దోశ... ఇలా చాలా తిని ఉంటారు కదా. ఇప్పుడు చికెన్ దోశ తిని చూడండి. రుచి మామూలుగా ఉండదు. ఒక్కసారి తింటే మీరే మీరే మళ్లీ మళ్లీ చేసుకుని తింటారు. చేయడం కూడా చాలా సులువు. మసాలా దోశలాగే ముందుగా కూర వండుకుని, తరువాత దోశపై వేసుకుని తినడమే. 

కావాల్సినవి
దోశ పిండి - ఒక కప్పు
చికెన్ ముక్కలు - అరకప్పు
ఉల్లిపాయ తరుగు - పావు కప్పు 
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూను
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను
మిరియాల పొడి - పావు టీస్పూను
కారం - అర టీస్పూను
గరం మసాలా - అర టీస్పూను
టమోటా ప్యూరీ - ఒక స్పూను
కరివేపాకులు - ఒక రెమ్మ
జీలకర్ర - అర టీస్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నెయ్యి - సరిపడినంత
కొత్తిమీర తరుగు - ఒక టీస్పూను

తయారీ ఇలా
1. స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త నూనె వేయాలి. ఆ నూనెలో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. 
2. అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా ప్యూరీ కూడా వేసి వేయించాలి. కరివేపాకులు కూడా వేసి కలపాలి. 
3.   అన్నీ బాగా వేగాక కారం, గరం మసాలా వేసి కలపాలి. కొత్తిమీర తరుగు, ఉప్పు కూడా వేసి వేగనివ్వాలి. 
4. అన్నీ వేగాక అరకప్పు నీళ్లు వేయాలి. నీల్లు సలసల కాగుతున్నప్పుడు చికెన్ ముక్కులు వేసి కలపాలి. 
5. చికెన్ ముక్కల్లో ఎముకలు లేకుండా చూసుకోవాలి. అలాగే చికెన్ దోశ కోసం చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. 
6. చిన్నమంట మీద ముక్కలు ఉడికేలా ఉడికించాలి. చికెన్ మిశ్రమం చిక్కగా అయ్యాక స్టవ్ కట్టేయాలి. 
7. స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాయాలి. నూనె వేడెక్కాక దోశ పిండితో దోశ పోయాలి. 
8. దోశ పైన చికెన్ మిశ్రమం పరవాలి. 
9. అయిదునిమిషాలు దోశెను వేగనిస్తే చికెన్ దోశ రెడీ. 
దీనికి ఏ చట్నీ అవసరం లేదు. చికెన్ మిశ్రమంతోనే దోశెను తినేయచ్చు.వేడివేడిగా తింటుంటే ఆ రుచే వేరు. 

Also read: పిజ్జా, బర్గర్లలో అతిగా చీజ్ వేసుకుని లాగిస్తున్నారా? అయితే ఈ హెచ్చరిక మీకే

Also read: పొట్ట ఆరోగ్యానికి బీరు మంచిదేనంట, చెబుతున్న కొత్త అధ్యయనం

 Also read: పన్నెండు కిలోల ఆ బంగారు నాణెం ఎక్కడుంది? ఎందుకు మనదేశం దాని కోసం వెతుకుతోంది?

Published at : 10 Jul 2022 11:48 AM (IST) Tags: Telugu vantalu Telugu recipes Chicken Dosa Recipe Chicken Dosa Making Chicken Dosa in Telugu

సంబంధిత కథనాలు

Friendship Day: ప్రతి ఫ్రెండ్ అవసరమే, కానీ అవసరం కోసం మాత్రమే కాదు

Friendship Day: ప్రతి ఫ్రెండ్ అవసరమే, కానీ అవసరం కోసం మాత్రమే కాదు

Irregular Sleeping : ఎప్పుడుపడితే అప్పుడు నిద్రపోతున్నారా? ఈ సమస్యలు వచ్చే ప్రమాదముంది- జర జాగ్రత్త సుమీ

Irregular Sleeping : ఎప్పుడుపడితే అప్పుడు నిద్రపోతున్నారా? ఈ సమస్యలు వచ్చే ప్రమాదముంది- జర జాగ్రత్త సుమీ

Friendship Day Wishes Telugu: మీ ప్రియనేస్తానికి తెలుగులో శుభాకాంక్షలు చెప్పండి, మీకు నచ్చే కోట్స్ ఇక్కడ ఎంచుకోండి

Friendship Day Wishes Telugu: మీ ప్రియనేస్తానికి తెలుగులో శుభాకాంక్షలు చెప్పండి, మీకు నచ్చే కోట్స్ ఇక్కడ ఎంచుకోండి

Heart Health: చామదుంపలో ఉండే ఈ గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది

Heart Health: చామదుంపలో ఉండే ఈ  గుణం గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది

Water: నీరు కాదు విషం, భూగర్భజలాల్లో ప్రమాదకర లోహాలు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వ డేటా, ఇలా తాగితే సేఫ్

Water: నీరు కాదు విషం, భూగర్భజలాల్లో ప్రమాదకర లోహాలు ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వ డేటా, ఇలా తాగితే సేఫ్

టాప్ స్టోరీస్

INDW vs AUSW CWG 2022 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా - గోల్డ్ కోసం దేనికైనా రెడీ అన్న హర్మన్!

INDW vs AUSW CWG 2022 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా - గోల్డ్ కోసం దేనికైనా రెడీ అన్న హర్మన్!

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది