By: Haritha | Updated at : 10 Jul 2022 07:42 AM (IST)
జహంగీర్ ముద్రించిన బంగారు నాణెం
మనదేశం నుంచి ఎన్నో విలువైన వస్తువులు దేశం దాటి పరాయి ప్రాంతాలకు వెళ్లిపోయాయి. వాటిల్లో ఒక్కటి ప్రపంచంలోనే అతి పెద్ద బంగారు నాణెం. అది మనదేశానికే చెందినదే, నిజాం రాజుల దగ్గర ఉండేది, ఇప్పుడు మాత్రం ఎక్కడుందో తెలియదు. దానికోసం వెతుకులాట కొనసాగుతోంది. ఈ మధ్యన హైదరాబాద్ లోని మింట్ కాంపౌండ్‌లో బంగారు నాణాల ప్రదర్శన జరిగింది. అందులో ఈ పన్నెండు కిలోల బంగారు నాణెం నమూనాను ప్రదర్శించారు. ఎందుకంటే అది మనదగ్గర లేదు కాబట్టి.
ఎవరు ముద్రించారు?
మొఘలుల వారసుడు జహంగీర్ ఈ బరువైన నాణాలను ముద్రించాడని చెబుతారు. ఆయన ఇలాంటి నాణాలు రెండు ముద్రించాడని అంటా. ఈయన 1605 నుంచి 1627 వరకు మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించారు.వాటిని ఎవరికైనా బహుమతిగా ఇచ్చేందుకు ముద్రించినట్టు చెప్పుకుంటారు. రెండింటిలో ఒకదాన్ని అప్పట్లో తన రాజ్యానికి వచ్చిన ఇరాన్ రాయబారికి ఇచ్చారని, అదే కువైట్లోని ఇస్లామిక్ మ్యూజియంలో ఉందని అంటారు. మ్యూజియాన్ని సందర్శించేవారికి పెద్ద బంగారు నాణెం కనిపిస్తుంది. రెండోది ఏమైంది? అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది.
నిజాం రాజు చేతికి...
జహంగీర్ మనవడు ఔరంగజేబు వరకు ఆ నాణెం మొఘలుల దగ్గరే ఉంది. ఔరంగజేబు మొదటి నిజాం రాజు తండ్రికి బహుమానంగా ఈ రెండో పెద్ద బంగారు నాణాన్ని ఇచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. అయితే అది నిజాముల దగ్గర కొన్ని తరాలుగా కొనసాగుతూ వచ్చింది. కానీ నిజాం రాజ్యం అంతరించిపోయాక భారత ప్రభుత్వం వచ్చింది. అప్పుడు ఆఖరి నిజాం మనవడు అప్పు కోసం ఆ బంగారు నాణాన్ని తీసుకెళ్లి స్విట్లర్లాండ్ లోని ఓ బ్యాంకులో కుదవ పెట్టారు. అయితే ఆ అప్పు అతడు తీర్చకపోవడంతో ఆ బంగారు నాణాన్ని బ్యాంకు వారు వేలం వేసి అమ్మేసినట్టు చెబుతున్నారు. దాన్ని అమెరికాకు చెందిన వ్యక్తి కొనుక్కున్నాడని, అది ఇప్పుడు అమెరికాలోని ఒక మ్యూజియంలో ఉందని వీరు విశ్వసిస్తున్నారు.
భారత్ తెచ్చుకోలేమా?
తిరిగి ఆ బంగారు నాణాన్ని భారత్ తెచ్చుకోవడం చాలా కష్టం. దాన్ని వేలం వేస్తే కొని తెచ్చుకోవాలి తప్ప, ‘అది మాది’ అని అడిగితే ఇచ్చేసే పరిస్థితులు లేవు. చట్టపరంగా ఈ బంగారు నాణెం విషయంలో భారత్ ఏమీ చేయలేదని అభిప్రాయపడుతున్నారు చరిత్ర కారులు.
Also read: కాఫీ కాని కాఫీ, కాఫీ గింజలతో తయారు కాదు కానీ ఇది కూడా కాఫీయే
Also read: మనిషి మాంసం రుచి తెలియాలంటే ఈ బర్గర్ తినాలి, పూర్తిగా తినగలిగితే అవార్డు కూడా
Thyroid: ఈ ఆహారాలు థైరాయిడ్‌ను అదుపులో ఉండేలా చేస్తాయి
Curd: పెరుగు మిలిపోయిందా? ఇదిగో ఈ టేస్టీ వంటలు చేసేయండి
Korean Beauty Tips: ఈ కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్ వినియోగించాలని అనుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Apple: రాత్రి వేళల్లో ఆపిల్ పండ్లు తినకూడదా? తింటే ఏమవుతుంది?
Salt: ఆహారంలో ఉప్పు పూర్తిగా మానేస్తే ఎంత ప్రమాదమో తెలుసా?
Telangana MIM : MIM మాస్టర్ ప్లాన్ - హంగ్ వస్తే హంగామా తప్పదా ?
Bandaru Satyanarayana: బండారు సత్యనారాయణకు బిగ్ రిలీఫ్, బెయిల్ మంజూరు చేసిన కోర్టు
Kannur Squad Review - 'కన్నూర్ స్క్వాడ్' రివ్యూ : మమ్ముట్టి హీరోగా నటించిన మలయాళ సినిమా
KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
/body>