By: Haritha | Updated at : 15 May 2023 09:47 AM (IST)
(Image credit: Pixabay)
Cool Water: గుండెపోటు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య. ప్రతిరోజు లక్షలాదిమందికి గుండెపోటు వస్తున్నట్లు అంచనా. గుండెకు రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల గుండె కండరం చనిపోతుంది. దీనివల్ల గుండెపోటు వల్ల మరణం సంభవించే అవకాశం ఉంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో అడ్డంకులు ఏర్పడినా కూడా గుండెకు నష్టం తప్పదు. గుండెపోటు వల్ల మరణం సంభవించే అవకాశాలు చాలా ఎక్కువ కాబట్టి గుండెపోటుకు కారణం అయ్యే అంశాలను తెలుసుకోవాలి. వాటిపై అవగాహన పెంచుకోవాలి.
వైద్యులు చెబుతున్న ప్రకారం గుండెపోటుకు అత్యంత సాధారణ కారణాలలో ఒకటి ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం లేదా ఫలకాలు ఏర్పడడం. ఇవి రక్తప్రసరణను అడ్డుకొని గుండె పోటుకు గురయ్యే ప్రమాదాన్ని పెంచుతాయి. వాసోస్పాస్మ్ అనే పరిస్థితి ఏర్పడితే గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. వాసోస్పాస్మ్ అంటే అర్థం రక్తనాళాలు కుచించుకుపోవడం. మెదడులో రక్తనాళం ఇరుకైనప్పుడు రక్త ప్రవాహానికి అడ్డు ఏర్పడుతుంది. దీన్ని వాసోస్పాస్మ్ పరిస్థితి అంటారు. అలాగే ధమనుల్లో కూడా ఆకస్మిక వాసోస్మాస్మ్ పరిస్థితి ఏర్పడవచ్చు.
చల్లటి నీటితో...
ఎండల్లో ఇంటికి వచ్చిన వెంటనే చాలామంది చేసే పని ఫ్రిజ్ లోంచి అతి చల్లని నీరు తీసి తాగడం. ఇది ధమనుల్లో ఆకస్మిక వాసోస్పాస్మ్ ఏర్పడడానికి కారణం అవుతుంది. అంటే ధమనులు కూచించుకుపోయి రక్త ప్రవాహానికి అడ్డు తగులుతాయి. ఈ పరిస్థితి గుండెపోటుకు కారణంగా మారుతుంది. కాబట్టి చల్లని నీరు గుండెపోటుకు ట్రిగ్గర్‌గా చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చల్లని నీరును తాగడం మానుకోండి.
ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నప్పుడు శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవడం కోసం చల్లని నీరు తాగుతారు. గుండె సమస్య ఉన్న వారిలో ఇలా చల్లని నీరు తాగడం ప్రాణాంతకమైన కార్డియాక్ అరిథ్మియాను ప్రేరేపిస్తుంది. చల్లని నీరు తాగిన వెంటనే శరీరం తీవ్రమైన ప్రతిస్పందనను చూపిస్తుంది. ఆ ప్రతిస్పందనలో గుండెపోటు కూడా రావచ్చు. కాబట్టి చల్లని నీరు తాగడం తగ్గించాలి.
వైద్యులు చెబుతున్న ప్రకారం ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల అవయవ వ్యవస్థ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. శరీరం నుండి బ్యాక్టీరియా బయటికి పోతుంది. ఆక్సిజన్, పోషకాల రవాణా రక్తం ద్వారా సవ్యంగా జరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. హృదయ స్పందనలో స్థిరత్వం ఉంటుంది. గుండె కొట్టుకునే వేగం పెరగడం, తగ్గడం వంటివి జరగదు. కాబట్టి అతి చల్లని నీరు తాగడం మానుకోవాలి. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటినే తాగడం అలవాటు చేసుకోవాలి.
Also read: విటమిన్ బి12 లోపిస్తే ఖచ్చితంగా చికిత్స తీసుకోవాలి, లేకుంటే ఈ తీవ్ర సమస్యలు రావచ్చు
Also read: జాగ్రత్త, నెయిల్ పాలిష్ వల్ల ప్రాణాంతకమైన అలెర్జీ - కదలికలు కోల్పోయిన చేతి వేళ్ళు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Dreams Meaning: మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? త్వరలో మీకు పెళ్లికాబోతుందని అర్థం!
Diabetes: డయాబెటిస్ బాధితులకు వేసవి చాలా డేంజర్ - ఇలా అదుపులో ఉంచుకోండి
ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్‌తో హార్ట్ ఫెయిల్యూర్ ముప్పును ముందే తెలుసుకోవచ్చట!
World No Tobacco Day: సిగరెట్ ఊపిరితిత్తులనే కాదు మీ కంటి చూపుని కాల్చేస్తుంది, తస్మాత్ జాగ్రత్త!
WeightLoss: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? ధనియాల నీళ్లతో త్వరగా తగ్గొచ్చు
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !